Bigg Boss Telugu Day 78 Promo : బిగ్‌బాస్ 12వ వారం నామినేషన్స్ రెండు దశల్లో.. మొదటిది సైలెంట్‌గా కానిచ్చేశాడు, రెండోది ఫుల్ వైలెన్స్!?
Bigg Boss 9 Telugu 12th Week Nominations List : బిగ్‌బాస్‌లో 12వ వారానికి నామినేషన్స్ జరుగుతున్నాయి. అయితే దీనిని రెండు దశల్లో ఉండబోతున్నాయని చెప్పాడు బిగ్‌బాస్.

Bigg Boss 9 Week Nominations Promo : బిగ్‌బాస్‌లో ఫ్యామిలీ వీక్ ముగిసిన తర్వాత నామినేషన్స్ మొదలయ్యాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన అవుట్‌పుట్‌తో కంటెస్టెంట్లు గేమ్ ప్లాన్ ఛేంజ్ చేసేటట్టే కనిపిస్తున్నారు. అయితే వాళ్లకి ఆ ప్లాన్ ఇవ్వడం ఎందుకనీ బిగ్‌బాస్ ఓ ట్విస్ట్‌తో వచ్చేశాడు. సోమవారం నామినేషన్స్ జరుగుతాయని అందరికీ తెలుసు. అయితే ఈ వారం నామినేషన్స్ రెండు దశల్లో ఉంటాయని.. మునుపెన్నడూ లేనివిధంగా ఉంటుందని చెప్తూ.. దానికి సంబంధించిన మొదటి ప్రోమో విడుదల చేసింది స్టార్ మా.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో..
ఈసారి నామినేషన్స్ బాగా ఆసక్తిగా, భిన్నంగా ఉండబోతున్నాయని బిగ్‌బాస్ చెప్పడంతో ప్రోమో మొదలైంది. ఈ నామినేషన్స్ రెండు దశల్లో జరగబోతుంది. ఒకరి తర్వాత ఒకరు డెన్‌కి వచ్చి.. వారి గురించి చెప్పలేకపోయిన పాయింట్స్‌ను క్లియర్‌గా చెప్పి.. నామినేట్ చేయాలని చెప్పారు. వారితో ఉన్న ఇబ్బందిని స్పష్టంగా బయట చెప్పి.. వారి పేరు కార్డ్‌పై రాసి బాక్స్‌లో వేయాలని సూచించారు. ఈ మొదటి దశను ప్రైవేట్ నామినేషన్‌గా చెప్పాడు బిగ్‌బాస్. ఇది ప్లేన్‌గా సాగిపోతుంది కాబట్టి దీనికి రెండో దశ పెట్టాడు.
ముందుగా వచ్చిన ఇమ్మాన్యుయేల్.. తన నామినేషన్ డిమోన్ పవన్ అని చెప్పాడు. కంటెండర్ అయిన తర్వాత.. ఎక్కడో.. ఎవరి గురించో ఆలోచించి.. కెప్టెన్సీ దూరం చేసుకున్నాడని అనిపించిందని చెప్పాడు. కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ నుంచి ఎవరైతే గివ్ అప్ ఇచ్చేస్తున్నారో.. వాళ్లని వదిలేసి.. నేను కెప్టెన్సీలో ఉండాలనుకుంటున్నాను.. ఒకసారి ఆపండి అంటూ అని చెప్పినా తను వినలేదు. అతని మైండ్ సెట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు బిగ్‌బాస్ అని చెప్పాడు. డిమోన్ వచ్చి కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. సుమన్ శెట్టి సంజనను నామినేట్ చేశాడు. అయితే సంజన, తనూజ ఎవిరిని నామినేట్ చేశారనేది ప్రోమోలో చూపించలేదు.
ఆ ముగ్గురి చుట్టే తిరుగుతోన్న నామినేషన్స్..
భరణి వచ్చి తనూజను నామినేట్ చేశాడు. నా గురించి డిస్కషన్ రావద్దు అంటే తనూజనే మళ్లీ తన టాపిక్ తీసి.. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పాడు. అలాగే దివ్య, తనూజ కూడా ఇద్దరూ చైల్డిష్గానే ఉన్నారంటూ చెప్పాడు. దివ్య వచ్చి భరణి తన కోసం స్టాండ్ తీసుకోలేదని నామినేట్ చేసింది. అయితే తనూజ దివ్యను నామినేట్ చేసినట్లు చూపించలేదు కానీ.. లైవ్‌లో వీరి ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. మోస్టీ తనూజ దివ్యను నామినేట్ చేసి ఉండొచ్చని తెలుస్తుంది. ఏది ఏమైనా వీరి చుట్టూ ఉన్న గొడవ తగ్గకపోగా పెరుగుతూనే ఉంది. మరి ఈ వారం నామినేషన్స్‌లో రెండో దశ ఏంటో.. రీతూ ఎవరిని నామినేట్ చేసిందో తెలియాలంటే లైవ్ చూడాలి. లేదా ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాలి.






















