Bigg Boss Telugu Today Promo : కెప్టెన్ అయిన ఇమ్మాన్యూయేల్.. కళ్లు తిరిగిపడిపోయిన తనూజ, దివ్వెల మాధురి ఎఫెక్టేనా?
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్‌లో కెప్టెన్ రేస్ ముగిసింది. క్లైమాక్స్ వచ్చేసరికి ఇమ్మూ కెప్టెన్ అవ్వగా.. తనూజ కళ్లు తిరిగి పడిపోయింది.

Bigg Boss Captaincy Task Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగులో 7వ వారం కెప్టెన్సీ టాస్క్ ఇప్పటితో ముగిసింది. నిన్నటివరకు దొంగల టాస్క్చేసిన కంటెస్టెంట్లు.. కెప్టెన్సీ కంటెండర్స్ అయి.. ఈరోజు కెప్టెన్ అవ్వడం కోసం టాస్క్ ఆడుతున్నారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో చాలా ట్విస్ట్‌లు పెట్టాడు బిగ్‌బాస్. గత రెండ్రోజులుగా బోర్ కొట్టిన ఆడియన్స్‌కు మంచి స్టఫ్ ఇచ్చినట్టే కనిపిస్తుంది బిగ్‌బాస్. మరి ఈరోజు ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో..
దొంగల టాస్క్‌లో కంటెండర్స్ అయినవారి మధ్య కెప్టెన్సీ టాస్క్ నడిచింది. బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు కెప్టెన్సీ కోసం పెట్టిన టాస్క్ హ్యాట్‌తో వేట అని చెప్పడంతో ప్రోమో మొదలైంది. ముందున్న సర్కిల్ చుట్టూ నిలబడి.. బజర్ మోగినప్పుడల్లా ఆ సర్కిల్ మధ్యలో ఉన్న క్యాప్ తీసుకోవాలని చెప్తాడు. అలా తీసుకున్న క్యాప్‌ని తమకి నచ్చిన కెప్టెన్సీ రేస్‌లో లేనివారికి ఇచ్చి.. ఏ కంటెండర్ అయితే కెప్టెన్ అవ్వకూడదనుకుంటున్నారో.. వారిని ఎలిమినేట్ చేయవచ్చని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో బిగ్‌బాస్ చెప్పడంతో టాస్క్ మొదలైంది.
నిఖిల్‌ను తీసేయడానికే గేమ్
ఈ టాస్క్‌లో తనూజ, ఇమ్మూ, నిఖిల్, కళ్యాణ్, రీతూ, దివ్య నిఖిత పాల్గొన్నారు. ముందుగా హ్యాట్ ఇమ్మూ పట్టుకున్నా.. వారినుంచి నిఖిల్ క్యాప్ తీసుకుని.. కెప్టెన్ సన్నీకి ఇచ్చాడు. దాంతో సన్నీ కళ్యాణ్‌ని ఈ రేసు నుంచి తప్పించాడు. తర్వాత కూడా బజర్ మోగేసరికి ఇమ్మూ క్యాప్ పట్టుకున్నాడు. దానిని సంజనకి ఇస్తాడు. దీంతో సంజన దివ్యని తీసేస్తానని చెప్తుంది. దివ్య మీకు ఇమ్మూ గెలవాలని ఉందా అంటూ సంజనను అడుగుతుంది. సంజన అవును అంటే.. అప్పుడు నిఖిల్‌ని కదా తీసేయాల్సింది అంటూ సీరియస్ అవుతుంది. మీకు అర్థంకాదా గేమ్ అంటూ సీరియస్ అవుతుంది.
సూపర్ గేమ్ ఆడిన ఇమ్మూ
మళ్లీ బజర్ మోగే సరికి ఇమ్మూ క్యాప్ పట్టుకుంటాడు. ఈసారి మాధురికి ఇస్తాడు. బిగ్‌బాస్ నిఖిల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్.. నేను ఈ రేస్‌నుంచి అతనిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నానంటూ చెప్తుంది. మళ్లీ ఇమ్మూ హ్యాట్ తీసుకుని.. మాధురికి ఇస్తాడు. మాధురి రీతూని గేమ్‌నుంచి ఎలిమినేట్ చేస్తున్నాను అని చెప్తుంది. దీంతో రీతూ రీజన్ అడుగుతుంది. వారిద్దరి మధ్య గొడవ అవుతుంది.
ఇమ్మూని కెప్టెన్ చేసిన మాధురి.. ఎఫెక్ట్ అయిన తనూజ
ఫైనల్‌గా ఇమ్మూ, తనూజ మిగులుతారు. బజర్ మోగే సరికి ఇమ్మూ మళ్లీ హ్యాట్ తీసుకొని సంజనకి ఇస్తాడు. దీంతో మాధురి ఇమ్మూని వార్న్ చేస్తుంది. ఇమ్మూ మారిపోతాది అంటూ చెప్పేసరికి.. ఇమ్మూ.. నేను మార్చేస్తాను అంటూ హ్యాట్ తీసుకుని మాధురికి ఇస్తాడు. అయితే మాధురి ఇమ్మూని కెప్టెన్ చేసి.. తనూజని ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ప్రోమో చివర్లో ఇమ్మూ చేతికి కెప్టెన్సీ బ్యాడ్జ్ ఉంటుంది. ఇది ముగిసేసరికి తనూజ కళ్లు తిరిగిపడిపోయింది. ప్రోమో ముగిసింది. మరి ఈరోజు ఏమి జరిగిందో ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.






















