Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 46 రివ్యూ... మాస్ మాధురి టీం తుప్పాస్... సంజన సైలెన్సర్ టీం తోపు... హౌస్‌లోకి పోలీసుల ఎంట్రీ
Bigg Boss 9 Telugu Today Episode - Day 46 Review : బిగ్ బాస్ ప్రస్తుతం మాస్ మాధురి, సంజన సైలెన్సర్ టీంలతో కంటెండర్ టాస్కులు ఆడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హౌస్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

"ఆధిపత్యాన్ని చెలాయించాలంటే బలం అవసరం. ఆ బలాన్ని వాడి డబ్బులు సంపాదించే టాస్క్ "జెండాలు మీ అజెండా". రెండు టీంలలో దమ్మున్న ఇద్దరు పోటుగాళ్ళు ఈ టాస్క్ లో పాల్గొనాలి. ఈ మడ్ టాస్క్ లో ఎక్కువ ఫ్లాగ్స్ సేకరించిన వాళ్ళే విన్" అంటూ బిగ్ బాస్ కొత్త టాస్క్ పెట్టారు. రెడ్ టీమ్ నుంచి ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్... బ్లూ టీం నుంచి గౌరవ్, డెమోన్ ఆడగా, బ్లూ టీం విన్ అయ్యింది. దీంతో సెలబ్రేషన్స్ లో భాగంగా ఓడిన టీం నుంచి ఒకరు 'బిగ్ బాస్' అన్నప్పుడల్లా కోడిలా అరవాలని ఆదేశించారు బిగ్ బాస్. దొరికిందే ఛాన్స్ అని ఇమ్మాన్యుయేల్ ను సెలెక్ట్ చేసుకుని, కోడిలా ఓ ఆటాడించారు బ్లూ టీం.
సంజన వర్సెస్ దివ్య
కెప్టెన్ గౌరవ్ వాష్ రూమ్ క్లీన్ గా లేదు అంటూ దివ్యకు కంప్లైంట్ చేశాడు. అంతలోనే సంజన వచ్చి "వాష్ రూమ్ సరిగ్గా క్లీన్ చేయట్లేదు. పిక్నిక్ కి వచ్చారా?" అంటూ గొడవను స్టార్ట్ చేసింది. అంతేకాదు "వాళ్ళు క్లీన్ చేయరు. నేను డస్ట్ బిన్ కవర్ కూడా మారుస్తా" అని వెళ్ళింది. అది నీ జాబ్ కాదని గౌరవ్ అంటే... "నేనేం పని మనిషిని కాదు" అంటూ రివర్స్ సుమన్ పై మండిపడింది. "నైట్ క్లీన్ చేశారు. మిగిలింది క్లీన్ చేసేలోపు రెడీ అవ్వమని నోటీస్ వచ్చింది" అని సుమన్ సర్ది చెప్పబోయాడు. కానీ వినకుండా "నన్ను బౌల్స్.క్లీన్ చేయమని.చెప్పొద్దు. గొడవ పడండి, ఏమైనా చేయండి. నేను చేయనంటే చేయను" అంటూ వెళ్లిపోయింది. దివ్య వివరణ ఇచ్చినా పట్టించుకోలేదు.
ఈరోజు సంజన సైలెన్సర్ దే
'హ్యూమన్ ఫౌంటెన్' టాస్క్ లో ఒక్కో గ్యాంగ్ నుంచి 5 మంది కంటెస్టెంట్స్ నోట్లో నీళ్ళు నింపుకుని, ఎదురుగా ఉన్న బకెట్ లోకి చిమ్మాలి. ఈ టాస్క్ లో బ్లూ టీం విన్ అయ్యింది. ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ వారమంతా సైలెంట్ అయిన అయేషా ఈ టాస్క్ లో ఆడింది. విన్నింగ్ గ్యాంగ్ సెలబ్రేషన్ కోసం ఓడిన గ్యాంగ్ మోకాళ్ళ మీద నిలబడి, "సంజన సైలెన్సర్ తోపు, మేము తుప్పాస్" అని చెప్పమన్నారు బిగ్ బాస్. రెడ్ టీం దీనికి ఒప్పుకోకపోయినా చేయక తప్పలేదు.
అనంతరం ఒకరి తరువాత ఒకరు వచ్చి ఎవరి దగ్గర ఎంత డబ్బుందో చెప్పమన్నారు. హయ్యెస్ట్ తనూజా దగ్గర 7500 ఉంది. రామూ, రమ్యాల దగ్గర ఏమి లేకపోవడంతో కంటెండర్ టాస్క్ నుంచి తప్పుకున్నారు. టాస్క్ కోసం పవన్ ను రీతూకి డబ్బులు ఇవ్వమని దువ్వాడ మాధురి అడిగింది. కానీ రీతూ అపార్థం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. పవన్ - రీతూ వాష్ రూమ్ లో గొడవ పడగా, ఇమ్మాన్యుయేల్ కామెంటరీతో నవ్వులు పూయించాడు.
ఆట కట్టిస్తారా, కటకటాల వెనక్కి పంపుతారా ?
మాస్ మాధురి, సంజన సైలెన్సర్ ఆట కట్టించడానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ మారువేషంలో దాక్కున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి కరణ్జీత్ గా అమర్దీప్, ఇంద్రజిత్ గా అర్జున్ అంబటి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ అంతా చూసే నెపంతో ఇద్దరు డాన్స్ ను వెతికారు. చెప్పినోళ్లకు వరం అంటూ టెంప్ట్ చేసే ప్రయత్నం చేసినా, ఎవ్వరూ చెప్పలేదు. కానీ మారువేషంలో ఉన్న ఇద్దరినీ కనిపెట్టేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.
Also Read: బిగ్‌బాస్ డే44 రివ్యూ... మాస్ మాధురితో పెట్టుకుంటే మడతడిపోద్ది... హౌస్‌లో కరుడు గట్టిన నేరస్థులు






















