అన్వేషించండి

Bigg Boss 8 Nominations: బిగ్ బాస్‌లో నామినేషన్ల ఫైర్, ఏడిపించిన మణికంఠ- ఫస్ట్ వీక్ నామినేట్ అయింది వీరే

Bigg Boss Telugu Season 8 1st Week Nominations: తాను ఏం ఆడుతున్నానో ఎలా ఆడుతున్నానో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానని మణికంఠ ఏడ్చేశాడు. నామినేషన్లు, ఎమోషనల్ సీన్లతో.. ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. ఇవాల్టి ఎపిసోడ్ కూడా నామినేషన్ల చుట్టూనే తిరిగింది. నిన్నటి ఎపిసోడ్ కు కొనసాగింపుగా.. నేడు కూడా హౌస్ మేట్స్ తమ అభ్యంతరాలు చెబుతూ నామినేషన్లు కంటిన్యూ చేశారు. దీనికి తోడు.. మణికంఠ సీక్వెన్స్.. హైలైట్ అయ్యింది. తన ఫ్లాష్ బ్యాక్ గురించి మణి పదే పదే చెప్పడాన్ని మిగతా హౌస్ మేట్స్ తప్పుబట్టగా.. అతను అనుకోని రీతిలో ఎమోషనల్ అయ్యాడు. చివరికి బిగ్ బాస్ తో కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడిన మణి.. తాను ఏం ఆడుతున్నానో ఎలా ఆడుతున్నానో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానని ఏడ్చేశాడు. ఇదిలా ఉంటే.. సోనియా కూడా యశ్మీ సెంట్రిక్ గా తన వాయిస్ కొనసాగించింది. నిఖిల్ తో మాట్లాడుతూ.. ఇప్పటికైనా పక్షపాతంగా ఆడకుండా ఉంటావని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇలా.. నామినేషన్లు, ఎమోషనల్ సీన్లతో.. నేటి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.

ముందుగా.. ఆదిత్య ఓం నామినేషన్ తో ఎపిసోడ్ ప్రారంభమైంది. పృథ్వీ, శేఖర్ బాషాపై ఆదిత్య.. నామినేషన్ వేశారు. ఇద్దరి ఆటతీరు తనకు నచ్చడం లేదంటూ పాయింట్స్ క్లుప్తంగా చెప్పాడు. చివరికి ముగ్గురు చీఫ్ లలో ఒకరైన యశ్మీ ముందుకు వచ్చి కత్తిని తీసుకుంది. శేఖర్ బాషా గురించి ఆదిత్య ఓం చెప్పిన పాయింట్లు సరిగ్గా అనిపించాయని చెబుతూ అతని ఫొటోపై కత్తి దింపి.. నామినేషన్ ఖరారు చేసింది. ఈ సీన్ తర్వాత హౌస్ మేట్స్ కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఈ గ్యాప్ లో బేబక్క, నబిల్ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. నబిల్ మరింత ఫైర్ చూపిస్తూ ఆడాలని మాత్రమే తాను నామినేషన్ వేశానని బేబక్క మరోసారి అతని చెప్పేందుకు ప్రయత్నం చేసింది. అందుకు తనకే నబిల్ థ్యాంక్స్ చెప్పాలని బేబక్క అడగడంతో.. ఆ సీన్ సరదాగా గడిచిపోయింది. తర్వాత.. పృథ్వీకి నిఖిల్ ఓ సలహా ఇచ్చాడు. నామినేషన్స్ టైమ్ లో బేబక్కతో మాట్లాడిన తీరు బాగాలేదని.. ఆమెకు వెళ్లి సారీ చెప్పాలని పృథ్వీకి చెప్పాడు నిఖిల్. దీంతో.. బేబక్క దగ్గరికి వెళ్లిన పృథ్వీ.. మనస్ఫూర్తిగా సారీ చెప్పాడు. ఈ సీన్ తర్వాత నామినేషన్ల ప్రక్రియ కంటిన్యూ అయ్యింది.

ఈ సారి కిర్రాక్ సీత వంతు. ప్రేరణ, బేబక్కపై సీత నామినేషన్ వేసింది. ప్రేరణ తనను ఉద్దేశించి ఈగో, సుపీరియర్ లాంటి పదాలు వాడిందని.. అవి తనకు నచ్చలేదని సీత చెప్పింది. హౌస్ లో ఎవరూ ఎవరికీ సుపీరియర్ కాదని.. అందరికీ బిగ్ బాస్ మాత్రమే సుపీరియర్ అని ఆమె తన వాదన వినిపించింది. అయితే.. తన ఉద్దేశాన్ని సీత తప్పుగా అర్థం చేసుకుందని ప్రేరణ బదులిచ్చింది. మరోవైపు.. ఒకే కూర వండుతామని చెప్పి.. మరో వంట చేసేది లేదని చెప్పి.. రాత్రి ఇంకో కూర ఎందుకు వండారంటూ బేబక్కను ప్రశ్నించింది సీత. అయితే వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ల కోసమే తాను మరో కూర వండానని బేబక్క బదులివ్వగా.. అప్పటికే పప్పు ఉందని, మరో కూర అవసరం లేదని ముందు చెప్పి తర్వాత వండడం ఏంటంటూ మరోసారి తన వెర్షన్ వినిపించింది. ఫైనల్ గా చీఫ్స్ నుంచి నైనికి ముందుగా వచ్చి కత్తిని తీసుకుంది. బేబక్క ఫొటోపై గుచ్చి నామినేషన్ ఖరారు చేసింది.

శేఖర్ బాషా, సోనియాపై.. విష్ణు ప్రియ నామినేషన్లు వేసింది. శేఖర్ చాలా అలసటగా కనిపిస్తున్నారని, ఉత్సాహంగా ఉండడం లేదని, నెమ్మదిగా ఆడుతున్నారని తన అభ్యంతరాన్ని చెప్పింది. వంటకు సంబంధించి కుక్కర్ విషయంలో సోనియా చేసిన వాదన సరికాదంటూ కామెంట్ చేసింది. ఇక్కడ.. సోనియా కాస్త సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. హౌస్ మొత్తానికి వంట చేసే బాధ్యత తీసుకున్న బేబక్క.. ఆ బాధ్యతలో విఫలమైందని, అందుకే తాను వాయిస్ రైజ్ చేశానని సోనియా చెప్పింది. చివరికి చీఫ్స్ నుంచి నిఖిల్ ముందుకు వచ్చి కత్తి తీసుకున్నాడు. శేఖర్ బాషా ఫొటోపై కత్తి దింపి నామినేషన్ కన్ఫమ్ చేశాడు. బేబక్క తర్వాత.. అభయ్ ఎంటరయ్యాడు. మణికంఠ, బేబక్కపై నామినేషన్ వేశాడు. ఎమోషనల్ వీక్ నెస్ తో ఉన్నావంటూ మణికంఠ ఆటతీరును తప్పుబట్టాడు. ఎవరి ఫ్లాష్ బ్యాక్ గురించి ఎవరికీ అవసరం లేదని చెప్పాడు. అయితే.. తాను ఎమోషనల్ వీక్ నెస్ తో ఉన్నానే కానీ.. మెంటల్లీ వీక్ నెస్ తో కాదని మణికంఠ చెప్పుకొచ్చాడు. మరోవైపు.. బేబక్క గేమ్స్ ను లైట్ గా తీసుకుంటోందంటూ.. అందుకే తాను ఆమెపై నామినేషన్ వేస్తున్నట్టు అభయ్ చెప్పాడు. అయితే.. తనపై మిగతా వాళ్లలాగా వంట కారణం చూపించకుండా మరో కారణంతో నామినేషన్ వేసినందకు.. బేబక్క అభయ్ కు థాంక్స్ చెప్పింది. డిస్కషన్ అయిపోయాక.. చీఫ్స్ నుంచి ముందుకొచ్చిన యశ్మీ.. కత్తి తీసుకని మణికంఠ పిక్ పై గుచ్చి.. నామినేషన్ కన్ఫమ్ చేసింది.

మధ్యలో హౌస్ మేట్స్ కాసేపు అలా మాట్లాడుకున్నారు. మణికంఠ ఆటతీరుపై అభయ్, శేఖర్ డిస్కస్ చేసుకున్నారు. సోనియా తీరుపై ప్రేరణ.. బేబక్కతో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అలా ముందుకు వెళ్లిన ఎపిసోడ్ లో.. నామినేషన్ల ప్రక్రియ మళ్లీ ప్రేరణతో మొదలైంది. మణికంఠ, సోనియాపై.. ప్రేరణ నామినేట్ చేసింది. ఎదుటివాళ్ల తప్పులు చెప్పేటప్పుడు చూపిస్తున్న సీరియస్ నెస్.. వాళ్లతో కలిసిపోవడం మణికంఠ చూపించడం లేదంటూ ప్రేరణ కామెంట్ చేసింది. మరోవైపు.. సోనియా చాలా ఈజీగా ఎదుటివాళ్లను జడ్జ్ చేసేస్తుందని అలా కామెంట్ చేయడం తప్పని ప్రేరణ చెప్పింది. తర్వాత.. మణికంఠ వచ్చి.. విష్ణుప్రియ, శేఖర్ పై నామినేషన్లు వేశాడు. శేఖర్ హౌస్ లో సీరియస్ గా ఉండడం లేదన్నాడు. విష్ణుప్రియ తనను.. ఫెమినిన్ అంటూ కామెంట్ చేసిందని.. అది తనను డిస్టబ్ చేసిందని అన్నాడు. చివరికి.. చీఫ్ ల నుంచి యశ్మీ ముందుకు వచ్చి విష్ణుప్రియ పిక్ పై కత్తిని దింపింది.

నామినేషన్ల సెగ్మెంట్ లో చివరగా వచ్చిన పృథ్వీ.. బేబక్క, మణికంఠను కార్నర్ చేశాడు. బేబక్క సీరియస్ గా ఉండడం లేదని.. గేమ్ కు ఆమె ఫిట్ కాదని అన్నాడు. ఆ కామెంట్ పై బేబక్క అభ్యంతరం చెప్పింది. మరోవైపు.. మణికంఠ సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నాడని.. అతని ఆట తనకు నచ్చడం లేదని పృథ్వీ చెప్పుకొచ్చాడు. చీఫ్స్ నుంచి ముందుకొచ్చిన నైనిక.. బేబక్క పిక్ పై కత్తిని దింపి నామినేషన్ కన్ఫమ్ చేసింది. అలా నామినేషన్ల ప్రక్రియ పూర్తవగా.. చివరికి బేబక్క, సోనియా, శేఖర్ బాషా, విష్ణు ప్రియ, పృథ్వీ, మణికంఠలు.. బోన్ లో నిలబడ్డారంటూ బిగ్ బాస్ చెప్పారు. వీళ్ల ఫ్యూచర్ ఇప్పుడు.. ప్రేక్షకులు వేసే ఓట్లపైనే ఆధారపడి ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra 22 A Lands : ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra 22 A Lands : ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
Haq OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Embed widget