అన్వేషించండి

Bigg Boss 7 Nominations Promo : నిన్న రతిక - నేడు అర్జున్.. నా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావా అంటూ నామినేట్ చేసిన అశ్విని

Bigg Boss 7 Promo : బిగ్​బాస్ సీజన్ 7 తెలుగులో నామినేషన్లు ఓ రేంజ్​లో జరుగుతున్నాయి. ఎవరి దగ్గర సీరియస్ పాయింట్లు లేకపోవడంతో సిల్లీ రీజన్స్​తో సీరియస్​గా నామినేషన్స్ వేసుకుంటున్నారు.

Bigg Boss Season 7 Day 72 Promo : బిగ్​బాస్​లో నామినేషన్ల పర్వం రెండో రోజు కొనసాగుతోంది. సోమవారం ఎపిసోడ్​లో శివాజీ ఇచ్చిన మోటీవేషన్​తో రతిక ఓ రేంజ్​లో నామినేషన్స్ వేసింది. ప్రియాంక - రతిక, అర్జున్ - ప్రశాంత్ నామినేషన్స్​ హోరాహోరీగా సాగాయి. అయితే కంటెస్టెంట్లు తక్కువ కావడం.. ఫ్యామిలీ వీక్​ వల్ల నామినేషన్స్​కి ఎవరికీ అంతగా రీజన్స్ కనిపిస్తున్నట్లు లేదు. సింపుల్, సిల్లీ రీజన్స్​తో ఒకరినొకరు నామినేట్ చేసుకుంటున్నారు. శివాజీ కెప్టెన్ కావడంతో నామినేషన్​ తప్పించుకున్నారు. కానీ.. కంటెస్టెంట్లు మాత్రం.. ఆయన పేరు ఉపయోగించి.. ఇతరులను నామినేట్ చేస్తున్నారు.

సిల్లీ రీజన్​తో నామినేషన్​

బిగ్​బాస్ సీజన్​ 7లో 72వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోను స్టార్​ మా విడుదల చేసింది. ముందుగా వచ్చిన అశ్వినీ.. నేను ఇప్పటివరకు ఎప్పుడూ సిల్లీగా నామినేట్ చేయలేదు. నాకు సీరియస్​గా అనిపించినవే చేశాను. అయితే మొదటిసారి మాత్రం సిల్లీగా నామినేషన్ చేస్తున్నాను అని మీకు అనిపించొచ్చేమో అంటూ ప్రక్రియ ప్రారంభించింది. దీంతో తననే నామినేట్ చేస్తుందని అర్థం చేసుకున్న అమర్ ఒక్క నిముషం.. పాట గురించే కదా.. ఆ పాటలో రెండు లైన్లు అర్జున్ ఇచ్చాడని తెలిపాడు. అంత పెద్ద దివాళీ ఈవెంట్​లో అని అశ్విని అనగానే.. అది చాలా సిల్లీ థింగ్ అంటూ అమర్ సమర్థించుకున్నాడు. నాగ్​సార్ పొగిడినప్పుడేమో అది నీ క్రెడిట్.. నామినేషన్​లో టైమ్​లో మాత్రం నాకు ఇస్తున్నావా అంటూ అర్జున్ బదులిచ్చాడు. దీంతో హౌజ్​మేట్స్​ అంతా నవ్వుకున్నారు. నా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావా అంటూ.. అశ్విని అమర్​ని నామినేట్ చేసింది.

నిన్న రతిక.. నేడు అర్జున్

పల్లవి ప్రశాంత్ అర్జున్​ని నామినేట్ చేస్తూ.. నన్ను ఇన్​ఫ్లూయెన్స్ చేసినంత మాత్రానా.. నేను అవ్వను. నేను ఎంత కష్టపడి ఇక్కడి వచ్చానో అనగానే.. నిన్ను ఇన్​ఫ్లూయెన్స్ చేశారని ఇక్కడెవడు అనలేదు అని అర్జున్ వాదించగా.. నువ్వు అన్నావ్ అంటూ ప్రశాంత్ బదులిచ్చాడు. నేను అననిది అన్నానని నువ్వంటున్నావ్ అంటూ అర్జున్ రెచ్చిపోయాడు. తర్వాత కట్​లో అశ్విని శోభాను.. నువ్వు లేని టాపిక్​లో మధ్యలో ఎందుకు దూరుతున్నావ్ అంటూ ప్రశ్నించింది. యావర్​, అమర్ లొల్లి ఈ వారం కూడా కొనసాగుతుంది. ఈ వారం కూడా యావర్ అమర్​ని నామినేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. రెండో వారం గురించి.. మూడో వారం గురించి మాట్లాడి ఎవరైనా నిన్ను నామినేట్ చేస్తే ఊరుకుంటావా? అనగా.. యూ ఆర్ ట్రిగరింగ్​ మీ అంటూ యావర్ బదులిచ్చాడు. 

వెళ్లి గూగుల్​ని అడుగు

లాస్ట్​ వీక్​ నీ మీద నాకు పాయింట్ ఉంది.. అప్పుడు నేను రాజమాతగా ఉండడం వల్ల నిన్ను నామినేట్ చేయలేకపోయాను అంటూ శోభా యావర్​ని నామినేట్ చేసింది. ఆ దొరికింది నాకు ఏ పాయింట్​ అని.. అంతేకదా నువ్వు చెప్పావ్ అది అంటూ యావర్​ తెలిపాడు. నేను చెప్పింది తప్పని చెప్పడానికి నువ్వు ఎవడ్రా అని అర్జున్ ప్రశాంత్​ని అడుగగా.. వెళ్లి గూగుల్​ని అడుగు అని ప్రశాంత్ బదులిచ్చాడు. పల్లవి ప్రశాంత్ నన్ను నామినేట్ చేశాడు నిన్నే అడుగుతా.. వేరే వాళ్లని ఎందుకు అడుగుతాను అంటూ అర్జున్ ఫైర్ అయ్యాడు. ప్రశాంత్ - అర్జున్​, అశ్విని - ప్రియాంక, యావర్ - అమర్​, శోభా - యావర్ తలపై బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేశారు. ప్రోమో అయిపోతుంది అనగా.. అమర్​ యావర్​ నామినేట్ చేస్తున్న ప్లేస్​కి వచ్చి.. మరిచిపోయా మరిచిపోయా ఒక్క నిమిషం అంటూ.. సారీ సారీ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. హేవ్​ ఏ బ్లాస్ట్ అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోవడంతో ప్రోమో ముగిసింది. 

Also Read : మోటీవేట్ చేసిన శివాజీ, రెచ్చిపోయిన రతిక.. శోభా కెప్టెన్సీపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Botsa Political Legacy: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. తండ్రి బాటలో బొత్స అనూష…
రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. తండ్రి బాటలో బొత్స అనూష…
Jana Sena MLA Arava Sridhar controversy: జనసేన ఎమ్మెల్యేపై మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు - చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్
జనసేన ఎమ్మెల్యేపై మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు - చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్
Arijit Singh retirement: షాకిచ్చిన బాలీవుడ్ టాప్ సింగర్ అరిజిత్ సింగ్ - సినిమా పాటలకు రిటైర్మెంట్ ప్రకటన
షాకిచ్చిన బాలీవుడ్ టాప్ సింగర్ అరిజిత్ సింగ్ - సినిమా పాటలకు రిటైర్మెంట్ ప్రకటన
AA22 Movie Update : దీపికా నా లక్కీ ఛార్మ్ - అల్లు అర్జున్ మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దీపికా నా లక్కీ ఛార్మ్ - అల్లు అర్జున్ మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వీడియోలు

YCP Leaks Janasena MLA Videos | జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణలు | ABP Desam
Sunil Gavaskar About T20 World Cup | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు
Washington Sunder Fitness Update | వాషింగ్టన్ సుందర్ ఫిట్ నెస్ అప్డేట్
Tilak Varma in T20 World Cup | వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు అందుబాటులో తిలక్ వర్మ ?
Nat Sciver Brunt Century WPL 2026 | మహిళా ఐపీఎల్‌‌లో నాట్ సీవర్ తొలి సెంచరీ!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Botsa Political Legacy: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. తండ్రి బాటలో బొత్స అనూష…
రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. తండ్రి బాటలో బొత్స అనూష…
Jana Sena MLA Arava Sridhar controversy: జనసేన ఎమ్మెల్యేపై మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు - చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్
జనసేన ఎమ్మెల్యేపై మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు - చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్
Arijit Singh retirement: షాకిచ్చిన బాలీవుడ్ టాప్ సింగర్ అరిజిత్ సింగ్ - సినిమా పాటలకు రిటైర్మెంట్ ప్రకటన
షాకిచ్చిన బాలీవుడ్ టాప్ సింగర్ అరిజిత్ సింగ్ - సినిమా పాటలకు రిటైర్మెంట్ ప్రకటన
AA22 Movie Update : దీపికా నా లక్కీ ఛార్మ్ - అల్లు అర్జున్ మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దీపికా నా లక్కీ ఛార్మ్ - అల్లు అర్జున్ మూవీపై అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
WhatsApp is not Secure: వాట్సాప్ సురక్షితం కాదా? పైరసీపై బాంబాలు పేల్చిన ఎలాన్‌ మస్క్, పావెల్ దురోవ్!
వాట్సాప్ సురక్షితం కాదా? పైరసీపై బాంబాలు పేల్చిన ఎలాన్‌ మస్క్, పావెల్ దురోవ్!
Liver Problems : రాత్రుళ్లు ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. మీ కాలేయం చెడిపోయిందని తెలిపే సంకేతాలివే
రాత్రుళ్లు ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. మీ లివర్ చెడిపోయిందని తెలిపే సంకేతాలివే
Supreme Court on Acid Attack:
"నిందితుల ఆస్తులు వేలం వేసి బాధితులకు పరిహారంగా ఇవ్వండి" యాసిడ్ దాడులపై సుప్రీంకోర్టు సంచలన సూచన!
Bha Bha Ba OTT : తెలుగులోనూ మలయాళ యాక్షన్ కామెడీ 'భా భా బా' - కీ రోల్‌లో మోహన్ లాల్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తెలుగులోనూ మలయాళ యాక్షన్ కామెడీ 'భా భా బా' - కీ రోల్‌లో మోహన్ లాల్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget