Bigg Boss Telugu 8 Day 5 Promo : న్యూ ఛాలెంజ్ ఇచ్చిన బిగ్‌బాస్.. అడ్డ దిడ్డంగా గేమ్ ఆడమంటోన్న యశ్మీ టీమ్.. స్ట్రాటజీ ప్లే చేశామంటోన్న నైనిక టీమ్
Loop The Hoop Challenge : బిగ్‌బాస్ సీజన్ 8 డే 5 ప్రోమో వచ్చేసింది. లూప్ ద హూప్ ఛాలెంజ్ బిగ్‌బాస్ ఇవ్వగా.. కంటెస్టెంట్లు వాళ్ల అతి తెలివితో గొడవలు ప్రారంభించారు. ప్రోమోలో ఏమి ఉందంటే..
BiggBoss Season 8 Telugu Loop the Hoop Promo : బిగ్‌బాస్ సీజన్ 8 ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు కానీ.. గొడవలు మాత్రం అన్‌లిమిటెడ్‌గా జరుగుతున్నాయి. చిన్న చిన్నవాటికి గొడవలు చేసి మరీ కంటెంటె ఇవ్వాలని కంటెస్టెంట్లు చూస్తున్నారు. కానీ అవి ప్రేక్షకులకు రోత పుట్టిస్తున్నాయి. మణికంఠ ప్రతిసారి ఎమోషనల్ అవుతూ.. సింపతి క్రియేట్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. నిన్న ఇచ్చిన టాస్క్‌ని ఈరోజు కంటిన్యూ చేస్తూ.. తాజా ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇంతకీ ఈ ప్రోమో ఎలా సాగిందంటే..
చీఫ్స్.. క్లాన్స్ని ఎంచుకోమంటూ చెప్పిన బిగ్‌బాస్ నైనిక, యశ్మీ గౌడ టీమ్‌లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి.. ఇలా ఉండకూడదని చెప్పి.. వారిలో గెలిచిన వారే నెక్స్ట్ లెవల్ ఆడుతారంటూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. వాళ్ల టీమ్స్‌కి నిఖిల్ సంచాలకుడిగా చేస్తున్నాడు. వీరిలో ఎవరు గెలిస్తే వారు నిఖిల్ టీమ్ నుంచి సభ్యులను తీసుకోవచ్చంటూ తెలిపాడు. దీంతో యశ్మీ టీమ్, నైనిక టీమ్ మధ్య మొదటి పోటి జరిగింది. ఈరోజు రెండో పోటి జరగనున్నట్లు బిగ్‌బాస్ తెలిపాడు.
లూప్ ద హూప్
నైనిక, యశ్మీ మీరు బెటర్ క్లాన్ అని నిరూపించుకోవడానికి మీకు ఇస్తున్న సెకండ్ ఛాలెంజ్ లూప్ ద హూప్ అని బిగ్‌బాస్ తెలిపాడు. మీ టీమ్ సభ్యులు ఒకరి చేయి ఒకరు పట్టుకుని.. చేతులను ఉపయోగించకుండా.. చేయిని బ్రేక్ చేయకుండా.. శరీరం మీదుగా హూప్స్‌ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది అంటూ టాస్క్‌ను వివరించారు. అయితే ఇద్దరూ టీమ్స్ ఈ టాస్క్‌ని కంప్లీట్ చేశారు. అయితే నైనిక టీమ్ ముందుగా ఈ టాస్క్‌ని కంప్లీట్ చేశారు. యశ్మీ టీమ్ కొంచెం ఆలస్యంగా దీనిని కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడే అసలు గొడవ మొదలైంది.
గొడవమేటంటే..
బిగ్‌బాస్ శరీరం మీదుగా హూప్స్‌ని తీసుకువెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు. ఇద్దరు టాస్క్ కంప్లీట్ చేసే సమయంలో నవీన్.. అవతలి టీమ్ వాళ్లు హెడ్ మీద నుంచి హూప్స్ వదలడం చూసి పాయింట్ రైజ్ చేశాడు. దీంతో గొడవ స్టార్ట్ అయింది. చేతులు విడవకుండానే హూప్స్‌ని ఫార్వార్డ్ చేయాలని బిగ్‌బాస్ చెప్పాడని.. మేము అలానే ఆడాము.. ఇది మా స్ట్రాటజీ అంటూ నైనిక టీమ్ తెలిపింది. శరీరం మీదుగా అని బిగ్‌బాస్ చెప్పాడు.. శరీరం అంటే తల ఒకటే వస్తుందా అంటూ యశ్మీ టీమ్ ఆర్గ్యూ చేసింది.
నిఖిల్ జడ్జిమెంట్ ఎటువైపు?
యశ్మీ టీమ్‌ని అడుగుతూ.. శరీరం మీదుగా అంటే మీరు ఫుల్ బాడీ అనుకున్నారు అని నిఖిల్ చెప్పగా.. అవును.. మేము రూల్స్‌ని ఫాలో అయ్యాము అంటూ యశ్మీ సీరియస్ అయింది. శరీరం నుంచి తీసుకెళ్లాలి అని నిఖిల్ చెప్పగా.. శరీరం అంటే తల ఒక్కటే కాదు మామ.. టోటల్ బాడీ వస్తుందంటూ పృథ్వీరాజ్ చెప్పాడు. అడ్డంగా దిడ్డంగా మేము వెళ్లట్లేదు. రూల్స్ ఫాలో అవుతున్నామంటూ యశ్మీ టీమ్ ఫైర్ అయింది. అయినా కూడా నిఖిల్ నైనిక టీమ్‌కి సపోర్ట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. ఇంతకీ సంచాలక్ ఏ నిర్ణయం తీసుకున్నారు.. ఏ టీమ్ గెలిచింది. ఎవరిది న్యాయముందో ఈరోజు ఎపిసోడ్లో చూడాల్సిందే.