Bigg Boss Telugu Today Promo : బిగ్‌బాస్ హోజ్లో భరణి నామినేషన్స్.. నాన్న దగ్గరుండి నామినేట్ చేయించాడుగా, పాపం తనూజ
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్ హోజ్లో ఎక్స్ కంటెస్టెంట్ల నామినేషన్స్ పర్వం రెండో రోజు కూడా కొనసాగింది. ఇంట్లోకి వచ్చిన భరణి నామినేషన్స్ ఇప్పుడు హైలెట్‌గా నిలిచాయి.

Bigg Boss Nominations Bharani Into The House Promo : బిగ్‌బాస్ హోజ్ సీజన్ 9 డే 51 మొదటి ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. నిన్న ఎపిసోడ్ కంటిన్యూ చేస్తూ.. నామినేషన్స్ ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటివరకు ఇంట్లోకి వచ్చిన అందరూ తమ పాయింట్లు చెప్పి నామినేషన్స్ చేసి.. వారికి ఇన్‌డైరక్ట్‌గా గేమ్ ఎలా బయటకు వెళ్తోంది అనే దానిపై క్లారిటీ ఇస్తూ వచ్చారు. అలా లోపలికి వచ్చిన భరణి కూడా షాకింగ్ డైలాగ్స్ కొట్టి నామినేషన్స్ చేశాడు. తెలియకుండానే కూతురికి వెన్నుపోటు పొడిచేశాడా నాన్న అన్నట్లు ప్రోమో సాగింది. మరి ప్రోమో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రోమో హైలెట్స్..
బిగ్‌బాస్ ప్రోమో మొదలయ్యే సరికి.. భరణి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దివ్య నిఖిత పరిగెత్తుకుంటూ వెళ్లి భరణిని హగ్ చేసుకుంది. తనూజ కూడా దగ్గరికి వెళ్లింది. ఇమ్మాన్యూయేల్ భరణిని హగ్ చేసుకోగా.. కట్టప్ప వెన్నుపోటు పొడిచావుగా కట్టప్ప.. అమరేంద్ర బాహుబలిని బయటకు పంపించేశావు. ఇప్పుడు మహేంద్ర బాహుబలి వచ్చాడంటూ డైలాగ్స్ కొట్టాడు భరణి. ఒకవేళ ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ కాకపోయి ఉంటే.. అతనినే నామినేట్ చేసేవాడా అనిపించేలా మాట్లాడాడు. ప్రోమోలో శ్రష్టి వర్మ కూడా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు కనిపించింది. మరి ఎవరి నామినేషన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. శ్రష్ఠి వర్మ డిమోన్ పవన్‌ని నామినేట్ చేసింది. ఆ అమ్మాయికి ఉన్న క్లారిటీ కూడా నీకు లేదని చెప్తుంది. కండ బలం ఉంది కానీ.. బుద్ధి బలం లేదంటూ చెప్తుంది.
సంజనను టార్గెట్ చేసిన భరణి.. కానీ దెబ్బ తనూజకి తగిలింది
భరణి తన నామినేషన్స్ సంజనకు వేశాడు. అన్నయ్య.. లయన్ అన్నయ్య అంటే.. నేను నిజం అనుకున్నాను. ఈ ఇంట్లో నేను అందరితో రియల్ బాండింగ్స్ పెట్టుకున్నాను. కానీ మీరు నాది ఫేక్ బాండింగ్ అంటూ మాట్లాడడం హర్ట్ అయ్యాను అన్నాడు. ఒకరిని అనేసి సారి చెప్పేస్తే సరిపోతుందా అంటే సంజన మళ్లీ చెప్పమన్నా చెప్తాను అంటే సారీ చెప్తే సరిపోతుందా అని గట్టిగా అరిచాడు. ఇలా సంజనను నామినేట్ చేశాడు.
మరో నామినేషన్స్ నిఖిల్‌కి ఇచ్చినట్లు కనిపిస్తుంది. అయితే నిఖిల్ తనూజని నామినేట్ చేశాడు. ఇమ్మూని గేమ్ కోసం బతిమిలాడావు.. మళ్లీ ఇలా ఎలా ఫ్లిప్ చేస్తున్నావు అంటే.. నువ్వు నాకు గేమ్‌లో కనిపించలేదని తనూజ చెప్తుంది. మీరు చూడకపోతే నా తప్పు కాదు అంటాడు. అలాగే మీరు కూడా నాకు గేమ్‌లో కనిపించట్లేదని చెప్తాడు. నేను గేమ్ ఆడాను కాబట్టే ఇక్కడ ఉన్నాను అని చెప్తుంది తనూజ. అవునా మరి అయితే ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదేమి అని అడుగుతాడు.






















