అన్వేషించండి

ఆ కారణం వల్లే రాజీవ్‌తో పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకే మా ఇద్దరికీ గొడవలు: సుమ కనకాల

బుల్లితెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న సుమ కనకాల గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల తో ప్రేమ, పెళ్లి విషయాల గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో సుమ - రాజీవ్ కనకాల జంట కూడా ఒకటి. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్స్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు. సుమ బుల్లితెరపై వరస షోలు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ బిజీగా మారుతుండగా, అటు రాజీవ్ కనకాల అగ్ర హీరోల సినిమాల్లో విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. 1999లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సుమ, రాజీవ్ కనకాల జంట మధ్య విభేదాలు నెలకొన్నాయని, విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ పలు ఇంటర్వ్యూల్లో ఈ జంట విడాకుల వార్తలను కొట్టి పారేశారు. అయితే గతంలో సుమ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజీవ్ కనకాలతో ప్రేమ, పెళ్లికి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ మేరకు ఆ ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతూ.. "రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మా ఫ్యామిలీ నుంచి ఎక్కువగా ఇబ్బందులు వచ్చాయి. మా పేరెంట్స్ కి అసలు ఇష్టం లేదు. ఇప్పుడు పెళ్లి అవసరమా? మళ్లీ మనం కేరళ వెళ్ళిపోదాము, నాన్నగారు రిటైర్ అవుతున్నారు అని మా అమ్మ చెప్పింది. కానీ నేను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినప్పుడు మెలమెల్లగా వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత మా రెండు ఫ్యామిలీస్ మాట్లాడుకుని ఓకే చేశారు. అంతకంటే ముందు మా పేరెంట్స్ నన్ను చాలా రిస్ట్రిక్ట్ చేశారు. ఒక వారం రోజులపాటు ఇంట్లోనే ఉంచారు. ఫోన్ కూడా మాట్లాడనివ్వలేదు. షూటింగ్ కి వెళ్లినా మా అమ్మ నాతోనే ఉండేది. ఇంకా ఎక్కువగా రిస్ట్రిక్ట్ చేసేది" అని సుమ తెలిపారు.

ఇక ఆ తర్వాత.. "రాజీవ్ నాకు మొదట ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత నాతో మెల్లి మెల్లిగా మాట్లాడటం, కలవడంతో మా మధ్య చనువు పెరిగింది. దాంతో నా బిహేవియర్ తనకి బాగా నచ్చింది. ఇక నేను కూడా చూడ్డానికి బావున్నాడు.. ఒక సినిమా హీరో లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి అనుకున్నా. ఆ సమయంలో రాజీవ్ ఇంకా సినిమాల్లో ఎక్కువ పాపులర్ కాలేదు. అయినా కూడా బాగున్నాడు కదా అని అనుకున్నా. కానీ రిస్ట్రిక్షన్స్ అన్ని మనసులో పెట్టుకున్నాక.. ముందు వద్దనుకున్నా. అది కూడా పేరెంట్స్ వల్ల వద్దనుకున్నా. కానీ ఆ తర్వాత రాజీవ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి విన్నప్పుడు ఒక మంచి మనిషిని మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. దాంతో రాజీవ్‌ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. అలా మా జర్నీ స్టార్ట్ అయింది" అని అన్నారు.

పెళ్లి చేసుకున్నాక ఎక్కడో చోట భార్యాభర్తల మధ్య గొడవలు అనేది వస్తూ ఉంటాయి. మీ లైఫ్ లో వచ్చాయా? అనే ప్రశ్నకు బదిలిస్తూ.. "మా మధ్య గొడవలు చాలా వస్తాయి. వారంలో ఒకటి రెండు సార్లు వస్తూనే ఉంటాయి. ఇద్దరం ఒక రేంజ్ లో గొడవ పడతాం. ఆ తర్వాత మళ్లీ మామూలు అయిపోతాం. బాగా గొడవ జరిగినప్పుడు ఒక్కోసారి మాట్లాడుకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు మేమిద్దరం మాట్లాడకుండా ఒక 15 రోజులు ఉన్నాం. మా ఇద్దరిలో ముందుగా కోపం వచ్చేది మా ఆయనకే. కాంప్రమైజ్ అయ్యేది కూడా ఆయనే. ఒక్కోసారి నా మిస్టేక్ ఉన్నప్పుడు నేను ముందు కాంప్రమైజ్ అవుతా. కానీ ఎక్కువసార్లు కాంప్రమైజ్ అయ్యేది మాత్రం తనే. నాకు రాజీవ్ లో అతని కోపం అంటే అసలు నచ్చదు. అతనిలో కోపం చాలా ఫాస్ట్ గా వస్తుంది. అంతే ఫాస్ట్ గా కు వెళ్తుంది. కానీ ఆ కోపం రావడమే ఒక రేంజ్ లో వస్తుంది. అది నాకు నచ్చదు. ఇక అంతకుమించి రాజీవ్లో నచ్చనిది ఏదైనా ఉందంటే టైమింగ్స్. నేను ఒక టైమింగ్ ఫిక్స్ చేస్తే రాజీవ్ దాన్ని ఇంకాస్త పొడిగిస్తాడు. ఈ విషయంలో కూడా మా మధ్య గొడవలు జరుగుతాయి" అంటూ చెప్పుకొచ్చింది సుమ.

Also Read : ఓటీటీలోకి 'మార్క్ ఆంటోనీ' - విడుదలకు ముందే స్ట్రీమింగ్ రైట్స్‌పై ఒప్పందం

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Indraja: స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
Fauzi Vs Spirit: 'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
Mandaadi Collections: 'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
Kiara Advani: మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్
మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Shreyas Iyer Breaks Virat Kohli Record: కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Embed widget