అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bigg Boss Telugu season 8 episode 51 review : లవ్ బర్డ్స్ ను విడగొట్టిన ప్రేరణ, యష్మి గౌడ... విష్ణు స్నేక్ అంటూ పృథ్వీకి క్లాస్ - భారీగా ప్రైజ్ మనీ డ్రాప్ 

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఈ వారం హౌస్ మేట్స్ అందరూ లవ్ బర్డ్స్ విష్ణు ప్రియ, పృథ్వీలనే నామినేట్ చేశారు. నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఇవే.

బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 52 తాజాగా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో కూడా నామినేషన్ల ప్రాసెస్ కంటిన్యూ అయ్యింది. రివేంజ్ నామినేషన్లు ఈ ఎపిసోడ్ లో హైలెట్ అయ్యాయి. 
 
ఈ ఎపిసోడ్ లో ముందుగా తేజ నామినేషన్ మొదలు పెట్టారు. గంగవ్వ ఎప్పుడూ ఇక్కడ కూర్చుని నెగిటివ్ ఎనర్జీ పాస్ చేస్తారు అని అనడం తనకు నచ్చలేదంటూ విష్ణు ప్రియను నామినేట్ చేశాడు. 'ప్రతిసారి మీరు రివేంజ్ అంటూ పాయింట్ అవుట్ చేయడం నాకు నచ్చలేదు' అంటూ సెకండ్ నామినేషన్ గా పృథ్వి పేరు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ పృథ్వీ, రోహిణి మధ్య హీటింగ్ డిస్కషన్ నడిచింది. పృథ్వీ 'తప్పకుండా నేను రివేంజ్ నామినేషన్ చేస్తాను. ఎవరైనా టార్గెట్ చేస్తే నేను కూడా చేస్తాను. హౌస్ లోకి ఆడడానికి వచ్చాను జోక్ చేయడానికి కాదు' అంటూ మళ్ళీ రచ్చ మొదలు పెట్టాడు. దీంతో రోహిణి రెచ్చిపోగా ఇద్దరి మధ్య మరోసారి వివాదం నడిచింది. 

ఆ తర్వాత మహబూబ్ వచ్చి హరితేజ ఫైర్ కాస్తా ఫ్లవర్ ఎలా అయ్యిందో చెప్తూ ఆమెను నామినేట్ చేశాడు. నయనిని బ్యాటరీ టాస్క్ లో సరిగ్గా ఆడలేదు అంటూ నామినేట్ చేశాడు. నయని డిఫెండ్ చేసుకోగా, ఒకరిపై ఒకరు స్ట్రాంగ్ కౌంటర్స్ వేసుకున్నారు. ఇక ఇప్పుడు చెప్పుకోవాల్సింది విష్ణు, ప్రేరణ రచ్చ గురించి. 'నువ్వు నీ గురించి చెప్పుకునేది ఒకటి చేసేది ఒకటి. ఒకానొక టైంలో సీత చెయ్యి అని చెప్పి కావాలనే కోపంతో నా చెయ్యి కొరికావు. అదేమీ జుజుబి కోపం కాదు. నాకు చెప్పే ముందు నువ్వు చూసుకో. నైనిక వెళ్లేటప్పుడు విష్ణు ఫేక్ ఫ్రెండ్ లా కనిపించింది చెప్పింది. కిల్లర్ గర్ల్ అనే టాస్క్ లో బ్రేక్ డౌన్ అయిన నన్ను ఒక్కసారి కూడా కన్సోల్ చేయనప్పుడు నాకు కూడా అన్పించింది. ఊరికే ఉన్నప్పుడు ముద్దులు పెట్టడం అవసరం లేదు. 'నీకొక స్టాండ్ ఉండదు. పృథ్వీని నామినేట్ చేస్తే నీకు బాధనా?' అని ప్రశ్నించింది. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో విష్ణు ప్రియ... ప్రేరణ నబిల్ ను కొట్టాలి అని చేసిన కామెంట్ ను బయట పెట్టి షాక్ ఇచ్చింది. 'ఈ మధ్య పృథ్వి చుట్టే తిరుగుతుంది నీ గేమ్' అంటూ ప్రేరణ కామెంట్ చేయగా, 'అందరికీ పెడిక్యూర్, మేని క్యూర్, హెయిర్ కలర్ తప్ప ఏం చేస్తున్నావ్ ?' అంటూ పంచ్ వేసింది విష్ణు. దీంతో 'ఫేక్ పర్సన్' అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ప్రేరణ. తరువాత పృథ్వీతో రివేంజ్ నామినేషన్ అంటూ మొదలు పెట్టింది. 'ఫేక్ ఫ్రెండ్ నువ్వు' అంటూ ప్రేరణ పై మండిపడ్డాడు పృథ్వీ. గొడవ, ఫ్లర్ట్ చేసుకో అంటూ ప్రేరణ... నువ్వు హెయిర్ కలర్ వేసుకో అంటూ పృథ్వీ సెటైర్లు వేసుకున్నారు. 

Also Read: బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 50 రివ్యూ: నోరు పారేసుకుంటున్న పృథ్వీ... విష్ణు పసలేని కారణాలు - ఈ వారం ప్రేరణ టార్గెట్

తరువాత గంగవ్వా... నిఖిల్ ను, విష్ణు ప్రియను నామినేట్ చేసింది. నిఖిల్... మెహబూబ్, నయనినీ నామినేట్ చేశారు. 'నీ మాటలు హర్ష్ గా ఉంటాయి. నీ గేమ్ కన్పించలేదు' అనే పాయింట్ తో విష్ణును, మెహబూబ్ ను యష్మీ నామినేట్ చేసింది. 'లాస్ట్ వీక్ నామినేషన్ టైంలో రెస్పెక్ట్ ఇవ్వలేదు, సారీ చెప్పలేదు, గడ్డం కట్ చేయించుకోలేదు' అంటూ పృథ్వీపై అవినాష్ గోడవకు దిగాడు. ఈ వారం నామినేషన్లలో నిఖిల్, విష్ణు ప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, నయని, హరీతేజ ఉన్నారు. నామినేషన్ షీల్డ్ ఉన్నప్పటికీ ఇద్దరు సభ్యులు హారితేజాను నామినేట్ చేయడంతో లక్ష విన్నర్ ప్రైజ్ మనీని పోగొట్టుకున్నారు. చీఫ్ గౌతమ్ తన పవర్ తో హరితేజాను సేవ్ చేశాడు. చివరగా పృథ్వీకి యష్మి క్లాస్ పీకడంతో అతను విష్ణు ప్రియను దూరం పెట్టాలని డిసైడ్ అయ్యి ఆమెను బాధ పెట్టాడు.

Also Readఅల్లు అర్జున్ రూటులో బాలీవుడ్ స్టార్... 10 కోట్లు ఇస్తామన్నా అటువంటి యాడ్ చేయడానికి 'నో' చెప్పేశాడు, అతను ఎవరో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget