Rathika Rose: శివాజీకే కెప్టెన్సీ - డేంజర్ జోన్‌లో రతిక, భోలే షావలి - యావర్ సేఫ్, కానీ..
Rathika Rose: బిగ్ బాస్ హౌస్‌లో మళ్లీ భూకంపం వచ్చింది. మరోసారి శివాజీ, గౌతమ్ పోట్లాడుకున్నారు. మరోవైపు అమర్ దీప్‌కు ప్రియాంక ఊహించని షాకిచ్చింది.
![Rathika Rose: శివాజీకే కెప్టెన్సీ - డేంజర్ జోన్‌లో రతిక, భోలే షావలి - యావర్ సేఫ్, కానీ.. Bigg Boss Telugu 7 Rathika Rose Bhole Shavali Yawar in Danger zone Gautham safe Amardeep angry on Priyanka jain Shivaji won Capataincy Rathika Rose: శివాజీకే కెప్టెన్సీ - డేంజర్ జోన్‌లో రతిక, భోలే షావలి - యావర్ సేఫ్, కానీ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/10/729d26321b6eaaa9118c1d621bbda72e1699639950707239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telugu Bigg Boss 7 : ‘బిగ్ బాస్’ సీజన్-7లో పదోవారం శివాజీ ( Shivaji ) కెప్టెన్ అయ్యాడు. అయితే, ఈ వారం రతిక మరోసారి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు యావర్‌కు కూడా ఓట్లు తగ్గినట్లు తెలుస్తోంది. గతం వారం తరహాలో ఈ సారి యావర్(Yawar)కు శివాజీ అభిమానుల ఓట్లు రావడం లేదు. కారణం శివాజీ కూడా నామినేషన్లలో ఉండటమే. అదే కారణంతో రతిక ( Rathika Rose ), భోలే( Bhole Shavali )లకు తగినన్ని ఓట్లు పడటం లేదని తెలిసింది. అయితే, వీరితోపాటు నామినేషన్లలో ఉన్న గౌతమ్‌కు ఓటింగ్ బాగుందని సమాచారం.
గౌతమ్, యావర్ సేఫ్? కానీ..
శివాజీకి వ్యతిరేకంగా ఉండటం వల్ల సీరియల్ బ్యాచ్ అభిమానులు మొత్తం గౌతమ్ (Gautham)కు ఓట్లు వేస్తున్నట్లు అనధికారి ఓటింగులో తేలింది. ముఖ్యంగా ప్రియాంక, అర్జున్, శోభాశెట్టి ఓట్లన్నీ గౌతమ్‌కే పడుతున్నాయి. యావర్ ఓటింగ్ కూడా బాగానే ఉన్నా.. ఈ వారం డల్‌గా ఉండటం వల్ల కొద్ది రోజులు ఓట్లు పడలేనట్లు తెలుస్తోంది. అయితే, యావర్ అన్న ఎంట్రీ ఇచ్చిన తర్వాత యావర్‌కు ఓటింగ్ మెరుగుపడింది. దీంతో రతిక, భోలే కంటే బెటర్ ఓటింగ్ యావర్‌కు ఉంది. ఫలితంగా భోలే, రతిక డేంజర్ జోన్‌లో పడ్డారు. ఆటల్లో భోలే యాక్టీవ్‌గా ఉంటున్నాడు. ఆయనకు చేతకాకపోయిన తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. కెప్టెన్ కంటెండర్ పోటీలో కూడా తనకు కాలు నొప్పి ఉన్నా సరే.. రెండు రౌండ్లు పరిగెట్టాడు. అయితే, రతిక మాత్రం తెలివిగా ఆడాలనుకుని గందరగోళానికి గురైంది. దీంతో అంతా కలిసి రతిక బొమ్మను వదిలేసి వేరేవాళ్ల బొమ్మలను పట్టుకున్నారు. చివర్లో రతిక తన బొమ్మను తానే తీసుకుని పరిగెట్టింది. కానీ, అప్పటికే ఆలస్యమైంది.
ప్రియాంకపై అమర్ ఫైర్
కెప్టెన్సీ టాస్క్‌లో అమర్‌దీప్ తెలివిగా ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తనను ప్రియాంక ఆదుకుంటాదని భావించాడు. కానీ, ఆమె శోభాను సేవ్ చేయడానికే ప్రయత్నించింది. కొద్ది రోజుల కిందట ప్రియాంక ప్రియుడు శివా ఇచ్చిన ఫీడ్ బ్యాక్, అమర్ భార్య తేజస్వి ఆమెను పట్టించుకోకవడం వంటి కారణాల ఫలితంగా కెప్టెన్సీ టాస్క్‌లో కనిపించింది. ప్రియాంక తన ఫ్రెండ్ అమర్ దీప్ ఫొటో ఉన్న బొమ్మను కాకుండా శోభా, శివాజీ బొమ్మలను సేవ్ చేసింది. చివరికి అమర్ దీప్ బొమ్మ రతికా చేతికి చిక్కగా, రతికా బొమ్మ అమర్ దీప్‌కు దొరికింది. దీంతో అమర్ దీప్.. రతికాకు ఛాన్స్ ఇచ్చి పోటీ నుంచి తప్పుకున్నాడు. ఈ టాస్క్‌లో చివరికి శివాజీ, అర్జున్ మిగిలారు. అయితే, ఈ గేమ్‌లో తనకు ప్రియాంక సాయం చేయలేదంటూ అలకపూనాడు అమర్. శోభా, పల్లవి ప్రశాంత్, రతికాకు తన బాధను చెప్పుకున్నాడు. స్నేహితులను సాయం అడగాలా? తానైతే అలా చేయనని, స్నేహం కోసం ఏమైనా చేస్తానని చెప్పాడు. పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈ సారి తనకు ఛాన్స్ వస్తే తప్పకుండా సాయం చేస్తానని అమర్‌తో అన్నాడు. శివాజీ తన లెటర్ త్యాగం చేశాడు కాబట్టి.. ఆయన కోసం ఆడానని తెలిపాడు. అమర్ కూడా.. ఈ సారి తనకు ఛాన్స్ వస్తే ప్రశాంత్‌ను కెప్టెన్ చేయడానికి సపోర్ట్ చేస్తానన్నాడు.
Also Read: నాగార్జున తిట్టని, నరికేయనీ - శివాజీతో గౌతమ్ బిగ్ ఫైట్, ‘బిగ్ బాస్’ ఎగ్జిట్ డోర్ కొడుతూ అరుపులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)