అన్వేషించండి

Bigg Boss Telugu Season 8 Episode 40 Review: క్యారక్టర్స్ ఛేంజ్... హౌస్‌మేట్స్‌కు బిగ్ బాస్ పనిష్మెంట్ - బెడిసికొట్టిన 'కిరాక్' సీత గేమ్ స్ట్రాటజీ 

Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 40లో బీబీ హోటల్ టాస్క్ కంటిన్యూ అయ్యింది. ఈ టాస్క్ లో గెలిచింది ఎవరు? నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం పదండి.

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 40 ఈరోజు స్ట్రీమింగ్ అయింది. అయితే నిన్న బిగ్ బాస్ రాయల్స్ క్లాన్, ఓజి క్లాన్ సభ్యులకు బీబీ హోటల్ అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఓజీ క్లాన్ సభ్యులు హోటల్ స్టాఫ్ గా ఉండగా, రాయల్స్ క్లాన్ సభ్యులు అతిథులుగా నటించారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో పెట్టిన టాస్క్ ఇప్పుడు పూర్తయింది. తాజా ఎపిసోడ్లో ఇదే టాస్క్ కంటిన్యూ కాగా, ఈ రోజు హైలెట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. 

క్యారెక్టర్లు మార్చిన బిగ్ బాస్... 
బిగ్ బాస్ మాట్లాడుతూ టేస్టీ తేజను అవినాష్, రోహిణిల అసిస్టెంట్ గా నియమించారు. హరితేజ తన కొడుకు గురించి గర్వంగా ఫీల్ అవుతూ తన కొడుకుని హీరోని చేద్దామని అనుకునే తల్లి అని చెప్పారు. ఇక మహబూబ్ హరితేజ కొడుకు అని, గౌతమ్ ఆకతాయి, నయనికి న్యారో మైండెడ్ బాయ్ ఫ్రెండ్ అని రాయల్ క్లాన్స్ సభ్యుల పాత్రలను మార్చేశారు. ఇక ఓజీ టీంలో పృథ్వి హోటల్ ఓనర్ నబిల్ కొడుకు, ప్రేరణ సూపర్ స్టార్ అవినాష్ కి అట్రాక్ట్ అయిన హోటల్ మేనేజర్ అని చెప్పారు. ఇక మిగతా క్యారెక్టర్స్ అన్ని యథాతధంగా నడుస్తాయని గేమ్ ను కంటిన్యూ చేయమన్నారు.  

ట్రాక్ మార్చిన పృథ్వీ ... 
 నిన్న బేబీ హౌస్ టాస్క్ మొదలైనప్పుడే క్యాష్ తో పాటు స్టార్స్ ని ఎవరు సంపాదిస్తారో వాళ్లకి స్పెషల్ పవర్ ఉంటుందని బిగ్ బాస్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. రాయల్ క్లాన్ లో అందరూ కలిసి యశ్మీ గౌడ పర్ఫామెన్స్ బాగుందంటూ ఆమెకు స్టార్ ఇచ్చారు. మరోవైపు పృథ్వీ ఏకంగా నయని పావని కొబ్బరి బోండాం తాగిన అదే స్ట్రాతో తాను కూడా సిప్ చేయడం గమనార్హం. ఇంకో స్టార్ ను సీతకి ఇచ్చింది హరితేజ. ఓజి క్లన్ సభ్యులకి ఇష్టం వచ్చిన టాస్క్ పెట్టి, అందులో గెలిచిన వారికి స్టార్ నిచ్చే అధికారం ఇచ్చారు బిగ్ బాస్. అందులో భాగంగానే ఫ్రాగ్ జంప్ టాస్క్ ను ముందుగా ఇచ్చారు. ఇందులో యష్మి, ప్రేరణ అవుట్ అయ్యారు. ఆ తర్వాత స్పూన్ అండ్ లెమన్ టాస్క్ లో నబిల్, పృథ్వి ఔట్ అయ్యారు. ఆ తర్వాత రెండు చేతుల్లో వాటర్ గ్లాసులు పట్టుకుని, ఒకే కాలిపై బ్యాలెన్స్ గా నిలబడే టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో చివరి వరకు నిఖిల్, మణికంఠ నిలిచారు. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వస్తువులను తీయాలనే టాస్క్ లో నిఖిల్ విన్ అయ్యాడు. నిఖిల్ కి గంగవ్వ స్టార్ ను ఇచ్చింది. ఆ తరువాత అతిథులు గులాబ్ జామూన్ ఆర్డర్ చేయగా, అవి కన్పించకవడంతో  ఎవరు తిన్నారు అనే కన్ఫ్యూజన్ ఎదురైంది. అది తిన్నది అవినాష్. ఈ క్రమంలోనే సీత, ప్రేరణకు మధ్య గొడవ జరిగింది. 

Also Read: బిగ్ బాస్ తెలుగు 8 డే 38 రివ్యూ... ఫన్నీ టాస్క్ లో గౌతమ్ ఏడుపు... డ్యాన్స్ తో అదరగొట్టిన గంగవ్వ... తికమకగా బీబీ హోటల్ టాస్క్

నీళ్లను వేస్ట్ చేసినందుకు పనిష్మెంట్... 
వాష్ రూమ్ లో ట్యాప్ తిప్పి నీళ్ళను అలాగే వదిలేసిన బిగ్ బాస్ సభ్యులకు నీటి సరఫరా ఆపేసి ఒక టాస్క్ ఇచ్చారు. అందులో గెలిస్తే 25,000 ప్రైస్ మనీ గా ఇస్తామని చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో టేస్టీ తేజా జారి కింద పడ్డాడు. టాస్క్ లో ఓజీ క్లాన్ గెలిచింది. టాస్క్ ముగిసేసరికి రాయల్స్ క్లాన్ దగ్గర రూ. 116500, ఓజీ క్లాన్ దగ్గర రూ. 108500 ఉండగా, హోటల్ టాస్క్ లో రాయల్స్ క్లాన్ గెలిచింది. అంతకుముందు సీత దొంగిలించిన డబ్బు గురించి గొడవ నడిచింది. 

Read Also : Prayaga Martin: గ్యాంగ్‌స్టర్‌తో లింక్... డ్రగ్స్ కేసులో విచారణ - ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget