అన్వేషించండి

Bigg Boss Telugu Day 79 Promo : ప్రియాంక జైన్​ను ఇంట్లోకి తీసుకొచ్చిన బిగ్​బాస్.. కళ్యాణ్​తో ఆడి గెలుస్తుందా?

Bigg Boss 9 Telugu Captiancy Task : బిగ్​బాస్ ఓల్డ్ సీజన్ కంటెస్టెంట్లను ఇంట్లోకి తీసుకొచ్చి.. వారితో ఆడి కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలంటూ షరతు పెట్టాడు. దానిలో భాగంగా ప్రియాంక జైన్ లోపలికి వచ్చింది.

Bigg Boss 9 Telugu Captiancy Task Promo : బిగ్​బాస్​లో 13వ వారానికి కెప్టెన్సీ పోటీలు జరుగుతున్నాయి. కెప్టెన్సీ కంటెండర్స్ కావాలి అంటే.. బిగ్​బాస్ పంపించే యోధులతో ఫైట్ చేయాలని చెప్పాడు. దీనిలో భాగంగా ఉదయం గౌతమ్​ని పంపిస్తే.. తర్వాత ప్రియాంక జైన్​ని పంపించాడు. టిల్లులోని రాధిక సాంగ్ వేసి.. ప్రియాంకను లోపలికి తీసుకువచ్చాడు. దానికి సంబంధించిన ప్రోమోలో ఏముంది? బిగ్​బాస్ ఏ టాస్క్ ఇచ్చాడు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం.

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో.. 

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమోలో ప్రియాంక ఇంట్లోకి వచ్చింది. ఏంటి ఇమ్మూ తెగ ఏడ్చేస్తున్నావు అంటే.. నువ్వే గుర్తొచ్చావు ప్రియాంక అందుకే ఏడ్చేశాను అంటూ ఫ్లర్ట్ చేశాడు. అబ్బా ప్రతి ఒక్కరికి ఇదే చెప్తావా అంటూ ప్రియాంక కూడా ఫన్ చేసింది. తర్వాత ఇంటి సభ్యులకు మీరు మాట్లాడుకునే గుసగుసలు చెప్తే మీ గురించి నేను చెప్తాను అన్నది. రీతూ అందుకుని.. నేను తనూజ నీ స్కిన్ గురించే మాట్లాడుకున్నాము ఎంత బాగుంటుందో కదా అని.. కామెడీ చేసింది. ఈ యోధురాలిని చూడగానే.. మాలో ఉన్న యోధులంతా బయటకు వచ్చేస్తున్నారంటూ ఇమ్మూ కామెడీ చేయగా అందరూ నవ్వేశారు. 

టాస్క్ ఇచ్చిన బిగ్​బాస్.. కళ్యాణ్​తో..

ప్రియాంకతో యుద్ధంలో గెలవడానికి, చివరి కెప్టెన్సీకి చేరువ అవ్వడానికి ఇస్తోన్న ఛాలెంజ్.. సమ్​థింగ్ ఫిష్షీ. ఈ టాస్క్​ని ప్రియాంక కళ్యాణ్​తో ఆడింది. ఈ ఛాలెంజ్​లో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా.. సాగ్స్​ని పట్టుకుని.. ఫిష్ స్కెలెటిన్​ దగ్గరికి వచ్చి.. సాగ్స్​లోని ఫిష్​ బోన్స్​ని నెంబర్స్ ప్రకారం ప్లేస్ చేయాలని చెప్పాడు బిగ్​బాస్. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉందని చెప్పాడు. అదేంటంటే.. దీనిలో భాగంగా ఒక చేయిని మాత్రమే వినియోగించాలని సూచించాడు.

కళ్యాణ్ గెలిచాడా? ప్రియాంకనా?

కళ్యాణ్, ప్రియాంక గేమ్ స్టార్ట్ చేశారు. ఇమ్మాన్యుయేల్ సంచాలకుడిగా చేసినట్లు తెలుస్తుంది. కళ్యాణ్​ని కాలుతో పట్టుకోవద్దని.. నోటి సహాయం తీసుకోవద్దని చెప్తూ కనిపించాడు. అయితే కళ్యాణ్ ఈ ఆటలో విజయం సాధించినట్లు లైవ్​లో చూస్తే తెలుస్తుంది. లాస్ట్ కెప్టెన్సీకి మొదటి కంటెండర్ కళ్యాణ్ అయ్యాడు. మరి ఇంకెవరు కంటెండర్స్ అయ్యారు. ఎపిసోడ్​లో ప్రియాంక ఇచ్చిన ఇన్​పుట్స్ ఏంటో.. పూర్తి ఎపిసోడ్​ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.  

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Advertisement

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget