అన్వేషించండి

Prayaga Martin: గ్యాంగ్‌స్టర్‌తో లింక్... డ్రగ్స్ కేసులో విచారణ - ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

మలయాళ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ పేరు తాజాగా ఓ గ్యాంగ్ స్టర్ వివాదంలో తెరపైకి వచ్చింది. మరి ఈ హీరోయిన్ ఎవరు, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం పదండి.

సినిమా ఇండస్ట్రీకి, రాజకీయాలకు మధ్య ఎప్పటి నుంచో మంచి బంధ ఉందన్న విషయం తెలిసిందే. ఇదే విధంగా సినిమా ఇండస్ట్రీకి గ్యాంగ్ స్టర్లకు మధ్య సంబంధం ఉందనే వార్తలు అప్పుడప్పుడూ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కొంత మంది డాన్లతో పలువురు నటీనటుల లింక్స్ ఇప్పటికే బయటపడ్డ విషయం తెలిసిందే. తాజాగా మలయాళ హీరోయిన్ ప్రయాగా మార్టిన్ ఓ గ్యాంగ్ స్టర్ క్రైమ్ లో బయటకు రావడం సంచలనంగా మారింది. అసలు ఈ ప్రయాగా మార్టిన్ ఎవరు? ఆ గ్యాంగ్ స్టర్ తో ఆమె‌కు సంబంధం ఏమిటి? అనే విషయాలపై ఒక లుక్కేదం పదండి. 

మలయాల నటి ప్రయాగ మార్టిన్, 'మంజుమ్మెల్ బాయ్స్' ఫేమ్ శ్రీనాథ్ భాసికి గ్యాంగ్ స్టర్ ఓం ప్రకాష్ తో లింక్స్ ఉన్నాయనే అనుమానంతో పోలీసులు వారికి సమన్లు పంపబోతున్నారు. సమాచారం ప్రకారం కొచ్చిలోని ఒక హోటల్లో ఈ ఇద్దరు స్టార్స్ సదరు గ్యాంగ్ స్టర్ ను సంప్రదించినట్టుగా అధికారులు ధృవీకరించారు. అయితే ప్రస్తుతం పోలీస్ విచారణలో ఉన్న ప్రయాగ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని ఆరా తీస్తున్నారు నెటిజెన్లు. ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'సాగర్ అలియాస్ జాకీ రీలోడెడ్' అనే సినిమాతో ఆమె నటిగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాకు సైన్ చేసే టైంకి ప్రయాగ ఏడవ తరగతి చదువుతుండడం విశేషం. ఇక 2012లో నిత్యా మీనన్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన ;ఉస్తాద్ హోటల్; అనే సినిమాలో ప్రయాగ కూడా భాగమైంది. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పిశాచి' అనే సినిమాలో ప్రయాగ మొట్టమొదటిసారి హీరోయిన్ పాత్రను చేసింది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు రామలీల, భూమియిలే మనోహర స్వకార్యం, విశ్వాసపూర్వం మన్సూర్, వంటి పలు సినిమాల్లో నటించింది. అలాగే పలు కామెడీ షోలలో కూడా కనిపించింది. ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2019లో ప్రయాగా ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ లో డిగ్రీ పూర్తి చేసింది.

Read Also : Ratan TATA Movie: రతన్ టాటా చేసిన ఏకైక సినిమా... ఆయన మళ్లీ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? 

ప్రస్తుతం ప్రయాగ మార్టిన్ గ్యాంగ్ స్టర్ ఓం ప్రకాష్ వివాదంలో చిక్కుకుంది. ఆదివారం కొచ్చిలోని అలెన్ వాకర్ మ్యూజిక్ షో జరగనున్న నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ ఓం ప్రకాష్ ను, అతని సహచరుడు షిహాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓం ప్రకాష్ హోటల్ రూమ్ లో జరిగిన సోదాల్లో లిక్విడ్ డ్రగ్ తో పాటు 8 మద్యం బాటిల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు డ్రగ్స్ ను ఉపయోగించారా ? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇప్పటికే బ్లడ్ టెస్ట్ లు చేస్తున్నారు. అయినప్పటికీ ఓం ప్రకాష్ కి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే మరోవైపు ప్రయాగ మార్టిన్ తో సహా దాదాపు 20 మంది హోటల్ లో ఈ గ్యాంగ్ స్టర్ ను కలిసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఓం ప్రకాష్ తో వీళ్లకున్న లింక్స్ ఏంటి ? అనే విషయంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Read Also: 'వేట్టయన్' తెలుగు టైటిల్ వివాదం- పేరు ఎందుకు మార్చలేదో క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ratan Tata: రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు - వర్లి శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు
రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు - వర్లి శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు
Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Ratan Tata: 1998లోనే మేడ్ ఇన్ ఇండియా కారు - రతన్ టాటా విజన్ అంత గొప్పది!
1998లోనే మేడ్ ఇన్ ఇండియా కారు - రతన్ టాటా విజన్ అంత గొప్పది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ratan Tata: రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు - వర్లి శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు
రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు - వర్లి శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు
Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Ratan Tata: 1998లోనే మేడ్ ఇన్ ఇండియా కారు - రతన్ టాటా విజన్ అంత గొప్పది!
1998లోనే మేడ్ ఇన్ ఇండియా కారు - రతన్ టాటా విజన్ అంత గొప్పది!
Ratan Tata: రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
Entertainment Top Stories Today: రజనీకాంత్ ‘వేట్టయన్’ రివ్యూ, ‘దేవర 3’పై కొరటాల కామెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
రజనీకాంత్ ‘వేట్టయన్’ రివ్యూ, ‘దేవర 3’పై కొరటాల కామెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Tata Nexon CNG Review:  టాటా నెక్సాన్ సీఎన్‌జీ ఎలా ఉంది? - మైలేజీ ఎంత ఇస్తుంది?
టాటా నెక్సాన్ సీఎన్‌జీ ఎలా ఉంది? - మైలేజీ ఎంత ఇస్తుంది?
Andhra BJP : ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
Embed widget