Bigg Boss Telugu 7 Promo 1 Day 69 : నాగార్జున సమక్షంలో కెప్టెన్సీ పంచాయతీ.. రాజమాతలు డామినేటింగ్ చేశారా? లేదా?
Bigg Boss Telugu 7 Day 69 Promo : బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు ప్రోమో తాజాగా విదులైంది. వీకెండ్ స్పెషల్ నాగార్జున కంటెస్టెంట్లతో పలు ఆసక్తికర విషయాలు చర్చించారు.
Bigg Boss Telugu 7 Saturday Promo : బిగ్‌బాస్ సీజన్ 7 ప్రోమో తాజాగా విడుదలైంది. నాగార్జున వచ్చి కంటెస్టెంట్లకు ఏమి చెప్తారనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ఫ్యామిలీ వీక్‌లో ఎమోషనల్‌గా సాగిన ఈ వారం.. కెప్టెన్సీ టాస్క్‌తో ఫుల్ హీట్ అయింది. దీంతో నాగార్జున సమక్షంలో ఈ రోజు కెప్టెన్ ఎవరు అనేది తేలనుంది. ఈ రోజు విడుదలైన ప్రోమోలో అర్జున్ శోభా కెప్టెన్సీ ఎలా ఉందని నాగార్జున అడుగగా.. వీఐపీ రూమ్‌ని ఎంజాయ్ చేయడమే సరిపోయింది సార్ అంటూ నవ్వుతూ చెప్పాడు. తర్వాత రతికను ఉద్దేశిస్తూ.. ప్రియాంక జీవితంలో నిప్పులు పోస్తావా అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. అన్నయ్య ఇస్తే చెల్లిలా తీసుకున్నాను అని నవ్వుతూ చెప్పగా.. రతిక నువ్వు ఎప్పుడు ఎవరిని అన్నయ్య అంటావో మాకు తెలియట్లేదు అంటూ నాగార్జున ఫన్నీగా తెలిపాడు.
తర్వాత శోభా నువ్వు కాఫీ పెట్టి స్టోర్ రూమ్‌లో పెడితే.. నేను కాఫీ తాగుతా అంటూ తెలుపగా.. నిజమా సార్.. షూర్ నిజంగా చేసి పంపిస్తాను అని తెలిపింది. అమర్ నీకోసం ఎప్పుడైనా శోభా నీకు కాఫీ పెట్టిందా? అంటే సార్ కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు నాకు అని తెలిపాడు. అయితే ఓయ్.. తాగావుగా చెప్పు అంటూ శోభ తెలిపింది. అమర్‌ని ఉద్దేశిస్తూ.. కాఫీ, టీలు తాగవు.. మరి.. అంటూ స్పేస్ ఇస్తే హౌజ్‌మేట్స్ అంతా నవ్వారు. ఓన్లీ స్ప్రైట్ అండ్.. అంటూ మళ్లీ గ్యాప్ ఇచ్చారు. సార్ ఇప్పటివరకు అమరు 162 స్ప్రైట్లు తాగాడు అంటూ శివాజీ తెలిపాడు.
అనంతరం ప్రశాంత్‌ని కన్ఫెషన్ రూమ్‌లో ఉంచి నాగార్జున మాట్లాడారు. ఎప్పుడైనా అనుకున్నావా.. బాపుని ఇక్కడివరకు తీసుకొస్తావని నాగార్జున అడుగగా.. ప్రశాంత్ ఏమోషనల్ అయి లేదుసార్ అని తెలిపాడు. నేను చచ్చిపోయేలోపల బాపు మొహంలో ఒక్కసారైనా చిరునవ్వు చూడాలనుకున్నాను సార్. ఇంత దూరం మా బాపు వచ్చేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను సార్ అంటూ తెలిపాడు. ప్రశాంత్ ఆట నీది.. నువ్వు 10 వారాలు గేమ్ ఆడావు. నీవల్లే మీ నాన్న హౌజ్‌లోపలికి వచ్చాడని నాగార్జున తెలిపారు.
శోభాతో నాగార్జున పర్సనల్‌గా మాట్లాడారు. నీ తర్వాత ఎవరు కెప్టెన్‌కి అర్హులో నువ్వే చెప్పాలన్నారు. నిన్న కాంపిటేషన్ చాలా హోరాహోరీగా సాగింది సార్. అశ్విని కెప్టెన్‌కి సంబంధించి వాళ్ల బెస్ట్ ప్రయత్నించారని తెలుపగా.. ప్రియాంక శివాజీ సార్ కెప్టెన్ అయితే చూడాలని ఉంది సార్ అని తెలిపింది. యావర్‌ని కెప్టెన్ గురించి అడుగగా.. ఒక్కసారి తన కెప్టెన్సీ చూడాలని ఉంది.. ఇది పూర్తిగా నా పర్సనల్ అని తెలిపాడు. తర్వాత ప్రశాంత్ కూడా శివాజీని కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నా అన్నాడు. అనంతరం వచ్చిన అమర్ జనం మెచ్చిన వాడే నాయకుడు అవుతాడు. అది నాకు నచ్చింది సార్ అని తెలిపారు.
రాజమాతాలుగా జెన్యూన్‌గా చేశారా? అనే టాపిక్‌ను కూడా నాగార్జున తెరపైకి తెచ్చారు. శోభ, ప్రియాంక కాస్త డామినేటింగ్‌గా అనిపిస్తున్నారు సార్ అని తెలిపింది. ఈ విషయాన్ని శోభ ముందు ఉంచగా.. సార్ అలా ఏమి లేదు సార్.. ఆమెనే ఎక్కువగా ఆలోచిస్తుందని తెలిపింది. అంటే మీరు డామినేటింగ్ చేయట్లేదా అని నాగార్జున ఎదురు ప్రశ్నించారు. తను డిఫెండ్ చేయలేనప్పుడు అశ్విని ఏడ్చేస్తుంది సార్. తర్వాత అమర్‌ను పిలిచి.. రాజమాతాలు నిన్ను ఏకాభిప్రాయంతో సేవ్ చేశారు ఎందుకంటూ అడిగారు. శోభ, ప్రియాంక మిగిలినవారిని బాగా దబాయించినట్లు అనిపిస్తుంది సార్ అంటూ భోళే తెలిపాడు. మూడుసార్లు నామినేట్ చేసినా.. అమర్‌ను ఎందుకు నామినేషన్లోకి రానివ్వట్లేదని నాకు అనిపించిందని గౌతమ్ తెలిపాడు. దీంతో ప్రోమో ముగిసింది. ఈ ప్రోమోలో శివాజీ-గౌతమ్ గొడవ గురించి నాగార్జున ఎక్కడా ప్రస్తావించలేదు. తదుపరి ప్రోమో దీనిపై వచ్చే అవకాశముంది.
Also Read : శివాజీకే కెప్టెన్సీ - డేంజర్ జోన్‌లో రతిక, భోలే షావలి - యావర్ సేఫ్, కానీ..