Bigg Boss 6 Telugu: బంతి కోసం ఒకరిపై ఒకరు పడి కుమ్ముకున్న ఇంటి సభ్యులు, పాపం ఆ జంట
Bigg Boss 6 Telugu: కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో ఇంటి సభ్యులు కిందపడి కుమ్మేసుకున్నారు.
Bigg Boss 6 Telugu: ఇనాయ ఆట మానేసి సూర్య పక్కన ఉండటానికే ఇష్టపడుతోంది. ఏ ప్రోమో చూసిన వారిద్దరూ జంటగానే కనిపిస్తున్నారు. ఆరోహి ఉన్నప్పుడు ఇనయాను కనీసం పట్టించుకోలేదు సూర్య. ఆరోహి వెళ్లగానే ఇనయాతోనే ఉంటున్నాడు. అంతవరకు ఇనయా గేమ్ గురించే ఆలోచించేది. సూర్య వల్ల ఆమె ఆట సంగతే మర్చిపోయింది. మొన్నటి వరకు టాప్ 5లో ఉండడం ఆమె గ్యారెంటీ అనుకున్నారంతా. ఇప్పుడు మాత్రం డౌటే.
ప్రోమోలో ఏముందంటే... అవకాశం రాని మిగతా ఇంటి సభ్యులకు ఇంటి సభ్యుల నుంచి వచ్చిన సర్ ప్రైజ్‌లు ఇచ్చే పని కొనసాగించారు బిగ్ బాస్. అందులో భాగంగా వాసంతికి ఓ చిన్న బిడ్డ ఫోటో వచ్చింది. ఆ బిడ్డ ఎవరో తెలియాలంటే ఎపిసోడ్ చూడాలి. ఇక సూర్య, ఇనయా చేయి పట్టుకుని ఏడుస్తూ కనిపించాడు. మా అమ్మ నేను మాట్లాడుతానని ఎదురు చూస్తూ ఉంటుంది అని ఏడ్వడం మొదలుపెట్టాడు. ఓదార్చే బాధ్యతను ఇనయా తీసుకుంది. సూర్యకు తన తల్లి రాసి ఉత్తరాన్ని ఇచ్చారు బిగ్ బాస్. మెరీనా రోహిత్ కు మాత్రం ఏమీ వచ్చినట్టు కనిపించలేదు. రాజశేఖర్ ఆడియోకాల్ మాట్లాడాడు.
అందరూ పోటీ...
బిగ్ బాస్ ఈసారి ఇంటి సభ్యులందరికీ కెప్టెన్సీ కంటెండర్లు అయ్యే అవకాశాన్ని ఇచ్చాడు. కొన్ని బంతులే అక్కడ పెట్టి వాటిని మొదట తమ పేరున్న బుట్టలో ఎవరు పెడతారో వారే కెప్టెన్సీ పోటీదారులు అవుతారని చెప్పాడు. వాటి కోసం ఇంటిసభ్యులంతా పడి కుమ్మేసుకున్నారు. ముందుగా ఆదిరెడ్డి, రేవంత్, రాజశేఖర్ బంతులను దక్కించుకుని తమ బుట్టల్లో పెట్టేసుకున్నారు. శ్రీసత్యకు కూడా బంతి దక్కింది. చివర్లో ఒక్క బంతి కోసం రోహిత్, మెరీనా, బాలాదిత్య, కీర్తి, ఫైమా, సుదీప ఒకరి మీద ఒకరు పడి దొర్లారు. ఆ బంతిని సుదీప దక్కించుకోవడంతో మెరీనా కళ్లనీళ్లు పెట్టుకుంది. తమ ఇద్దరిలో ఒక్కరికీ దక్కలేదని ఆమె బాధపడింది.
View this post on Instagram
Also read: కీర్తికి మానస్ వాయిస్ మెసేజ్? ఇంటి సభ్యుల కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న రోహిత్