Bigg Boss Telugu Today Promo : నిఖిల్ vs గౌరవ్.. నెక్స్ట్ లెవెల్లో కెప్టెన్సీ టాస్క్ పెట్టేసిన బిగ్‌బాస్
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్‌లో కెప్టెన్సీ టాస్క్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు. తుది దశకు చేరుకున్న ఈ టాస్క్‌లో నిఖిల్, గౌరవ్ తలపడ్డారు.

Bigg Boss Captaincy Task Promo : బిగ్‌బాస్ సీజన్ 9 రోజు రోజుకి ఇంట్రెస్టింగ్గా మారింది. ఎప్పుడూ లేని విధంగా ఇద్దరికీ కెప్టెన్సీ ఇచ్చాడు బిగ్‌బాస్. ముందు ప్రోమోలో కెప్టెన్సీ కోసం శవపేటికలతో టాస్క్ ఇచ్చాడు. దానిలో సుమన్ శెట్టి, గౌరవ్ గెలిచినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే సెకండ్ ప్రోమోలో వారి ఇద్దరి చేతికి కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చారు. అయితే ఇంట్లోకి వెళ్లేముందు నిఖిల్‌కి నాగార్జున ఓ పవర్ ఇచ్చారు. అదేంటి? ఆ పవర్‌తో ఏమి చేయాలి? ఇంతకీ ఫైనల్‌గా ఎవరు కెప్టెన్ అయ్యారో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో - కెప్టెన్సీ టాస్క్
ఇప్పటికే ఇంట్లో సభ్యుల నుంచి ఓ వ్యక్తి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో వచ్చిన గౌరవ్ కెప్టెన్స్ అయిపోయారు. అయితే ఇక్కడో ఓ ట్విస్ట్ పెట్టాడు బిగ్‌బాస్. అదేంటంటే వీరిద్దరిలో ఎవరో ఒకరితో టాస్క్ ఆడి.. వారు ఓడిపోతే ఆ కెప్టెన్సీ మీకు వస్తుందంటూ నిఖిల్‌కి చెప్పాడు బిగ్‌బాస్. అయితే నిఖిల్ స్ట్రాంగ్ కాబట్టి.. సుమన్ శెట్టికి కంటే గౌరవ్ ఆడితేనే మంచిగా ఉంటుందని భావించిన నిఖిల్.. గౌరవ్‌తో గేమ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. తన నిర్ణయం చెప్పగానే హోజ్మేట్స్ కూడా క్లాప్స్ కొట్టారు. మంచి నిర్ణయం అంటూ సంతోష పడ్డారు.
నిఖిల్ vs గౌరవ్
నిఖిల్, గౌరవ్‌కు బిగ్‌బాస్ అతి క్లిష్టమైన టాస్క్ పెట్టాడు. కర్రలపై కాళ్లు పెట్టి.. చేతుల్లో వెయిట్ బ్యాలెన్స్ చేయాలని సూచించాడు బిగ్‌బాస్. అయితే మీరు ఎవరైతే కెప్టెన్ కావద్దు అనుకుంటున్నారో.. వారికి శ్యాండ్ బ్యాగ్స్ వేయాలని చెప్పాడు. అయితే సంచాలక్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారు వచ్చి బరువులు వేయాలని చెప్పాడు. అయితే ఈ టాస్క్‌లో ఇద్దరూ టఫ్ కాంపిటేషనే ఇచ్చారు. లైవ్ ప్రకారం గౌరవ్ మళ్లీ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు కెప్టెన్స్ అయ్యారు. సుమన్ శెట్టి, గౌరవ్ కెప్టెన్స్‌గా ఫైనల్ అయ్యారు.
బజ్ ప్రకారం సుమన్ శెట్టి ఇంటి నుంచి వెళ్లిపోతాడు కాబట్టే.. ఇద్దరిని కెప్టెన్స్‌గా చేశారంటున్నారు నెటిజన్లు. మరికొందరేమో మాధురి ఎలిమినేట్ అవ్వాలంటూ కామెంట్లు పెట్టారు. ముందువరకు దివ్య, రీతూ ఇంట్లోనుంచి వెళ్లిపోవాలని కోరుకున్న బిగ్‌బాస్ అభిమానులు ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, దివ్వెల మాధురి వెళ్లిపోవాలనుకుంటున్నారు. అయితే ఈవారం వాళ్లు నామినేషన్స్‌లో లేరు కాబట్టి కచ్చితంగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.






















