Bigg Boss Telugu Day 75 Promo : దివ్య, తనూజ మధ్య పెద్ద గొడవ.. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ, నోరు జారిన తనూజ!?
Bigg Boss Telugu Today Promo : ఫ్యామిలీ వీక్ తర్వాత కెప్టెన్సీ టాస్క్ గురించిన పోటీ జరిగింది. ఈ క్రమంలో తనూజ, దివ్య మధ్య పెద్ద ఫైట్ జరిగింది. ప్రోమో హైలెట్స్ ఏంటంటే..

Bigg Boss 9 Divya vs Thanuja Promo : ఫ్యామిలీ వీక్ అయ్యేసరికి అందరూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులా కలిసి ఉంటారనుకున్న బిగ్‌బాస్ హోజ్లో మునుపెన్నడూ జరగని రేంజ్లో ఫైట్ జరిగింది. బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు పదకొండవ వారానికి కెప్టెన్సీకి సంబంధించిన టాస్క్ పెట్టి తనూజ, దివ్య మధ్య గొడవ పెట్టేశాడు బిగ్‌బాస్. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా స్టార్ మా విడుదల చేసింది. దీనిలో తనూజ, దివ్యని చూస్తే కొట్టుకోవడం ఒక్కటే తక్కువ రా బాబు అనిపిస్తుంది.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో.. దివ్య, తనూజ మధ్య ఫుల్ ఫైట్..
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. కెప్టెన్సీకి సంబంధించిన టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దానిలో భాగంగా వచ్చిన ప్రోమో ఎలా సాగిందంటే.. మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వాలనే అర్హత లేదని భావిస్తున్నారో.. వారిని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ముందుగా వచ్చిన దివ్య.. తనూజను రేస్ నుంచి తప్పించాలనుకుంది. కెప్టెన్సీ అంటే ఇమ్యూనిటీ.. నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కాబట్టి.. వేరే వాళ్లకి ఈ ఛాన్స్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలిపింది. దానికి తనూజ నేను గేమ్ ఆడి గెలిచాను. ఎవరు సపోర్ట్ లేకుండా అని అంది. నేను నెక్స్ట్ వీక్ గురించి ఆలోచించి చెప్తున్నాను అంటూ దివ్య చెప్పగా.. లేదు నీ బిహేవియరే అంతా అన్నది తనూజ.
చెప్పుకున్నావ్లే పో..
నువ్వు బిహేవియర్ తీసుకురాకు తనూజ అంటే.. నేనే కనిపిస్తున్నానా? ఇంకెవరు కనిపించట్లేదా? అంటూ సీరియస్ అయింది తనూజ. నువ్వు అరిస్తే నేను అరుస్తా తనూజ. నువ్వు అరిస్తే నేను ఇంకా గట్టిగా అరుస్తా తనూజ అంటూ దివ్య కూడా సీరియస్ అయింది. నేను రీజన్ 100 కరెక్ట్‌గా చెప్పాను అంటే.. చెప్పుకున్నావ్ పో అంటూ తనూజ అన్నది. పో అంటావేంటి? నువ్వు ఎవరు నన్ను పో అని చెప్పడానికి అంటూ మళ్లీ సీరియస్ అయింది దివ్య. కానీ మళ్లీ మళ్లీ పో అంటూ పోక్ చేసింది తనూజ. ప్రతి దానికి నా మీద పడి ఏడుస్తారు అంటే.. నువ్వు ఏడుస్తావ్ పది సార్లు రోజుకి అంటూ దివ్య రిప్లై ఇచ్చింది.
నోరు జారిన తనూజ!?
నీ చుట్టు తనూజ భజన చేయాలి అని దివ్య అంటే.. బయట సరిపోక నువ్వు ఇక్కడికొచ్చావు అంటూ మాట్లాడింది తనూజ. నేను బయట, లోపల అన్నానా? అంటూ దివ్య సీరియస్ అయింది. నీలాగా అందరినీ వాడుకోను గేమ్ కోసం అని దివ్య అంటే.. నోటికి వచ్చినట్లు వాగకు దివ్య అని తనూజ చెప్పింది. నువ్వు అన్నాకే.. నేను అన్నాను అంటూ దివ్య అన్నది. ఓ మనిషికి ఇష్టం లేదని చెప్పి బిహేవియర్లో చూపిస్తున్నా సరే నీలా వెంటపడట్లేదు నేను అని తనూజ అన్నది. పిచ్చపిచ్చగా మాట్లాడకు అంటూ దివ్య సీరియస్ అయింది. పాపం వీరిద్దరి మధ్య భరణి ఎప్పుడూ నలిగిపోతూ వస్తున్నాడు. ఈ ప్రోమోను దివ్య ఫ్యాన్స్ సమర్థిస్తుండగా.. తనూజ ఫ్యాన్స్ కూడా దివ్యది రాంగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీరి గొడవపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. లైవ్ ప్రకారం ఈ వారం రీతూ కెప్టెన్ అయింది.






















