అన్వేషించండి

Bigg Boss Telugu 8 Sunday Promo : బిగ్​బాస్​ షో 100 రోజులు ఎందుకు? ఒక రోజులోనే చేసేయండి.. ఛీ..రాకు అంటోన్న మణికంఠ.. గట్టిగా ఇచ్చిపడేసిన విష్ణుప్రియ

Sunday Funday Promo : బిగ్​బాస్​ సండే ఫన్ డే నుంచి రెండో ప్రోమో వచ్చేసింది. అయితే కాస్త ఫన్నీగా, అర్థవంతంగా, ఇంట్రెస్టింగ్​గా సాగినట్లే కనిపిస్తోంది..

Bigg Boss Telugu 8 Sunday Funday Promo: బిగ్​బాస్ ఎడిటర్ శనివారం రెండు ప్రోమోలు లేట్​గా విడుదల చేశారు అనే కామెంట్లకు ఎడిటర్ ఫీల్ అయినట్లున్నాడు. ఈరోజు రెండు ప్రోమోలను ఆగామేఘాల మీద విడుదల చేశాడు. తాజాగా సండే ఫన్​ డేకి సంబంధించిన రెండో ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. మొదటి ప్రోమోలో కాస్త ఫన్ తక్కువైనా.. రెండో ప్రోమోలో మాత్రం ఎంటర్​టైన్​మెంట్ బాగానే ఉంది. అయితే ఫన్ మాత్రమే కాదు.. ఈసారి కంటెస్టెంట్​ల మాటల్లో కాస్త మెచ్యూరిటీ కనిపించింది. ఇంతకీ ప్రోమో ఎలా సాగిందంటే.. 

యానిమల్ థీమ్..

బిగ్​బాస్​ హౌజ్​లో ఈసారి ఎప్పుడూ లేనంత యానిమల్స్​ని చూపించాడు బిగ్​బాస్. ఈ నేపథ్యంలోనే యానిమల్ టాస్క్​ ఇచ్చారు నాగార్జున. ఈ టాస్క్​కి యానిమల్ డెడికేషన్ అనే పేరు పెట్టారు. యానిమల్ కార్డ్స్ పెట్టి.. నాగార్జున పేరు పిలిచినప్పుడు ఒక్కొక్కరు వచ్చి.. ఆ యానిమల్​ను ఒకరికి డెడికేట్ చేయాలి. ఆ యానిమల్ ఎవరు ఎందుకు వారికి ఇస్తున్నారనే విషయం చెప్పాలంటూ ట్విస్ట్ పెట్టారు. ఒక్కరు ఒక్క యానిమల్​ని మాత్రమే డెడికేట్ చేయాలని తెలిపారు. 

ఇద్దరు తల్లులతో సమానం..

ప్రోమోలో ముందుగా నిఖిల్​ని చూపించారు. అతను దోమ కార్డును తీసుకెళ్లి శేఖర్ బాషాకు వేసి హగ్ చేసుకున్నాడు. అయితే శేఖర్ దీనిని స్పోర్టివ్​గా తీసుకుని.. దో.. మా అంటే రెండు తల్లులతో సమానం అంటూ చెప్పగా.. నాగార్జున మెచ్చుకున్నాడు. నిఖిల్ దోమను ఎందుకిచ్చాడంటే.. ఒక్కో జోక్​ వేస్తారు.. సీరియస్​గా ఇలా తలపై నుంచి వెళ్లిపోతుంది. సీరియస్ సమయాల్లో కూడా స్పాంటినియస్​గా జోక్​ వేస్తారంటూ తెలిపి.. అందుకే దోమను ఇచ్చానని తెలిపాడు. 

