అన్వేషించండి

Bigg Boss 7 Telugu Contestants Remuneration: ఆ ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్‌కు అదిరిపోయే రెమ్యునరేషన్ - బుల్లితెర సూపర్ స్టార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటుంది సీనియర్ హీరో శివాజీ అని సమాచారం.

అవకాశాలు, పనులు వదులుకుని ‘బిగ్ బాస్’కు వెళ్లడమంటే రిస్క్ చేస్తున్నట్లే. అందుకే, నిర్వాహకులు పెద్దగా ఛాన్సుల్లే కంటెస్టెంట్లను వెతికి మరీ తీసుకొస్తారు. ఎన్ని రోజులుంటే అన్ని రోజులకు తగిన వేతనం కూడా ఇస్తారు. రోజులు పెరిగే కొద్ది వారి పాపులారిటీ కూడా పెరిగిపోతుంది. దీంతో రెమ్యునరేషన్ కూడా క్రమేనా పెరుగుతుందని టాక్. మరి, ఈసారి పనులన్నీ వదులుకుని ‘బిగ్ బాస్’లోకి వచ్చినవారి పరిస్థితి ఏమిటీ? వారిలో ఎవరికి ఎంత ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పారితోషకాల లెక్కలు ఇలా ఉన్నాయి.

రెమ్యునరేషన్‌లో ఫస్ట్ స్థానంలో ఉన్నది ఎవరంటే..
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటుంది సీనియర్ హీరో శివాజీ అని సమాచారం. హీరో శివాజీకి ఒకప్పుడు టాలీవుడ్‌లో విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ గత కొంతకాలంగా ఆయన వెండితెరపై కనిపించడమే మానేశారు. అయినా కూడా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి.. ఆయనను షోలోకి తీసుకుందట బిగ్ బాస్ టీమ్. బిగ్ బాస్‌లో ఉండడం కోసం శివాజీ వారానికి రూ.4 లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్నారట.

నటులకే ప్రాధాన్యత..
శివాజీ తర్వాత స్థానంలో రెమ్యునరేషన్ విషయంలో ఉన్న కంటెస్టెంట్ షకీలా. ఆమె వారినికి రూ.3.5 లక్షలు రెమ్యునరేషన్‌గా అందుకుంటున్నారట. ఒకప్పుడు బోల్డ్ సినిమాలలో నటించిన షకీలా.. ఇప్పుడు ఒక లక్ష్యంతో బిగ్ బాస్‌లోకి వచ్చారు. అందుకే ఆ లక్ష్యం నెరవేరాలని చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఆ తర్వాత స్థానంలో అలనాటి నటి కిరణ్ రాథోడ్.. రూ.3 లక్షల రెమ్యునరేషన్‌తో ఉన్నారు.

ఇప్పటివరకు ఆర్టిస్టులకు ఎక్కువగా రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇక ఆర్టిస్టుల తర్వాత స్థానంలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు డ్యాన్సర్ ఆట సందీప్. బిగ్ బాస్ కోసం తన రెమ్యునరేషన్ వారానికి రూ.2.75 లక్షలు. రెమ్యునరేషన్ విషయంలో లిస్ట్‌లో తన తరువాతి స్థానంలో ఇద్దరు ఉన్నారు. సీరియల్ నటులు ప్రియాంక జైన్, అమర్‌దీప్.. ఈ ఇద్దరికి వారానికి రూ.2.50 లక్షలు రెమ్యునరేషన్‌గా అందుతున్నాయి. ఇక మరో సీరియల్ నటి శోభా శెట్టికి కూడా వారికంటే కొంచెం తక్కువ అయినా రూ.2.25 లక్షలు రెమ్యునరేషన్‌గా అందుతోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీపై అనుమానాలు..
బిగ్ బాస్ సీజన్ 7లో వారానికి రూ.2 లక్షలు రెమ్యునరేషన్‌గా అందుకుంటున్న వారి లిస్ట్‌లో సింగర్ దామిని, శుభశ్రీ ఉన్నారు. ఇక వారి తర్వాత డాక్టర్ కమ్ యాక్టర్‌కు రూ.1.75 లక్షలు రెమ్యునరేషన్‌గా అందుతున్నాయి. టెస్టీ తేజ, ప్రిన్స్ యావర్‌కు రూ.1.50 లక్షల రెమ్యునరేషన్ ఇస్తుంది బిగ్ బాస్ టీమ్. రైతుబిడ్డగా బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‌కు రూ.1 లక్ష రెమ్యునరేషన్ అందుతున్నట్టు సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్ 7 కేవలం 14 మందితోనే ప్రారంభం అయ్యిందేంటి అనుకుంటున్న ప్రేక్షకులు ఫస్ట్ వీక్‌లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందేమో అని భావిస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర సూపర్ స్టార్‌గా పిలిపించుకొనే సీరియల్ నటుడు ప్రభాకర్.. వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

Also Read: ఆ కారణం వల్లే రాజీవ్‌తో పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకే మా ఇద్దరికీ గొడవలు: సుమ కనకాల

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget