Bigg Boss Telugu 7: అర్జున్ ఆలోచన వంకర - శివాజీ స్టేట్‌మెంట్, టికెట్ టు ఫైనల్ రేసులో ఆ ఇద్దరూ, SPY బ్యాచ్ ఔట్?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో టికెట్ టు ఫైనల్ కోసం పోటీ మొదలయ్యింది. టాస్క్ మొదలయిన తర్వాత ఒక్కొక్కరుగా అందరూ ఎలిమినేట్ అయిపోగా చివరికి ఆ ఇద్దరు మిగిలారు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్స్ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న 8 మంది కంటెస్టెంట్స్ నుంచి ఒక కంటెస్టెంట్.. నేరుగా ఫైనల్స్‌కు వెళ్లే ఛాన్స్‌ను దక్కించుకోనున్నారు. ముందుగా దానికోసం అందరూ కలిసి ‘టికెట్ టు ఫైనల్’ టాస్క్‌ను ఆడనున్నారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. అంతే కాకుండా నిన్న జరిగిన నామినేషన్స్ గురించి కూడా ఇంకా కంటెస్టెంట్స్ మరిచిపోలేదు. అందుకే కాసేపు దాని గురించి కూడా డిస్కషన్ పెట్టారు. ఇక ఈ ప్రోమో చివర్లో.. ‘టికెట్ టు ఫైనల్’ రేసులో ఇద్దరు కంటెస్టెంట్స్.. చివరి వరకు ఉన్నట్టుగా చూపించారు.
వంకర ఆలోచన..
అర్జున్.. శివాజీని నామినేట్ చేయడంతో శివాజీ ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నాడు. తను నామినేట్ చేశాడనే బాధతో తిరిగి తననే నామినేట్ చేస్తున్నానని ప్రకటించిన శివాజీ.. ఇంకా ఆ మ్యాటర్‌ను వదిలేయలేదు. ప్రశాంత్‌తో కలిసి దీని గురించి డిస్కషన్ పెట్టాడు. ‘‘అర్జున్ తెలివితేటలు ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇంత వంకరగా ఆలోచిస్తాడని అనుకోలేదు’’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు శివాజీ. ఇప్పటికే పలువురు హౌజ్‌మేట్స్ వెనుక తీవ్ర వ్యాఖ్యలు చేసిన శివాజీ.. అర్జున్‌ను కూడా ఆ లిస్ట్‌లో చేర్చాడు. ఇక పల్లవి ప్రశాంత్ కూడా నామినేషన్స్ సమయంలో అమర్‌ను నమ్మకద్రోహం అని ఆరోపించాడు. అదే విషయాన్ని అమర్ గుర్తుచేసుకుంటూ.. ‘‘నమ్మకద్రోహం అనే పదాన్ని ఎందుకు వదిలేశాడు అంటే జనాలకు చూపించడానికి’’ అని అన్నాడు. మొత్తానికి శివాజీ కామెంట్స్ అర్జున్ ఓట్లపై ప్రభావం చూపనున్నట్లు అర్థమవుతోంది.
ఫైనల్ అస్త్రా కోసం పోటీ..
ఆ తర్వాత హౌజ్‌మేట్స్ అందరికీ ‘ఫైనల్ అస్త్రా’ టాస్క్‌ను వివరించారు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో గడియారం ఆకారం ఏర్పాటు చేసి ఉంది. దాని చుట్టూ చిన్న బాక్సులు పేర్చి ఉన్నాయి. హౌజ్‌మేట్స్ అంతా ఆ బాక్సులపై నిలబడి.. గడియారం ముల్లు తమవైపు వచ్చిన ప్రతీసారి.. కింద పడకుండా, ముల్లు తమను తాకకుండా దాటాల్సి ఉంటుంది. ఈ టాస్కులో వీలైనంత ఎక్కువ సమయం ఆటలో ఉండడమే తమ లక్ష్యంగా పెట్టుకోవాలని బిగ్ బాస్ తెలిపారు. అలా టాస్క్ మొదలయ్యింది. ముందుగా పల్లవి ప్రశాంత్.. ముల్లును దాటే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి పక్కనే ఉన్న అర్జున్ బాక్స్‌పై కాలుపెట్టాడు. దీంతో ఈ గేమ్ నుంచి ప్రశాంత్ ఔట్ అని బిగ్ బాస్ ప్రకటించారు.
చివరిగా ఆ ఇద్దరు..
ప్రశాంత్ తర్వాత గౌతమ్, శోభా కూడా ముల్లు తగిలి బాక్స్‌పై నుంచి కింద పడిపోయారు. దీంతో వారిద్దరూ ఒకేసారి ఔట్ అయ్యారు. ఇకపై నుంచి ఈ టాస్కులో శోభా, ప్రశాంత్.. సంచాలకులుగా వ్యవహరిస్తారని బిగ్ బాస్ తెలిపారు. వారు సంచాలకులు అయిన తర్వాత ముందుగా శివాజీకి ముల్లు తగిలిందని తనను ఔట్ చేశారు. ఆ తర్వాత యావర్, అమర్‌దీప్ కూడా ముల్లు కాలికి తగలడంతో ఔట్ అయ్యారు. చివరిగా అర్జున్, ప్రియాంక మాత్రమే ఫైనల్ అస్త్రా టాస్కులో చివరి దశకు చేరుకున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బ్యాలెన్స్ కోల్పోయి పడిపోవడంతో కంటెస్టెంట్స్ అంతా వారిని లేపడానికి పరిగెత్తినట్టుగా ప్రోమోలో చూపించారు. కానీ ఆ కంటెస్టెంట్ ఎవరు అని ఇందులో రివీల్ చేయలేదు. అయితే ఎవిక్షన్ ఫ్రీ టాస్క్‌లాగానే టికెట్ టు ఫైనల్ కూడా ముందుగా ఒక హౌజ్‌మేట్‌కు ఇచ్చి దానిని డిఫెండ్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పే అవకాశాలు ఉన్నాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Also Read: ఉడుంపట్టు పట్టిన ప్రగతి, పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం కొట్టేసింది!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply