అన్వేషించండి

Bigg Boss Telugu season 8 episode 54 review : బాహుబలిగా మారి రాయల్స్ కు చెమటలు పట్టిస్తున్న నిఖిల్ - త్యాగంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నబిల్ - రాయల్స్ బలగంలో చిచ్చు   

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 53 రసవత్తరంగా నడిచింది. ఇందులో నిఖిల్, పృథ్వీ, నబిల్ స్టార్ ఆఫ్ ది హౌస్ గా నిలిచారు. ఈ ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం పదండి.

Bigg Boss Telugu season 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 53లో 'బీబీ రాజ్యం' అంటూ చీఫ్ కంటెండర్ టాస్క్ ను బిగ్ బాస్ పెట్టిన విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో అదే కంటిన్యూ కాగా, బిగ్ బాస్ "అత్యంత బలమైన సేనాన్ని కూడా ఆకలి మట్టు పెడుతుంది. ప్రతి రాజ్యానికి ఆహార భద్రత అత్యంత ముఖ్యమైనది అలాంటి ఆహారాన్ని ఇచ్చే వ్యవసాయాన్ని పొందడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ పట్టుకో కార్డ్స్ లో పెట్టుకో. ఈ టాస్క్ లో గెలవడానికి 8 ధాన్యపు బస్తాలను కార్ట్ లో చేర్చుకోవాలి. తమకు చెందిన 8 ధాన్యపు బస్తాలను రెడ్లైన్ వెనక ఉన్న కార్ట్ లోకి ఎవరు ముందుగా చేరుస్తారో వాళ్లే గెలవడంతో పాటు వ్యవసాయాన్ని పొంది, మీ ప్లాన్ జెండాను పాతొచ్చు' అని చెప్పారు. ఈ టాస్క్ లో ఓజి నుంచి నిఖిల్,  పృథ్వి.. రాయల్స్ నుంచి మెహబూబ్, గౌతమ్ పాల్గొన్నారు. యష్మి గౌడను సంచాలక్ గా నియమించారు. టాస్క్ ఫిజికల్ కాగా, నలుగురు శక్తివంతులే కావడంతో ఉత్కంఠభరితంగా సాగింది.  

అయితే ఇంత కష్టపడి ఆడినప్పటికీ బిగ్ బాస్ బిగ్ షాక్ ఇచ్చారు. హౌస్ మేట్స్ ఫిజికల్ కావడంతో గేమ్ నీ పాజ్ చేసి, కావాలనుకుంటే కంటెస్టెంట్స్ ని మార్చుకోవచ్చు అని సలహా ఇచ్చారు. అయితే రాయల్స్ టీమ్ నుంచి అవినాష్, తేజ గేమ్ ఆడడానికి ముందుకు వచ్చారు. ఓజీ నుంచి మాత్రం నిఖిల్, పృథ్వీ కంటిన్యూ అయ్యారు. మొత్తానికి డూ ఆర్ డై అన్నట్టుగా గేమ్ ఆడి ఎట్టకేలకు ఓజీ క్లాన్ ఈ టాస్క్ విన్ అయింది. దీంతో ఓజి నుంచి కంటెండర్ గా పృథ్వీని నిలబెట్టారు. అలాగే రాయల్స్ క్లాస్ నుంచి గంగవ్వను తప్పించారు. 

అయితే ఈ క్రమంలో ప్రేరణను అడగకుండానే పృథ్వీని కంటెండర్ గా ఫిక్స్ చేస్తున్నట్టు చెప్పి, ఆ తర్వాత తాను ఆ మాట అనలేదని ఫ్లిప్ అయ్యింది యష్మి. దీంతో ప్రేరణ, యష్మి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. నిఖిల్ క్లియర్ చేసే ప్రయత్నం చేసినా వాళ్ళిద్దరూ వినకుండా నెక్స్ట్ డే వంట దగ్గర కూడా ఇదే కంటిన్యూ చేశారు. ఇక నిఖిల్ "ఇన్ఫినిటీ సీజన్ మనది, ఎవరైనా సరే కప్ విన్ అవ్వాలి అంటే అది మన క్లాన్ వాళ్ళే కావాలి' అంటూ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు. వచ్చినప్పటి నుంచి మేమే టాస్కులు విన్ అవుతున్నాము అంటున్నరాయల్స్ క్లాన్ పొగరును తగ్గించాలనీ నబిల్, ప్రేరణ మాట్లాడుకున్నారు. హరితేజ తన కూతుర్ని తలుచుకుని ఎమోషనల్ కాగా, నబిల్ తనను చాక్లెట్స్ త్యాగం చేయమన్నారని, అయితే కళ్ళముందే లడ్డులు, చాక్లెట్స్ ఉండడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ బిగ్ బాస్ దగ్గర వాపోయారు. అంతేకాకుండా తను త్యాగం చేసినందుకు మెహబూబ్, మణికంఠ తప్ప ఒక్కరు కూడా థాంక్స్ చెప్పలేదని ప్రేరణ దగ్గర చెప్పుకొచ్చాడు. 

