అన్వేషించండి

Bigg Boss 8 Latest Promo: శేఖర్‌ భాషాకు బిగ్‌బాస్‌ గుడ్‌న్యూస్‌ - విష్ణుప్రియ వ్యవహరంలో సోనియాను కడిగిపారేసిన నాగ్‌! అదిరిపోయిన లేటెస్ట్‌ ప్రొమో

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌ హౌజ్‌ అంత ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యింది. హోస్ట్‌ నాగార్జున శేఖర్‌ భాషాకు తీపి కబురు అందించారు. ఆ తర్వాత సోనియాను మాటలు అదుపులో పెట్టుకోవాలంటూ గట్టిగా ఇచ్చిపడేశాడు నాగ్‌. 

Bigg Boss Telugu 8 Day 13 Second Promo: బిగ్‌బాస్‌ వీకెండ్‌ వచ్చేసింది. ఈ వారం కంటెస్టెంట్స్‌ తప్పులను గురి చూపిస్తు ఫైర్‌ అయ్యారు నాగ్‌. తాజాగా విడుదలైన ఈ ప్రోమో చూస్తుంటే ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌ ఫుల్‌ హీట్‌ పెంచేసేలా కనిపిస్తుంది. హౌజ్‌ చీఫ్‌గా యష్మీ గౌడ్‌ చేసిన ఓవరాక్షన్‌పై నాగ్‌ ఫైర్‌ అయ్యారు. ఆమె తప్పులు, అన్‌ఫెయిర్‌ డిసిజన్స్‌ని ఎత్తిచూపుతూ యష్మీ గౌడ్‌ను కడిపేడేశారు నాగార్జున. ఇక చీఫ్‌ ఫెయిల్‌ అంటూ ఆమెకు గన్‌ గురిపెట్టి ఫైర్‌ అయ్యారు. ఇక కంటెస్టెంట్‌ పృథ్వీ ఎఫ్‌ వర్డ్‌ వాడటంపై నాగ్‌ మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే గన్‌ ఫైర్‌ అయ్యి బయటకు వచ్చేస్తావంటూ గట్టిగా ఇచ్చిపడేశాడు. అలా మొదటి ప్రోమో మొత్తం వార్నింగ్‌, ఫైర్‌లతో సీరియస్‌గా సాగింది. 

తండ్రైన శేఖర్‌ భాషా

ఇక తాజాగా విడుదలైన రెండో ప్రోమో సర్‌ప్రైజ్‌, ఎమోషన్స్‌తో సాగింది. ప్రోమోలో నాగ్‌ హౌజ్‌లో మేజర్‌ చేంజస్‌ జరగబోతున్నాయంటూ ట్విస్ట్‌ ఇచ్చాడు. ఆ తర్వాత శేఖర్‌ భాషాకు గుడ్‌న్యూస్‌ అంటూ తీపి కబరు అందించాడు హోస్ట్‌ నాగార్జున. దీంతో శేఖర్‌ భాషా ఎమోషనలైన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. హౌజ్‌లోకి వచ్చేముందు గర్భవతిగా ఉన్న శేఖర్‌ భాషా భార్య కాసేపటి క్రితమే ప్రసవించింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందంటూ నాగార్జున శేఖర్‌ భాషాకు తీపి కబురు అందించారు. అది శేఖర్‌ భాషా ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యాడు. దీంతో హౌజ్‌మేట్స్‌ అంతా సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఈ వార్త మిగతా హౌజ్‌మేట్స్‌ కూడా శేఖర్‌ భాషాతో పాటు భావోద్వేగానికి లోనయ్యారు. కాసేపు హౌజ్‌ అంతా ఎమోషనల్‌ అయ్యింది. అనంతరం అంతా శేఖర్‌ భాషాకు శుభకాంక్షలు తెలిపారు. 

