Bigg Boss Telugu 9 Day 4 Promo 2 : ఓనర్స్‌కి గట్టి షాక్ ఇచ్చిన 'బిగ్‌బాస్'.. కెప్టెన్ అయిన సంజన, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇదే
Bigg Boss Telugu 9 Promo : బిగ్‌బాస్ ఎవరిని ఎప్పుడూ ఎలా కెప్టెన్‌ని చేస్తుందో తెలీదు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సంజనను లోపలికి రానివ్వకూడదనుకున్న ఓనర్స్ గట్టి షాక్ తగిలింది

Bigg Boss Telugu 9 Day 4 Sep 11 Promo 2 : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగులో మొన్నటివరకు మాస్క్ మ్యాన్ హరీశ్ పేరు వినిపిస్తే.. ఇప్పుడు సంజన పేరు వినిపిస్తుంది. ఈ భామ ఇప్పటికే అందరితో ఓ ఆట ఆడేసుకుంది. దానిలో భాగంగా మొన్న షాంపూ పంచాయతీ జరిగితే.. నిన్న గుడ్డు దొంగతనంతో అందరి చూపు ఆమె వైపు తిప్పుకుంది. అందునూ ఆమె వల్ల అందరూ పోట్లాడుకుంటుంటే.. సంజనా మాత్రం చిల్ అవుతూ ఆ సినారియోని ఎంజాయ్ చేసింది.
ఇదేమి ట్విస్ట్ రా అయ్యా..
సంజన చేసే పనులకు పిచ్చేక్కిపోయిన ఓనర్స్.. ఆమెను రెండ్రోజులు ఇంట్లోకి ఎంట్రీ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంటున్నట్లు ప్రోమో విడుదల చేశారు. కట్ చేస్తే బిగ్‌బాస్ లైవ్‌లో ఓ షాకింగ్ విషయం జరిగింది. అదేంటంటే సంజనను కన్సెషన్ రూమ్లోకి పిలిచిన తర్వాత.. బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్‌లు పెట్టడం.. అనుకోకుండా సంజన కెప్టెన్ అవ్వడంతో.. ఇదేమి ట్విస్ట్‌రా అనుకుంటున్నారు. అయితే ఈ విషయం ఈరోజు టెలీకాస్ట్ కాకపోవచ్చు. రేపు కెప్టెన్సీని డిక్లేర్ చేయవచ్చు.
ప్రోమోలో జరిగిన రచ్చ ఇదే..
బిగ్‌బాస్ సీజన్ 9 డే 4లో భాగంగా ప్రోమో 2 రిలీజ్ చేశారు. దీనిలో ప్రియా, మనీష్ మధ్య గొడవ జరిగింది. ఓనర్స్‌తో శ్రష్టి ఆమె వల్ల మొత్తం టీమ్ అంతా డిస్టర్బ్ అవుతుందని చెప్తుంది. దీంతో ఓనర్స్ ఆమెను రెండ్రోజులు లోపలికి రానివ్వకూడదని నిర్ణయం తీసుకుంటారు. అందరూ ఓనర్సే.. నేను పిలవాలనుకున్నప్పుడు పిలుస్తానని ప్రియ చెప్పడంతో.. నాకు ఇప్పటివరకు ఇలా ట్రీట్ చేయలేదంటూ మనీష్ చెప్తాడు. ప్రియా, శ్రీజ ప్రతి దాంట్లో గొడవ పెట్టుకుంటున్నారని స్టేట్మెంట్ ఇచ్చేశాడు.
మనీష్ మాటలను ప్రియ, శ్రీజ డిఫెండ్ చేసుకున్నారు. నిన్ను పాయింట్ అవుట్ చేయాలంటే చాలా సింపుల్ అని శ్రీజ అంటే.. కామ్‌గా ఉన్నానని తొక్కేయడానికి చూడకండి అంటూ మనీష్ చెప్పాడు. ప్రియా నన్ను మాట్లాడనివ్వూ అంటూ మనీష్ సీరియస్ అయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యూమెంట్ జరిగింది.






