ఆ తరువాత సైన్యం, హాస్పిటల్ ని పొందడానికి "వైరల్ ఎటాక్" టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గెలవడానికి అవతలి వారికి సంబంధించిన వైరస్ జోన్లోకి వీలైనన్ని ఎక్కువ వైరస్ లని విసరాలి. అలాగే మీ జోన్లోకి వీలైనన్ని తక్కువ వైరస్ లు వచ్చేలా చూసుకోవాలి. చివరికి ఎవరి వైపైతే తక్కువ వైరస్ లు ఉంటే వాళ్ళు విజేతలుగా నిలిచి, సైన్యాన్ని హాస్పిటల్ ని పొందుతారు" అని చెప్పారు. ఈ టాస్క్ లో ఓజి క్లాన్ నుచి తేజ, గౌతమ్, ఓజీ నుంచి నిఖిల్, నబిల్ ఇద్దరూ వచ్చారు. రోహిణి సంచాలక్. ఈ టాస్క్ లో కూడా ఓజి క్లాన్ సభ్యులు విన్ అయ్యారు. మొత్తానికి ఈ రోజూ ఎపిసోడ్ లో నిఖిల్ ఒక్కడే వెయ్యేనుగుల బలం చూపించి బాహుబలిలా ఆశ్చర్యపరిచాడు. దీంతో నిఖిల్ కష్టాన్ని గుర్తించి అతనికే కంటెండర్ ఛాన్స్ త్యాగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు నబిల్. కాగా ఓజీ టీమ్ నిఖిల్ ను కంటెండర్ గా సెలెక్ట్ చేస్తే, రాయల్స్ గౌతమ్ ని తప్పించారు. అయితే ఈ టాస్క్ లో గౌతమ్ సరిగ్గా ఆడలేదని రాయల్స్ క్లాన్ సభ్యులు కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగ విబేధాల కారణంగా రాయల్స్ క్లాన్ లో రెండు గ్రూప్ లో విడిపోయారు. ఆ తరువాత 'నాకు ఎవరో తినిపిస్తా' అన్నారు అంటూ యష్మి గౌడ రావడంతో ఆమెను, గౌతమ్ ను టీజ్ చేశారు హౌస్ మేట్స్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: హైదరాబాద్‌లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న సదరన్ రైజింగ్ సమ్మిట్
హైదరాబాద్‌లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న సదరన్ రైజింగ్ సమ్మిట్
YS Jagan And Sharmila: జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
Odisha News: ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
Andhra News: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏబీపీ నెట్‌వర్క్ నేతృత్వంలో సదరన్ రైజింగ్ సమ్మిట్, గ్రాండ్‌గా ఈవెంట్‌లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరంఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: హైదరాబాద్‌లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న సదరన్ రైజింగ్ సమ్మిట్
హైదరాబాద్‌లో మరికాసేపట్లో ప్రారంభం కానున్న సదరన్ రైజింగ్ సమ్మిట్
YS Jagan And Sharmila: జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
జగన్‌, షర్మిలకు వైఎస్‌ రాసిన ఆస్తులు ఇవే- మరి అన్నాచెల్లెల మధ్య వివాదం ఎక్కడ మొదలైంది?
Odisha News: ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
ఒడిశాలో తీరం దాటిన దానా తుపాను- గాలులు, వానతో భారీ విధ్వంసం
Andhra News: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ - రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు, కేంద్ర మంత్రి కీలక ప్రకటన
GHMC Commissioner: 'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
'బాణసంచా దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి' - జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన, ఇవీ నిబంధనలు
Crime News: తండ్రి అమ్మెస్తాడని స్కూల్‌లో దాక్కున్న బాలిక- చౌటుప్పల్లో ఘటన 
తండ్రి అమ్మెస్తాడని స్కూల్‌లో దాక్కున్న బాలిక- చౌటుప్పల్లో ఘటన 
Mega DSC Notification: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, ఖాళీలు ఎన్నో తెలుసా?
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, ఖాళీలు ఎన్నో తెలుసా?
YS Sharmila:  అందరూ  అమ్మల మీద, చెల్లెళ్ల మీద  కోర్ట్ ల్లో కేసులు వేయరు  కదా? - జగన్‌కు షర్మిల కౌంటర్
అందరూ అమ్మల మీద, చెల్లెళ్ల మీద కోర్ట్ ల్లో కేసులు వేయరు కదా? - జగన్‌కు షర్మిల కౌంటర్
Embed widget