అన్వేషించండి

BiggBossTelugu 8 Day 4: నోటి దూల మంచిదేనా? తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ విష్ణు ప్రియ

Bigg Boss Telugu Season 8 : విష్ణు ప్రియ అతిగా మాట్లాడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ లో కూడా విష్ణు ప్రియ అలాగే ఉంది..అదే కారణంతో నామినేట్ అయ్యింది.

Bigg Boss Telugu Season 8 : సెలబ్రిటీలు సాధారణంగా ఎక్కడ నోరు జారితే ఏ తలనొప్పి వచ్చి పడుతుందో అన్న ఆలోచనతో ముందు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు. కానీ తాజాగా విష్ణు ప్రియ తనకు నోటి దూల ఉందనే విషయాన్ని ఒప్పుకోవడమే కాకుండా, అబ్బాయిలో అమ్మాయి కనిపించిందని, నోటి దూల వల్లే ఇక్కడిదాకా వచ్చాను అంటూ మరోసారి వింత వాదనను మొదలు పెట్టింది. పైగా తనను మణికంఠ ఎమోషనల్ గా చీట్ చేశాడని, పర్సనాలిటీని చెక్ చేశాడని ఆరోపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. నిజానికి ఈ మూడు రోజులు జర్నీ చేశాక మణికంఠ ఒక హానెస్ట్ పర్సన్ అనుకున్నానని, కానీ అతను అలాంటివాడు కాదంటూ మణికంఠ ముఖంపైనే తేల్చి చెప్పింది. కానీ ఈమె వింత వాదన మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ కు దారి తీసేలా ఉంది.

Read also :BiggBossTelugu 8 Day 4 Promo : తనని తానే ఆడపులిగా డిక్లేర్ చేసుకున్న సోనియా, ఫేష్ వాష్​తో బ్రష్ చేసుకున్న పృథ్వీరాజ్.

నాల్గవ ఎపిసోడ్ లో ఇదంతా జరిగింది. మణికంఠ హౌస్ మేట్స్ లో ఇద్దరినీ నామినేట్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన విష్ణుప్రియ, శేఖర్ ల పేర్లు చెప్పాడు. శేఖర్ హౌస్ లో సీరియస్ గా ఉండడం లేదంటూ నామినేట్ చేసి, కాసేపు ఇద్దరూ వాదించుకున్నారు. అయితే అంతకంటే ముందు విష్ణు ప్రియ, మణికంఠ మధ్య జరిగిన సంభాషణ గురించి మాట్లాడుకోవాలి. తను డిఫెండ్ చేయడానికి ఏమీ లేదు అంటూనే తను అన్నదాంట్లో తప్పేమీ లేదని, ఆరోజు కూడా అదే చెప్పానని వెల్లడించింది. మొదటి రోజే తాను ఈ విషయం గురించి సారీ చెప్పానని చెప్పుకొచ్చింది. తను చెప్పింది కరెక్ట్ అని ఇప్పటికీ అంటున్నానని విష్ణు ప్రియ చెప్పింది. అది నీకు హర్టింగ్ గా ఉంది. కానీ ప్రతి ఒక్కరిలో మస్కులానిటీ, ఫెమినిటి ఉంటుంది అంటూ తను ఎందుకు బరువు తగ్గట్లేదు అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. 

Read also: Bigg Boss 8 Nominations: బిగ్ బాస్‌లో నామినేషన్ల ఫైర్, ఏడిపించిన మణికంఠ- ఫస్ట్ వీక్ నామినేట్ అయింది వీరే

చిన్నప్పుడే తండ్రి చనిపోయి ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్న వారిలో మస్కులానిటీ, ఫెమినిటీ ఉంటాయి, అవి మనిద్దరిలో ఉన్నాయి అనే విషయాన్ని నేను నీకు చాలా సున్నితంగా చెప్పాను. ఇక ఈ రోజుల్లో అబ్బాయిలందరిలోనూ ఫెమినిటీ యాక్టివేట్ కావాలి. కానీ ఎవ్వరూ యాక్టివేట్ చేయట్లేదు అంటూ వాదించడం మొదలు పెట్టింది. ఫెమినైన్ వెర్షన్ అనే పదం నాకు నచ్చలేదు. ఈ మూడు రోజుల్లోనూ నేను నీతో ట్రావెల్ చేశాక నీ నోటి నుంచి ఎలాంటి పదాలు పడితే అలాంటివి రావడం చూసాను. అవి జోవియల్గా అయినా సరే ఈ నెక్స్ట్ టైమ్ నా మీద తీసుకోలేను. అందుకే నీలాంటి వాళ్ళు హౌస్ లో ఉండకూడదు అనుకుంటున్నాను అంటూ ఇచ్చిపడేశాడు. అయితే మన తింగరబుచ్చి మాత్రం అలా నోరు జారడమే తనను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది అంటూ దాన్ని మరింత లాగ్ చేసింది. నా నోటి దూల వల్లనే నేను చేసిన షోలకు టీఆర్పీలు వచ్చాయి అంటూ తను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే ఇండస్ట్రీకి వచ్చానని ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కాదని క్లారిటీ ఇచ్చింది. ఇక చివరికి చీఫ్ యష్మీ కూడా నిజంగానే విష్ణు ప్రియ నోరు జారుతుంది అని చెప్తూ అదే కారణంతో ఆమెను నామినేట్ చేసింది. మొత్తానికి నోటి దూల వల్ల ఈరోజు బిగ్ బాస్ లో ఉన్నాను అన్న విష్ణు ఈరోజు అదే కారణంతో నామినేట్ అవ్వడం గమనార్హం. అయితే విష్ణు నుంచి ఆమె చెప్పినట్టుగానే ఎడ్యుకేషన్ కాదు కనీసం ఎంటర్టైన్మెంట్ ఆశిస్తున్నారు. మరి ఆమె ఎప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget