Bigg Boss Telugu Day 78 Promo : బిగ్‌బాస్‌కి షాక్ ఇచ్చిన తనూజ, నోరుజారిన సంజన.. పవన్‌తో కళ్యాణ్ బిగ్ ఫైట్, రీతూనే కారణమా?
Bigg Boss 9 Telugu 12th Week Nominations List : బిగ్‌బాస్‌లో ఈ వారం నామినేషన్స్ నా భూతో నా భవిష్యత్. ఒకళ్లు నోరిజారితే మరొకరు బిగ్‌బాస్‌కే షాకిచ్చారు. ఇక పవన్, కళ్యాణ్ గొడవకి హద్దే లేకుండా పోయింది.

Bigg Boss 9 Week Nominations Promo : బిగ్‌బాస్‌లో 12వ వారానికి నామినేషన్స్ జరిగాయి. రెండు దశల్లో దీనిని స్టార్ట్ చేసిన బిగ్‌బాస్.. ముందు స్మూత్‌గా, తర్వాత ఫుల్ ఫైర్‌తో నామినేషన్స్ ప్లాన్ చేశాడు. కంటెస్టెంట్లు ఇంటి సభ్యులు ఇచ్చిన అవుట్‌పుట్స్‌తో ఈ వారం రెచ్చిపోయారు. మునుపెన్నడూ లేని విధంగా సీజన్ 9 తెలుగు నామినేషన్స్ జరిగాయి. ఒకరు నోరిజారి పెద్దమాట అంటే.. మరొకరు బిగ్‌బాస్‌కే షాకిచ్చారు. ఇక పవన్, కళ్యాణ్ గొడవ మామూలుగా జరగలేదు. దానికి సంబంధించిన మూడో ప్రోమో బిగ్‌బాస్ విడుదల చేశాడు.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో..
మూడు ప్రోమోలో ముందుగా వచ్చిన పవన్ ఇమ్మాన్యుయేల్‌ని నామినేట్ చేశాడు. అన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నిన్ను నామినేట్ చేస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంటూ ఏడుస్తూనే నామినేట్ చేశాడు. అన్న నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నప్పుడు నువ్వు నాకు చేస్తా అన్నావు. కానీ బ్లూ వైపు ఎందుకు వచ్చేలా చేశావు అంటే.. అది టీమ్ కోసం ఆడాను అంటూ ఇమ్మూ చెప్పాడు. కెప్టెన్సీ టీమ్ కాదు కంటెండర్ అన్నప్పుడు కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు. ఇమ్మూ ఆగమని చెప్పినా.. కళ్యాణ్ తన పాయింట్ చెప్పాలనుకున్నాడు. అది పెద్ద గొడవకు దారి తీసింది.
కళ్యాణ్ vs డిమోన్ పవన్
మరి ఇప్పుడెందుకు చెప్పావు లాస్ట్ వరకు బ్లూ టీమ్ కోసం ఆడతానని అంటే.. రీతూ ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే.. నేను బ్లూ టీమ్‌లో ఉన్నా కాబట్టి అని చెప్తుంది. మరి ఇప్పుడు రెడ్ టీమ్‌తో డీల్ పెట్టుకున్నాడు కదా అంటూ అడిగాడు కళ్యాణ్. రీతూ తర్వాత ఇమ్మాన్యుయేల్ అన్నావా లేదా అని డిమోన్‌ని అడగ్గా.. అవును అంటాడు. కదా అప్పుడు వాడు గేమ్ ఆడట్లేదు అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. దీంతో అతనిని ఆపేందుకు హోజ్మేట్స్ వెళ్లారు. కోపంలో కళ్యాణ్ స్టూల్ని కూడా తన్నేశాడు. గొడవ మాత్రం గట్టిగానే జరిగింది.
బిగ్‌బాస్‌కి షాక్ ఇచ్చిన తనూజ..
దివ్య ఉంటే తనూజకి దివ్యకి మంచి గొడవలు జరుగుతాయనే బిగ్‌బాస్ ప్లాన్‌ని తనూజ బ్రేక్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా దివ్యను నామినేట్ చేసి.. ఈ గొడవను ఇక్కడితో వదిలేద్దామని చెప్పింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. పైగా వెళ్లి దివ్యను హగ్ చేసుకుని.. ఇంకొకరి వల్ల ఈ గేమ్ పాడవుతుందని చెప్పకుండా చూసుకుందామని చెప్తుంది. వీరిమధ్య గొడవ జరుగుతుందనే లాస్ట్ వీక్ నామినేషన్స్ లేకుండా చూశారనే టాక్ బయట ఉంది. అయితే తనూజ స్మూత్‌గా దానిని బ్రేక్ చేసేసింది.
నోరుజారిన సంజన.. అంత మాట ఎలా..
రీతూ వచ్చి సంజనను నామినేట్ చేసింది. మీ గేమ్ నాకు కనిపించట్లేదని రీతూ చెప్పగా.. 6వ వారం నుంచి 13వ వారం వరకు నా గేమ్ లేకుండానే నేను ఇక్కడ ఉన్నానా అంటూ అడిగింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. సంజన ఇక్కడ కంట్రోల్ తప్పింది. నేను నీ అంత పచ్చి బూతులు మాట్లాడలేదు అనడంతో పాటు.. రాత్రుళ్లు నువ్వు డిమోన్‌తో కూర్చుంటావు అని నోరుజారింది. అయితే కూర్చుంటావు అనేది అయినా.. ఇంక చాలా మాటలు అన్నట్లుంది. దానికి కళ్లు మూసుకునేలా నేను ఇంట్లో ఏమి పనులు చేశాను బిగ్‌బాస్ అంటూ రీతూ ఏడుస్తుంది. ఆ మాట కరెక్ట్ కాదు వెనక్కి తీసుకోండి అంటూ ఇమ్మూ కూడా సీరియస్ అవ్వడంతో ప్రోమో ముగిసింది.






















