Bigg Boss Telugu Today Promo : శవపేటికలో దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య.. కానీ గెలిచింది సుమన్ శెట్టి టీమ్
Bigg Boss Telugu 9 Latest Promo : అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యను, దివ్వెల మాధురిని శవపేటికలో పెట్టాడు బిగ్‌బాస్. కానీ సుమన్ శెట్టినే గెలిచాడు.

Bigg Boss Alekya Tasks for Two Captains Promo : బిగ్‌బాస్‌లో కెప్టెన్సీ కోసం టాస్క్‌లు నిర్వహిస్తున్నాడు. అయితే మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఇద్దరూ కెప్టెన్స్ ఉంటారంటూ అందరినీ షాక్‌కి గురిచేశాడు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశాడు. ఈ టాస్క్‌లో భాగంగా అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యను, దివ్వెల మాధురి, సుమన్ శెట్టిని శవపేటికలో పెట్టాడు. ఇంతకీ ఎవరు గెలిచారు. మాధురి ఎందుకు ఏడ్చింది? కెప్టెన్స్ ఎవరు అయ్యారో.. ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో..
బిగ్‌బాస్‌లో మునుపెన్నడూ లేనివిధంగా ఇద్దరు కెప్టెన్లు ఉంటారంటూ బిగ్‌బాస్ బాంబ్ పేల్చాడు. దానికి సంబంధించిన ప్రోమో ఎలా ఉందంటే.. కెప్టెన్సీ కోసం ఈ బిగ్‌బాస్‌లో మొదటిసారి ఇద్దరు కెప్టెన్లు ఉండబోతున్నారంటూ షాకింగ్ న్యూస్ తెలిపాడు. అయితే ఇలా చూస్తే.. ఉన్న ఆరుగురిలో ఇద్దరు కెప్టెన్ అవ్వొచ్చు అనమాట. ప్రస్తుతం అయేషా, దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టిపికిల్స్, సుమన్ శెట్టి, గౌరవ్, శ్రీనివాస ఆడారు. వీరు ఆరుగురు.. మూడు జంటలుగా విడిపోయి.. గేమ్ ఆడాల్సి ఉంది.
ముందుగా ముగ్గురు సభ్యులు యాక్టివిటీ రూమ్లోకి వెళ్లి.. శవపేటికల్లో ఉండాలని.. బయట ఉన్నవారి టీమ్ సభ్యులు లాక్ వెతికి.. దానిలో ఉన్న ఓ పజిల్ ద్వారా కీని తీసుకొచ్చి.. శవపేటికల్లోని వారిని బయటకి తీయాలి. అయితే ఈ టాస్క్‌లో మాధురి- అయేషా, సుమన్ శెట్టి - గౌరవ్, శ్రీనివాస- అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గేమ్ ఆడారు. శవపేటికల్లో మాధురి, రమ్య, సుమన్ శెట్టి ఉండగా.. మిగిలిన వారు కీ తెచ్చేందుకు గేమ్ ఆడారు. అయితే ఈ టాస్క్ ముగిసేసరికి మాధురి, అయేషా ఓడిపోయారు. బయటకొచ్చిన అయేషా ఏడ్చేసింది. నా వల్లే ఓడిపోయామంటూ ఎక్కి ఎక్కి ఏడ్చేసింది. కళ్లు కనిపించలేదు అంటూ బ్లేమ్ వేసుకుని ఏడ్చేసరికి.. ఓ వైపు మాధురి కూడా ఏడ్చేసింది.
బిగ్‌బాస్ కంటెస్టెంట్లు వారిని ఓదార్చారు. అయితే లైవ్ ప్రకారం ఇంటికి ఇద్దరు కెప్టెన్లుగా సుమన్ శెట్టి, గౌరవ్ గెలిచినట్లు తెలుస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ఇద్దరు కెప్టెన్లు వారికి నచ్చిన రూల్స్ పెడతారో.. లేదా వారు కలిసి ఇంటిని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. అలాగే రేపు నాగార్జున కంటెస్టెంట్లకు ఎలాంటి సూచనలు ఇస్తారో.. గేమ్ గురిచి ఏమి తిడతారో అనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది.






















