Bigg Boss Telugu Today Promo : రీతూ లవ్ కంటెంట్ కోసమే వచ్చిందట.. తనూజకు ఏజ్ పెరిగింది కానీ బుద్ది పెరగలేదట, బిగ్‌బాస్ నామినేషన్స్
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్‌లో సోమవారం నామినేషన్స్ వచ్చేశాయి. అయేషా, రీతూ మధ్య గట్టి గొడవే జరిగింది. హైలెట్స్ చూసేద్దాం.

Bigg Boss Monday Nominations Promo : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 నుంచి నాన్న (భరణి) వెళ్లిపోయాడు. ఇప్పుడు 7వ వారానికి సంబంధించిన నామినేషన్స్ జరుగుతున్నాయి. నువ్వా నేనా అనే రేంజ్లో నామినేషన్స్ వేసుకుంటున్నారు. సండే నాగార్జున, ఇతరులు ఇచ్చే ఇన్‌పుట్స్‌తో ఈ నామినేషన్స్ మొదలయ్యాయి. అయేషా- రీతూకి పెద్ద ఫైట్ జరగ్గా, తనూజకు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యకు గట్టి మాటల యుద్ధమే జరిగింది. దానికి సంబంధించిన రెండు ప్రోమోల రివ్యూ ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ నామినేషన్స్ 7వ వారం మొదటి ప్రోమో..
బిగ్‌బాస్ నామినేషన్స్ వేయడానికి కూడా అర్హత సాధించాలంటూ ట్విస్ట్ పెట్టాడు. దానిలో భాగంగా టాస్క్ పెట్టి.. ఇమ్మాన్యూయేల్, అయేషాతో బెలూన్ గేమ్ ఆడించాడు. ఇంటి నిండా బెలూన్స్ పెట్టి.. వాటిని బ్లాస్ట్ చేస్తే వాటిలో కొన్ని షీట్స్ ఉంటాయని.. వాటిని నామినేషన్స్ షేర్ చేసుకోవడానికి వాడాలని సూచించాడు. వాటిలో కొన్ని చిట్టిలలో ఒకరిని నామినేట్ చేయాలని.. మరొకొన్ని వాటిలో ఇద్దరిని నామినేట్ చేయాలని.. ఒక దానిలో డైరక్ట్ నామినేట్ చేయాలనేవి వచ్చాయి.
రీతూ లవ్ ట్రాక్ కోసమే వచ్చింది..
ఇమ్మాన్యూయేల్, అయేషా నామినేషన్స్ షేర్ చేసుకునేందుకు కొందరికి చిట్టీలు ఇచ్చారు. అయేషా మాత్రం రీతూని బాగా టార్గెట్ చేసింది. కేవలం లవ్ ట్రాక్ కోసమే ఇక్కడి వచ్చావంటూ ఫైర్ అయింది. ఫేస్‌కి ఫోమ్ పూసి నామినేట్ చేయగా ఒక్క నిమిషం ఆగమంటే.. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావంటూ రీతూపై అయేషా మండిపడింది. ఎప్పుడూ అలాగే చేస్తావని.. ఓవర్ యాక్షన్ పర్సన్‌వి అంటూ సీరియస్ అవ్వడంతో రీతూ కూడా గట్టిగా రిప్లై ఇచ్చింది. దీంతో అయేషా రీతూని డైరక్ట్‌గా నామినేట్ చేస్తున్నానంటూ చెప్పడంతో ప్రోమో ముగిసింది.
బిగ్‌బాస్ నామినేషన్స్ 7వ వారం మొదటి ప్రోమో హైలెట్స్..
దివ్య.. శ్రీనివాస్‌ని నామినేట్ చేసింది. మీ ఓపీనియనే రైట్ అనే ఒక భ్రమలో ఉంటారు అంటూ దివ్య చెప్పగా.. ఒక సిచ్యూవేషన్ చెప్పమంటూ శ్రీనివాస్ అడిగాడు. నేను చెప్పను సాయి నాకు అవసరం లేదు అని దివ్య అనేసరికి షాక్ అయ్యాడు. మీరు ఇక్కడ ఫ్యామిలీని క్రియేట్ చేసుకుని.. ఎక్కడో ఉన్న వ్యక్తిని బయటకు పంపేశారు అన్నట్లు మాట్లాడితే.. ఆయన నావల్ల వెళ్లలేదు.. అలా ఎవరూ చెప్పలేదంటూ ఆన్సర్ ఇచ్చింది. దాంతో మీరు చెప్పే ఆన్సర్ వ్యాలిడిటీలో లేదంటూ గట్టిగా అరిచేశాడు.
రమ్య vs తనూజ
తర్వాత వచ్చిన రీతూ.. రాముని గేమ్‌లో కనిపించట్లేదంటూ నామినేట్ చేసింది. నీకే కనిపించట్లేదు నేను కెప్టెన్ అయ్యాను అంటే.. ఎవరి సపోర్ట్ లేకుండానే అయ్యావా అని అడుగుతుంది. దీంతో రాము నీకు సపోర్ట్ లేదా? అని అడిగి.. తర్వాత ఇంట్లో ఉన్నవారిని నేను సపోర్ట్ అడిగానా అంటే అందరూ నో చెప్తారు. తర్వాత వచ్చిన రమ్య తనూజని నామినేట్ చేస్తుంది. మీరు ఇంట్లో యాక్టింగ్ చేస్తున్నారంటూ స్టేట్మెంట్ ఇస్తుంది. అంతటితో ఆగకుండా మాట్లాడేసరికి నీ వయసుకు తగ్గట్లు నువ్వు మాట్లాడు అని తనూజ అనేసరికి.. మీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అనేసింది రమ్య. దీంతో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ తనూజ సీరియస్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.






















