అన్వేషించండి

Bigg Boss Telugu 7 Promo: ఎవరివీ గొప్ప జాతకాలు కాదు - అమర్, యావర్‌కు చిచ్చు పెట్టిన రతిక, శివాజీ అడ్డురాకపోతే?

Bigg Boss 7 Nominations Promo: బిగ్ బాస్ సీజన్ 7లో నామినేషన్స్ మరోసారి రెండోరోజుకు చేరుకున్నాయి. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఉల్టా పుల్టా కావడంతో నామినేషన్స్ ఒకరోజు కాకుండా రెండురోజులు ప్రసారమవుతున్నాయి. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కూడా రసవత్తరంగా సాగుతుండడంతో రెండురోజులు జరిగే నామినేషన్స్‌ను ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా జరిగిన నామినేషన్స్ కూడా రెండోరోజు ప్రసారానికి సిద్ధమవుతున్నాయి. రెండోరోజు నామినేషన్స్‌కు సంబంధించిన ప్రోమోలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ప్రోమోలో అమర్‌దీప్, యావర్ మాత్రమే ఎక్కువగా వాగ్వాదం జరిగినట్టు అర్థమవుతోంది. కానీ వీరిద్దరి మధ్య గొడవ వెనుక అసలు కారణమేంటి అనేది హైలెట్‌గా నిలవనుంది. అమర్.. రతికాను నామినేట్ చేయాలనుకున్నప్పుడు యావర్ మధ్యలోకి వచ్చాడా లేదా యావర్‌ను నామినేట్ చేయాలనుకున్నప్పుడు రతిక మధ్యలో మాట్లాడిందా అనేది ప్రోమోలో సస్పెన్స్‌గా నిలిచింది.

యావర్, అమర్ మధ్య చిచ్చుపెట్టిన రతిక

బిగ్ బాస్ సీజన్ 7 అనేది 72వ రోజుకు చేరుకుంది. అయినా కంటెస్టెంట్స్ సిల్లీ కారణాలతో నామినేషన్స్ చేయడం ఆపలేదు. అంతే కాకుండా ముందెప్పుడో జరిగిపోయిన విషయాలను గుర్తుచేసుకుంటూ కూడా నామినేట్ చేసుకుంటున్నారు. తాజాగా విడుదలయిన ప్రోమోలో అమర్‌దీప్, యావర్ మధ్య కూడా అందుకే వాగ్వాదం మొదలయినట్టుగా అనిపిస్తోంది. ముందుగా అమర్‌దీప్.. రతికను నామినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ‘‘రతిక నీకొక విషయం చెప్పదలచుకున్నాను’’ అంటూ తన నామినేషన్స్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు అమర్. ‘‘బయటికి వెళ్లొచ్చినదానివి ఎవరి మీద ఇలాంటి పాయింట్స్ చెప్పకు’’ అని రతికకు సలహా ఇచ్చాడు. అమర్ తన పాయింట్ చెప్తుండగానే.. యావర్ మధ్యలోకి వచ్చాడు.

ఎవరివి గొప్ప జాతకాలు కాదు

‘‘తనకు అది పాత మాట అయ్యిండొచ్చు, నాకు మాత్రం ఇది కొత్త మాటే’’ అని యావర్ మధ్యలో మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ‘‘పూర్వాలు తవ్వుకుంటే ఒక్కొక్కరి జాతకాలు ఏమంత మహా గొప్ప జాతకాలు కాదు ఇక్కడ’’ అని అమర్ చెప్తుండగానే.. రతిక మధ్యలో మాట్లాడడం మొదలుపెట్టింది. ‘‘ఇప్పుడు నీ నామినేషన్ పాయింట్ అదేనా? రెండో, మూడో వారందా?’’ అని యావర్‌ను ప్రశ్నించింది. ‘‘స్ప్రైట్ కోసం నామినేట్ చేసిన యావర్’’ అని అమర్ చెప్తుండగానే.. యావర్ సీరియస్ అయ్యాడు. ‘‘నీ ప్రవర్తన కరెక్టా?’’ అని ప్రశ్నించాడు. దానికి అమర్.. ‘‘రతికతో చెప్పింది చూశావా’’ అని ఎదురుప్రశ్న వేశాడు.

శివాజీకి గౌతమ్ కౌంటర్

ఇలా అమర్‌దీప్‌కు, యావర్‌కు మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు కూడా. కానీ కెప్టెన్‌గా ఉన్న శివాజీ వీరిద్దరి గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. ‘‘అమర్ కావాలి, అమర్ పోవాలి’’ అంటూ తనను ఎలిమినేట్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అమర్ ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చాడు. ‘‘గొడవలో ఎంతోకొంత కారణంలాగా నువ్వు ఉన్నావు. నిజంగా వేయాలనుకుంటే నీకు వేసేసేవాడిని. కానీ నాకు తెలివి ఉంది’’ అన్నట్టుగా యవర్‌ను ఉద్దేశించి అన్నాడు అమర్. ఆ తర్వాత వచ్చిన శివాజీ.. గౌతమ్‌ను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. ‘‘బిగ్ బాస్ హౌజ్‌లో ఎమోషన్ అనేది లూస్ మోషన్ లాంటిది. మనం ఫ్లోను ఆపలేము’’ అని గౌతమ్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘అదే కంట్రోల్ చేసుకోవాలి’’ అని శివాజీ సలహా ఇచ్చాడు.

Also Read: నిన్న రతిక - నేడు అర్జున్.. నా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావా అంటూ నామినేట్ చేసిన అశ్విని

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Embed widget