Telugu Bigg Boss Season 9: తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తున్న శ్రీజ సహా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్! ఇదైనా వర్కౌట్ అవుతుందా?
Telugu Bigg Boss Season 9: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 సీజన్ పేలవంగా ఉంటోంది. వెళ్లిన వాళ్లంతా ఒకట్రెండు రోజులు హడావుడి చేసి తర్వాత డల్ అయిపోతున్నారు. మిగతా రోజులు షో చూడటానికి జనాలు ఆసక్తి చూపడం లేదు.

Telugu Bigg Boss Season 9: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9ను ఇంట్రెస్టింగ్ మార్చేందుకు ఆ టీం చాలా కష్టపడుతోంది. ఒక్కో ఎపిసోడ్ బాగుంటుంది. మరికొన్ని పేలవంగా ఉంటున్నాయి. కంటిన్యూగా చూస్తే మాత్రం షో చాలా సాదాసీదాగా నడుస్తోంది. అందుకే ప్రతి వారం ఏదో రూపంలో కంటెంట్ ఇచ్చి షోను పైకి తీసుకురావాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన వారిని హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు బిగ్‌బాస్ టీం ప్లాన్ చేస్తోంది. అందులో కొందర్ని పర్మినెంట్‌గా ఉంచాలని కూడా చూస్తున్నారట.
బిగ్‌బాస్‌హౌస్‌లో ఈ వారం పెట్టిన టాస్క్‌లు అంతగా ఆకట్టుకోవడం లేదు. ఫన్ జనరేట్ అవుతుందని పెట్టిన దొంగల టాస్క్ అటర్ ఫెయిల్యూర్ అయ్యింది. అందుకే గురువారం ఎపిసోడ్‌లో ఇద్దరు సీజన్ 7 కంటెస్టెంట్స్‌ను తీసుకొచ్చారు. అమర్దీప్, అంబటి అర్జున్ హౌస్‌లోకి పోలీసుల వేషంలో హౌస్‌లోకి వచ్చారు. వారి నుంచి కూడా కావాల్సినంత కామెడీ పండలేదు. వారి ప్రయత్నం కూడా ఫెయిల్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఈ వారంలోనే మరో ట్విస్ట్ ఇవ్వాలని చూస్తోంది. అందులో భాగంగానే ఎలిమినేట్ అయిన శ్రీజ, భరణి, హరీష్, ప్రియ, ఫ్లోరా, మనీష్‌ను హౌస్‌లోకి తీసుకొస్తున్నారు. శ్రష్టి వర్మ కు కాల్ వచ్చినా ఆమెకు ఉన్న సినిమా షూటింగ్స్ కారణంగా రావడం లేదు.
వీళ్లను సోమవారం ఎపిసోడ్‌లో చూడొచ్చు. హౌస్‌మీట్స్‌ను నామినేట్ చేయడానికి వీళ్లు వస్తారు. దీంతో ఎపిసోడ్ మరో లెవల్‌కు చేరుతుంది. ఇప్పటికే అన్ని ఎపిసోడ్స్, లైవ్ చూసి ఉన్నందున గేమ్‌ను మారుస్తారని ఎలిమినేటెడ్ ప్లేయర్స్‌పై బిగ్‌బాస్ గంపెడాశలు పెట్టుకుంది. వీరంతా ఇప్పుడు హౌస్‌లో ఉన్న సభ్యులను నామినేట్ చేయడమే కాకుండా వారిలో చాలా మంది వారంపాటు హౌస్‌లోనే ఉంటారని కూడా తెలుస్తోంది. మరికొన్ని రోజులు ఉండేందుకు ఎవరు అర్హులు అనే పోల్ అడిగే చాన్స్ ఉంటుంది. అందులో బాగా కంటెంట్ ఇచ్చే వాళ్లను హౌస్‌లో మరికొన్ని రోజులు ఉంచుతారు. మిగతా వారినిపంపేస్తారు.
