అన్వేషించండి

Bigg Boss: నామినేషన్‌లో ఆ ఇద్దరినే టార్గెట్ చేసిన హౌస్‌మేట్స్, ఫస్ట్ వీక్ బయటకు వెళ్ళేది ఎవరంటే?

Bigg Boss 8 Telugu Nomination: బిగ్బాస్ తొలి రోజు నుంచే దద్దరిల్లిపోతోంది. అసలు ఆటను మొదటి రోజే మొదలెట్టిన బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయగా, హౌస్ మేట్స్ ఇద్దరినే టార్గెట్ చేశారు.

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. గత ఏడు సీజన్ల మాదిరిగా కాకుండా ఈసారి సీజన్ 8లో పలు మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇక హౌస్ మొదటి రోజు నుంచే గొడవలతో దద్దరిల్లిపోతుంది. గతంలోలాగా హౌస్ కి ఒకే లీడర్ ని పెట్టకుండా, చీఫ్ అనే పేరుతో ఈసారి ఏకంగా ముగ్గురిని నియమించారు. ఆ తర్వాత అసలు ఆటను మొదలు పెట్టాడు బిగ్ బాస్. తాజాగా స్ట్రీమింగ్ అయిన మూడవ ఎపిసోడ్ లో హాట్ హాట్ గా ఎలిమినేషన్ ప్రాసెస్ సాగింది. అందులోనూ ఇద్దరినే టార్గెట్ చేశారు హౌస్ మేట్స్. మరి ఈసారి హౌస్ లో నుంచి బయటకు ఎవరిని గెంటేస్తారు? అనే విషయంపై డీటెయిల్ గా ఓ లుక్కేద్దాం.  

చీఫ్స్ కే ఎలిమినేషన్ అధికారం 
నిన్న సాగిన మూడవ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా ముగ్గురు చీఫ్ లను గద్దలపై కూర్చోబెట్టారు. హౌస్ మేట్స్ ఒక్కొక్కరుగా ఇద్దరిని నామినేట్ చేస్తే, అందులో ఒకరిని సేవ్ చేసి, ఒకరిని ఎలిమినేట్ చేసే అధికారాన్ని చీఫ్ కు ఇచ్చాడు బిగ్ బాస్. అంటే ఈసారి హౌస్ మేట్స్ మాత్రమే కాకుండా చీఫ్ లు కూడా తమకు అనర్హులు అనిపించిన వారిని డేంజర్ లో పడేస్తారన్నమాట. సోనియా ముందుగా మొదలుపెట్టి బేబక్క, ప్రేరణ లను టార్గెట్ చేసింది. ఇద్దరినీ నామినేట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ గొడవకు కారణమయ్యాయి. కనీసం చీఫ్ లు కూడా సోనియా నోటికి అడ్డుకట్ట వేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే బేబక్క ఆమెను వదిలేసినా ప్రేరణ మాత్రం ఫైర్ అయింది. ఇక ఆ తర్వాత చీఫ్ యష్మి సోనియా చెప్పిన రీజన్ కరెక్ట్ అంటూ బేబక్కను నామినేట్ చేసింది. ఆ తర్వాత నబిల్ షో నడిచింది. ఆయన మణికంఠను, బేబక్కను నామినేట్ చేయగా, మళ్లీ యష్మి కత్తి గుచ్చి మణికంఠను నామినేట్ చేసింది. ఇక శేఖర్ బాషా కూడా ఈ ఇద్దరిని టార్గెట్ చేశాడు. బేబక్క వంతు వచ్చేసరికి ఆమె నబీల్ ను, పృథ్వీని నామినేట్ చేసింది. ఇద్దరితోనూ బేబక్కకు మాటల యుద్ధమే నడిచింది. 

Also Read: బిగ్​బాస్​ నామినేషన్స్​​లో గుడ్డు పంచాయతీ.. అమ్మ సెంటిమెంట్​తో ఏడిపించేసిన మణికంఠ.. ఏదోలోకంలో ఉన్న ఆదిత్య

ఆ ఇద్దరే టార్గెట్..
నిన్న రాత్రి జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్ పూర్తి కాకపోయినా, పరిస్థితి చూస్తుంటే హౌస్ మేట్స్ గత సీజన్లలో వాడిన స్ట్రాటజీనే వాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ముందుగా అందరూ కలిసి ఒకరిద్దరినే టార్గెట్ చేస్తున్నారు. అలా ఈసారి బెబక్కను బయటకు పంపే ప్లాన్ చేశారు. మొదటిరోజు తమను ఆకలితో మాడ్చింది, కిచెన్ లోకి రావద్దు అన్నది అనే సాకులతో ఆమెను నామినేట్ చేశారు. ఇక ఆ తర్వాత స్థానంలో మణికంఠ ఉన్నాడు. మణికంఠ మెతగ్గానే కనిపించినా చాలామందికి హౌస్ లో కొరకరాని కొయ్యగా మారాడు. మొదటి రోజే ఆయన విషయంలో జరిగిన కాంట్రవర్సీని మనసులో పెట్టుకొని హౌస్ మేట్స్ ఇతన్ని కూడా బయటకు పంపించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఫస్ట్ వీక్ నామినేషన్ లో కచ్చితంగా వీరిద్దరిలో ఒకరే బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు హౌజ్ లో కాలు పెట్టి కేవలం రెండు మూడు రోజులే అవుతోంది. కనీసం సెటిల్ కూడా కాలేదు అంతలోనే నామినషన్లలో నిలిచారు. మరి వీరిద్దరినీ నామినేషన్ నుంచి కాపాడుకునేంత ఫ్యాన్స్ బేస్ ఉందా అనే అనుమానమే.

Also Read: అమ్మ శవం కాల్చేందుకు డబ్బులు అడుక్కున్నా... బిగ్ బాస్‌లో ఏడ్చేసిన నాగమణికంఠ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
Embed widget