అన్వేషించండి

Bigg Boss 7 Telugu Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 - అల్రెడీ హౌస్‌లోకి అడుగుపెట్టేసిన 9 మంది కంటెస్టెంట్స్ వీరే!

బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ లాంచ్‌కు ఇంకా ఎక్కువ సమయం లేదు. కాబట్టి బిగ్ బాస్ టీమ్.. ఈ లాంచ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికీ ఎంతోమంది పేర్లు బయటికి వచ్చాయి. అలా ఎన్నో లిస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ అన్నింటిలో కొన్ని పేర్లు మాత్రం కామన్‌గా కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ లాంచ్‌కు ఇంకా ఎక్కువ సమయం లేదు. కాబట్టి బిగ్ బాస్ టీమ్.. ఈ లాంచ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఆ ప్రోమోను బట్టి చూస్తే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో కన్ఫర్మ్ అయిన 9 మంది కంటెస్టెంట్స్ వీరే అని కచ్చితంగా చెప్తున్నారు నిపుణులు. ఆ 10 మంది ఎవరంటే..

ప్రియాంక జైన్

తను తెలుగుమ్మాయి కాదు.. కానీ ‘మౌనరాగం’ అనే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. మొదటి సీరియల్‌తోనే అందరినీ ఆకట్టుకున్న ప్రియాంక జైన్.. మెల్లమెల్లగా తెలుగు సీరియల్స్‌లో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటూ ఇక్కడే సెటిల్ అయిపోయింది. చాలామంది బుల్లితెర ప్రేక్షకులు, సీరియల్ లవర్స్.. ప్రియాంకను తమ పక్కింటి అమ్మాయిగా భావిస్తారు. తెలుగుతో పాటు పలు కన్నడ సీరియల్స్‌లో కూడా హీరోయిన్‌గా నటించింది ప్రియాంక జైన్.

టేస్టీ తేజ

ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఎవరో ఒక యూట్యూబర్ ఉండడం ఆనవాయితీ. అలాగే ఈసారి యూట్యూబర్ కేటగిరి నుండి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవుతున్నాడు టేస్టీ తేజ. ఈరోజుల్లో సినిమా ప్రమోషన్స్ అనేవి చాలా డిఫరెంట్‌గా ఉంటేనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా తనతో పాటు ఫుడ్‌ను టేస్ట్ చేయిస్తూ సినిమా ప్రమోషన్స్‌కు కొత్త రకమైన కాన్సెప్ట్‌ను అందించాడు టేస్టీ తేజ. ముందుగా జబర్దస్త్‌తో కామెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తేజ.. ప్రస్తుతం టేస్టీ తేజగా ఫేమస్ అయిపోయాడు.

అమర్‌దీప్ చౌదరీ

అమర్‌దీప్.. చాలాకాలం ముందే సీరియల్స్‌లో ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యాడు. మెల్లగా హీరోగా ఎదిగాడు. కానీ స్టార్ మాలో హీరోగా చేసిన సీరియల్స్ అమర్‌దీప్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రియాంక జైన్‌తో అమర్‌దీప్ కెమిస్ట్రీ బాగుంటుందని బుల్లితెర ప్రేక్షకులు ఫీలవుతుంటారు. అసలైతే వీరి కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా చాలామంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా అమర్‌దీప్.. మరో సీరియల్ నటి తేజస్వినిని పెళ్లి చేసుకున్నాడు.

శివాజీ

ఒకప్పుడు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శివాజీ. ఆ తర్వాత పెరుగుతున్న పోటీ మధ్య తనకు హీరోగా అవకాశాలు రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్.. ఇలా ఎలాంటి అవకాశాలు వచ్చినా ఒప్పుకున్నాడు. కానీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు శివాజీ. దీంతో తన చుట్టూ పలు కాంట్రవర్సీలు కూడా క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఈ 47 ఏళ్ల హీరో బిగ్ బాస్ ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు.

షకీలా

ఒకప్పుడు షకీలా పేరు చెప్తే ఇండియా అంతా ఒక ఊపు ఊగిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో చాలా బోల్డ్‌గా నటించిన హీరోయిన్స్‌ను వేళ్లపైన లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో షకీలా కూడా ఒకరు. ఎవరు ఏమంటున్నారు అని పట్టించుకోకుండా షకీలా అడల్ట్ సినిమాల్లో బోల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అప్పటి యూత్‌ను తనవైపు తిప్పుకుంది. కేవలం తెలుగు మాత్రమే కాదు మలయాళ, తమిళం, కన్నడ లాంటి ఇతర సౌత్ భాషల్లో కూడా తను బోల్డ్ సినిమాలు చేసింది.

ఆట సందీప్

ఆట అనే డ్యాన్స్ షో ద్వారా ఎంతోమంది డ్యాన్సర్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో సందీప్ కూడా ఒకరు. ఆట షోలో తన పర్ఫార్మెన్స్ అందరికీ గుర్తుండిపోయింది కాబట్టి తన పేరు కూడా ఆట సందీప్‌గా మారిపోయింది. కేవలం డ్యాన్సర్‌గానే కాదు.. నటుడిగా కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు సందీప్. తనకు ఏదైనా నచ్చకపోతే, కోపం వస్తే వెంటనే బదులు చెప్పడం సందీప్ లక్షణం. బిగ్ బాస్‌కు, అది చూసే ప్రేక్షకులకు కూడా ఆట సందీప్ ద్వారా చాలా ఎంటర్‌టైన్మెంట్ లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

కిరణ్ రాథోడ్

ఒకప్పుడు తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది కిరణ్ రాథోడ్. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కేవలం తమిళంలో మాత్రమే కాదు.. తెలుగు, హిందీలో కూడా హీరోయిన్‌గా గుర్తింపు సాధించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అందులో చాలావరకు హిట్ టాక్ అందుకున్నాయి. బాలీవుడ్‌లో సైతం హృతిక్ రోషన్ లాంటి స్టార్‌తో కలిసి నటించింది.

అబ్బాస్

కొంతమంది నటీనటులను గుర్తుపెట్టుకోవాలంటే.. వారు వందలకొద్దీ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే ఒక్క సినిమా చేసినా చాలు.. అలా ‘ప్రేమదేశం’ అనే చిత్రం ద్వారా అబ్బాస్.. ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించినా కొన్నాళ్ల క్రితం ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌లో సెటిల్ అయిపోయాడు. తాజాగా ఇండియా తిరిగొచ్చాడు. అదే సమయంలో బిగ్ బాస్ ఆఫర్ తనను వరించినట్టు తెలుస్తోంది.

శోభా శెట్టి

కన్నడలో సీరియల్ నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన శోభా.. తెలుగులోని ‘కార్తికదీపం’ సీరియల్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అంతే కాకుండా ఈ సీరియల్‌లో హీరో, హీరోయిన్‌కు ఎంతగా గుర్తింపు వచ్చిందో విలన్‌గా డాక్టర్ మోనిత పాత్ర చేసిన శోభాకు కూడా అంతే గుర్తింపు లభించింది. ఇప్పటికీ చాలామంది బుల్లితెర ప్రేక్షకులు తనను మోనిత అన్న పేరుతోనే గుర్తుపెట్టుకున్నారు. ‘కార్తికదీపం’లో తన పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది.

Also Read: అందుకే ఆ పాత్ర ఒప్పుకోలేదు: ‘విక్రమ్’లో విజయ్ సేతుపతి క్యారెక్టర్‌పై లారెన్స్ కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Embed widget