Bigg Boss Telugu Today Promo : విజిల్ కొట్టి అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యకి వార్నింగ్ ఇచ్చిన తనూజ.. ఇన్‌డైరక్ట్‌గా దివ్వెల మాధురికి కూడా
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్ నామినేషన్స్ హీట్ గట్టిగానే కొనసాగుతుంది. దానికి సంబంధించిన మూడో ప్రోమోలో తనూజ రమ్యకు గట్టి వార్నింగ్ ఇచ్చింది.

Bigg Boss Monday Nominations Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగులో 7వ వారానికి సంబంధించిన నామినేషన్లు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన ప్రోమోలను స్టార్ మా వరుసగా విడుదల చేస్తుంది. దానిలో భాగంగా మూడో ప్రోమో వచ్చింది. దీనిలో రమ్యకి తనూజ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. విజిల్ వేసి మరి వార్నింగ్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు తనూజ ఎందుకు రమ్యకి వార్నింగ్ ఇచ్చింది? అమ్మ అంటూ దివ్వెల మాధురికి కూడా ఇన్‌డైరక్ట్‌గా వార్నింగ్ ఇచ్చిందా? ప్రోమో ఎలా ఉంది? హైలెట్స్ ఏంటో చూసేద్దాం.
బిగ్‌బాస్ సోమవారం నామినేషన్స్ ప్రోమో హైలెట్స్..
బిగ్‌బాస్ నామినేషన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. దానికి సంబంధించిన మూడో ప్రోమో ఎలా సాగిందంటే.. ముందుగా శ్రీనివాస్.. కళ్యాణ్‌కి ఫోమ్ పూసి.. నామినేట్ చేశాడు. ఇమ్యూనిటీ పవర్‌ని మీరు ఎంత తీసేద్దామనుకుంటున్నారో.. అది ఎంత రైట్ అని భావిస్తున్నారో.. ఎవరైతే మిమ్మల్ని అన్‌సేఫ్ చేశారో.. వాటిని భరించి మీరు ముందుకెళ్లడం కూడా అది రాంగే అంటూ శ్రీనివాస్ చెప్పాడు. దానికి గేమ్ ఆడుతున్నావు సాయి. నువ్వు ఎన్నిసార్లు టచ్ చేసినా వాడు అవుట్ అవ్వడు అంటే.. నేను ఎందుకు ఒప్పుకుంటా. ఓపెన్‌గా ఆరుగురి పవర్లు నేను తీసేయడానికి రెడీగా ఉన్నానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు కళ్యాణ్.
సంజనా దివ్యని నామినేట్ చేసింది. లీడర్ బోర్డ్ నుంచి నన్ను, ఫ్లోరాని తీసేశావు అంటూ సంజనా చెప్తే.. ఈ చెత్త రీజన్స్ అన్ని నాకు ఇప్పుడు చెప్పకండి అంటూ దివ్య రిప్లై ఇచ్చింది. భరణి అన్న బయటకు పోవడానికి ఒన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నువ్వే అంటూ సంజనా బ్లేమ్ చేసింది. నా వల్ల కాదు పోయింది. మీరు నామినేట్ చేస్తే వెళ్లిపోయారంటూ దివ్య చెప్పింది. దివ్యకు శ్రీజ 2.0 అంటూ పేరు పెట్టింది. గుర్తు పెట్టుకోండి దివ్య నిఖిత వేలుమూరి అంటే.. అంత గుర్తు పెట్టుకునే నేమ్ మీది కాదంటూ సంజన కౌంటర్ ఇచ్చింది.
రమ్యకి వార్నింగ్ ఇచ్చిన తనూజ
ఈవెనింగ్ ప్రోమోలో రమ్య తనూజను నామినేట్ చేయగా.. ఇప్పుడు తనూజ్ రమ్యకి వార్నింగ్ ఇచ్చి మరీ నామినేట్ చేసింది. ఒకరిని హర్ట్ చేయాలని, ఇంకొకరికి మంట పెట్టాలని వచ్చావా? అంటూ తనూజ అడిగ్గా.. నీలాగా ఒకరు వెళ్లిపోతే ఒకరితో బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదంటూ రమ్య కౌంటర్ ఇచ్చింది. అంటే భరణి నాన్న వెళ్లిపోగానే.. దివ్వెల మాధురికి అమ్మ అంటూ దగ్గర అవుతుంది తనూజ. అలాగే కళ్యాణ్‌కి చూపించిన వీడియో గురించి తనూజకి చెప్పినా కూడా మాధురితో ఫేక్‌గా ఉంటుంది.
నామినేషన్స్‌లో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని మాధురి చెప్పిన డైలాగ్‌నే రమ్యకి చెప్పింది. అంతేకాకుండా రెండు చేతులు కలిస్తేనే వచ్చే చప్పట్ల సౌండ్ కన్నా.. ఒక్క చేతితో వేసే విజిల్ సౌండ్ గట్టిగా వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానితో ఆగకుండా కూర్చొని గట్టిగా విజిల్ వేసేసరికి ఇంటి సభ్యులు కూడా ఖంగు తిన్నారు. మరి పూర్తి ఎపిసోడ్లో ఎన్ని ట్విస్ట్‌లు ఉన్నాయో వేచి చూడాల్సిందే.






