ఈ వారంలో టాస్క్‌లు బాగా లేనందున, వారి మధ్యలో పెద్దగా వివాదాలు కూడా లేనందున వారు నామినేషన్ చేసుకోవడానికి పెద్దగా పాయింట్స్ లేవు. అందుకే బయట షో చూస్తూ ఇప్పటికే ఆట గురించి తెలిసిన ఎలిమినేటెడ్ హౌస్‌మీట్స్‌ను తీసుకొస్తే కచ్చితంగా ముసుగు తీసి పారేస్తారని భావిస్తున్నారు. అప్పుడు నిజమైన ఆట వెలుగులోకి వచ్చి షో రేటింగ్స్ పెరుగుతాయని అనుకుంటున్నారు. మొన్న శ్రీజ ఎలిమినేషన్ తర్వాత, వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత షోకు మంచి అప్లాజ్ వచ్చింది. అయితే వైల్డ్‌గా వచ్చిన వైల్డ్ కార్డ్స్ మాత్రం చాలా సైలెంట్ అయిపోయారు. అప్పటికే హౌస్‌లో ఉన్న వారి గురించి తెలుసుకొని వారి ఓటింగ్ గురించి అవగాహన ఉండటంతో వారితో కలిసిపోయి ఆడుతున్నారు. దీంతో వైల్డ్ కార్డ్స్ ప్రయోగం కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. వారి ప్రవర్తన కూడా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోంది.
బాగా ఆడుతారని భావించిన రమ్య, సాయి శ్రీనివాస్, మాధురి, పూర్తిగా నిరాశపరిచారు. బాండింగ్స్‌కు వ్యతిరేకం అని చెప్పుకొని ఆ బాండింగ్స్‌లో పడి ఆటను మార్చలేకపోయారు. భరణి వెళ్లిపోయిన తర్వాత ఆ లోటును తీర్చేలా మాధురి ప్రవర్తిస్తున్నారు. వచ్చినప్పటి వైల్డ్‌నెస్ ఆమెలో కనిపించడం లేదు. రమ్య అయితే ఆమె పాయింట్లు ఇతరులకు చెబుతుందో వాటినే ఆమె పాటించడం లేదు. అందుకే ఆమె కూడా ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదు. ఈ వారం ఆమెకు ఎలిమినేషన్ గండం ఉంది. సాయిశ్రీనివాస్ అయితే కనిపించమే మానేశాడు. ఒకరి గురించి మరొకరికి చెప్పడంతోనే ఆయన పని అయిపోతోంది.
ఇలా షోను మరంత పీక్స్‌కు తీసుకెళ్తారని ఆశించిన వారంతా నిరాశపరచడంతో ఇప్పుడు పాతవారినే బిగ్‌బాస్ నమ్ముకుంటోంది. అందులో మొదటి పేరు శ్రీజ. మొదట్లో ఆమె వాయిస్ విని చిరాకు పడ్డవాళ్లంతా తర్వాత ఆమె గేమ్ చూసి బిత్తరపోయారు. ఆమె ఏదైనా విషయం గురించి మొహంపై చెబుతుందనే ట్యాగ్ ఉంది. దీనికి తోడు ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారనే అపవాదు ఉంది. అందుకే ఆమెను తీసుకొస్తే గేమ్‌లో మజ వస్తుందని అనుకుంటున్నారు. ఇలా షోను రక్తికట్టించే మరో ప్లేయర్ హరీష్. ఉన్నన్ని రోజులు ఏదో వివాదంతో హౌస్ అందర్నీ ఆడుకున్న హరీష్, ఇప్పుడు గేమ్‌చాలా ఎపిసోడ్స్ చూసి వస్తే ఆట ఎలా ఉంటుందో ఊహించలేదు. అందుకే అతన్ని కూడా హౌస్‌లోకి తీసుకొస్తున్నారు. మిగతా ఎంతమంది వచ్చినా వీళ్లద్దర్నీ హౌస్‌లో మరికొన్ని రోజులు ఉంచే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు.





