సీతకు నాగ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌

ఆ తర్వాత సీతపై నాగ్‌ ప్రశంసలు కురిపించారు. సీత చాలా బాగా ఆడవంటూ కితాబ్‌ ఇచ్చారు. దీంతో ఇప్పటికైనా కిరాక్‌ సీత బిరుదు ఇస్తారా అని అడగ్గా.. నాగ్‌ నీ కిరాక్‌ పర్ఫామెన్స్‌కి నా తరపున చిన్న గిఫ్ట్‌ అంటూ తనకు ఇష్టమైన బొమ్మను కానుక పంపించారు. ఆ తర్వాత చీఫ్‌ నైనికకు తన  క్లాన్‌ సభ్యుల గురించి రివ్యూ అడిగారు. ఈ సందర్భంగా తన క్లాన్‌ సభ్యుడైన నబీల్‌కు సపోర్టు చేయడం లేదని నాగ్‌ ఆమెను ప్రశ్నించాడు. నబీల్‌ కంప్లైట్‌ కూడా ఇదేనని అతడి తరపున నైనికకు ప్రశ్నించాడు హోస్ట్‌. తన క్లాన్‌ సభ్యుడైన నబీల్‌కి కాకుండ పక్కవారికి సపోర్టు చేయడం ఏంటని కడిగిపారేశారు హోస్ట్‌. దీంతో నైనిక ఏం మాట్లాడుకుండా సైలెంట్‌గా ఉండిపోయింది.

సోనియాకు షాకిచ్చిన యష్మీ

సోనియాకు యష్మీ వరస్ట్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చింది. తను ఏ టాస్క్‌లోనూ యాక్టివ్‌గా లేదని, వందశాతం ఎఫర్ట్స్‌ పెట్టి ఆడింది తన ఇప్పటి వరకు చూడలేదంటూ సోనియాకు నెగిటివ్‌ రివ్యూ ఇచ్చి షాకిచ్చింది యష్మీ. ఆ తర్వాత నాగ్‌ విష్ణు ప్రియను ఫ్యామిలీ లేదంటూ చేసిన కామెంట్స్‌పై సోనియాను నిలదిశాడు. నామినేషన్‌లో మీకు ఫ్యామిలీ లేదమో.. మాకు ఫ్యామిలీ ఉంది.. చూస్తారంటూ చేసిన కామెంట్స్‌కి సంబంధించిన వీడియో చూపించారు. మాటలు అదుపులో లేకుండ మాట్లాడటం కరెక్టా అని నాగ్‌ సోనియాను కడిగిపారేశాడు. ఆ తర్వాత నైనిక, యష్మిలను చీఫ్‌లుగా తొలగించి, వారి క్లాన్‌ క్యాన్సిల్‌ చేస్తున్నట్టు తేల్చిశాడు నాగ్‌. ఇలా సెకండ్‌ వీకెండ్‌ ఎపిసోడ్‌ కంటెస్టెంట్స్‌ తప్పులను ఎత్తిచూపి వారందరి తనదైన స్టైల్లో కడిగిపారేశాడు హోస్ట్‌. చూస్తుంటే ఈ వీకెండ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా, రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది.

Also Read: హౌజ్‌లో వివాదాలకు కేరాఫ్‌గా సోనియా ఆకుల - ఆ మాజీ కంటెస్టెంట్స్‌తో పోలుస్తూ ట్రోల్‌ చేస్తున్న నెటిజన్స్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
BRS Chief KTR: బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
TGSRTC Special Buses: కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లుకేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కార్ బీభత్సంLSG Released KL Rahul Retention Players | కెప్టెన్ కేఎల్ రాహుల్ ను వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ | ABP DesamDC Release Rishabh Pant IPL 2025 Retention | పోరాట యోధుడిని వదిలేసుకున్న ఢిల్లీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
BRS Chief KTR: బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
TGSRTC Special Buses: కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
Singham Again Review - 'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
Liquor Price Hike: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
Bhool Bhulaiyaa 3 Review: భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
భూల్ భులయ్యా 3 రివ్యూ: హిందీ ‘చంద్రముఖి’ సిరీస్‌లో మూడో పార్ట్ - ఎలా ఉంది?
KTR Padayatra: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 
తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం 
Embed widget