చెత్త డిస్కషన్

నామినేట్ చేసినందుకు పిచ్చి పిచ్చి జోకులు చెప్పి.. ఇంకోసారి నామినేట్ చేస్తావా అని బెదిరిస్తున్నాడంటూ విష్ణుప్రియ నాగార్జునకు తెలిపింది. దీంతో అందరూ నవ్వారు. నిజానికి ఇది మంచి స్ట్రాటజీ అంటూ నాగార్జున కూడా నవ్వేశారు. ప్రేరణ.. సీతకు తేలుని ఇచ్చింది. జోక్​గా తీసుకోవాల్సిన వాటిని సీరియస్​గా తీసుకుంటుంది అంటూ చెప్పింది. దీనికి చెత్త బాటిల్ ఇష్యూ గురించి వేస్తుందంటూ కౌంటర్ ఇచ్చింది సీత. 

వంద రోజులు ఎందుకు..

నిఖిల్ గాడిద బొమ్మని బేబక్కి ఇచ్చాడు. దానిపై ఉన్న తెలివి తక్కువ వర్డ్​ని ఎక్స్​ప్లైయిన్ చేస్తూ.. నిఖిల్​ తోపు కంటెస్టెంట్ అని చెప్పింది గానీ.. తన స్ట్రెంత్ తాను గుర్తించలేకపోయింది అంటూ ఆ కార్డు బేబక్కకి డెడికేట్ చేశాడు. దీనిని డిఫెండ్ చేసుకుంటూ బేబక్క సీరియస్​ అయింది. ఒక్కరోజులో ఎవరి స్ట్రెంత్ ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు బిగ్​బాస్​ని వంద రోజులు చేయడం ఎందుకు నాగ్ సార్​ ఒక్కరోజులో చేస్తే సరిపోతుంది కదా అంటూ బదులిచ్చింది. 

గట్టిగా ఇచ్చిపడేసిన విష్ణుప్రియ

కన్నింగ్​ అంటూ నక్క బోర్డును సోనియా విష్ణుప్రియ మెడలో వేసింది. ఇండైరెక్ట్​గా పోక్​ చేయడం, కామెంట్లు చేయడం చేసి మాట్లాడడం చేసిందని సోనియా చెప్పింది. అయితే విష్ణుప్రియ గట్టిగా కౌంటర్ ఇస్తూ.. ఆమెకు నేను వెంటనే వెళ్లి సారీ చెప్పాను సార్. సోనియా గారు మీరు దీనిని తప్పుగా తీసుకుంటే సారి. క్షమించండి అని చెప్పాను. ఆమెనె పది సెకన్ల తర్వాత వచ్చి డోంట్ ఇన్​వాల్వ్​ ఇన్​ సచ్ అడల్టరేట్ కామెడీ అంటూ జోక్స్ అంటూ పోక్ చేసింది ఆమెనె అంటూ గట్టిగా ఇచ్చి పడేసింది. 

Also Read : బిగ్​బాస్ సండే ఫన్​డే ప్రోమో.. డాగ్ ఫోజుల్లో కంటెస్టెంట్లు.. ఈ వారం ఫన్​డేతో పాటు మరో డే కూడా ఉందన్న నాగ్

లాస్ట్ పంచ్ శేఖర్ బాషదే..

సీత తనకంటూ ఓన్ డెసీషన్ లేదెమో అని ఎవరినో ఉద్దేశించి చెప్పింది. తర్వాత వచ్చిన మణికంఠ శేఖర్ బాషకు దోమ బోర్డ్ వేశాడు. దానిపై ఉన్న చిరాకును ఉద్దేశించి శేఖర్ బాష ఓ జోక్ వేశాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయమొకటి చెప్పాలి సార్. అంటే జోక్ వద్దు అని నాగార్జున అన్నాడు. అప్పుడు శేఖర్ బాష.. జోక్ కాదు సార్.. దీంట్లో ఓ మెసేజ్​ నీకే అంటూ మణికంఠకు చెప్పాడు. మణికంఠ ఎక్కడో మూల కూర్చొంటాడు సార్. మనం దగ్గరకు వెళ్తే ఛీ.. రాకు అంటూ అని.. చెప్పడంతో అందరూ నవ్వేశారు. మణికంఠ కూడా గట్టిగా నవ్వడంతో ప్రోమో ముగిసింది. 

Also Read : ఆనవాయితీ ప్రకారం బేబక్కను బయటకు పంపేసిన బిగ్​బాస్.. ఈ వారానికి ఆమె రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget