అన్వేషించండి

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

తేజస్వి, ముమైత్ ఖాన్, హమీదాలకు స్మోక్ చేసే అలవాటు ఉండడంతో వాళ్లకు కేటాయించిన స్మోకింగ్ జోన్ ఏరియాలలోనే సిగరెట్ కాల్చేవారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ లో కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. వారికోసం హౌస్ లో స్మోకింగ్ ఏరియా ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్లి మాత్రమే స్మోక్ చేయాలి. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కొందరు కంటెస్టెంట్స్ కెమెరాకి కనిపించకూడదని బాత్రూమ్ లోకి వెళ్లి స్మోక్ చేసేవారు. అలా స్మోక్ చేసి అషురెడ్డి ఆల్రెడీ దొరికిపోయింది. పైగా అఖిల్ ఆమెకి సిగరెట్లు, లైటర్ సప్లై చేస్తూ కెమెరా కళ్లు కప్పడానికి ప్రయత్నించాడు. 

తేజస్వి, ముమైత్ ఖాన్, హమీదాలకు స్మోక్ చేసే అలవాటు ఉండడంతో వాళ్లకు కేటాయించిన స్మోకింగ్ జోన్ ఏరియాలలోనే సిగరెట్ కాల్చేవారు. అషురెడ్డి మాత్రం జనానికి తెలియకుండా సీక్రెట్ గా బాత్రూమ్ లో స్మోక్ చేసి కెమెరాలకు దొరికిపోయింది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి సైతం బాత్రూమ్ లో స్మోకింగ్ చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు నటరాజ్ మాస్టర్. 

గతంలో అఖిల్ కూడా ఈ బాత్రూమ్ మేటర్ ని బయటకు తీశాడు కానీ వాటిని నిరూపించడంతో ఫెయిల్ అయ్యాడు. ఏదో వాగేశానని.. తాను మాట్లాడిన దాంట్లో నిజం లేదని నాగార్జున ముందు ఒప్పుకున్నాడు. నటరాజ్ మాస్టర్ హౌస్ లో ఉండగా.. బిందు మాధవి సిగరెట్ల ఇష్యూ గురించి చెప్పలేదు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అతడు మాటల దాడి మరింత పెంచారు. 

దీనిలో భాగంగా బిందు మాధవి బిగ్ బాస్ హౌస్ లో ఎవరికీ తెలియకుండా బాత్రూమ్ లోకి వెళ్లిమరీ సిగరెట్లు తాగేదని.. వాసన రాకుండా గుడ్లు కొట్టేసేదని.. గుడ్లు వరుసగా మిస్ అవ్వడంతో తనకు అనుమానం వచ్చిందని బిందు మాధవిపై ఆరోపణలు చేశాడు. హౌస్ లో ఉన్నప్పుడు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదో మాత్రం చెప్పలేదు నటరాజ్ మాస్టర్. 

నటరాజ్ మాస్టర్ తో పాటు స్రవంతి కూడా ఈ విషయంపై కొన్ని కామెంట్స్ చేసింది. ఆమె హౌస్ లో ఉన్నప్పుడు.. బిందు మాధవి సిగరెట్ల విషయం గురించి అజయ్ తో సీక్రెట్ గా చర్చించింది. బాత్రూమ్ లో సిగరెట్లు తాగుతుందని అజయ్ చెవిలో చెప్పింది. శ్రీరాపాక కూడా బిందు మాధవి స్మోక్ చేస్తుందని లీకులిచ్చింది. ఈ విషయంపై స్పందించిన బిందు మాధవి.. స్మోకింగ్ చేయాలనిపిస్తే అందరి ముందే తాగేదాన్ని కానీ బాత్రూమ్ లోకి వెళ్లి స్మోక్ చేయాల్సిన అవసరం తనకు లేదని తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. 

రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో తన అభిమానులతో మాట్లాడిన ఆమెని.. ఈ బాత్రూమ్ స్మోకింగ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో నిజం లేదని చెప్పింది బిందు మాధవి. తనకు నిజంగానే స్మోక్ చేయాలనిపిస్తే.. ఓపెన్ గా చేసేదాన్ని అంటూ క్లారిటీ ఇచ్చింది. 

Also Read: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్

Also Read: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!

టాప్ హెడ్ లైన్స్

Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget