Actress Pragathi: ఉడుంపట్టు పట్టిన ప్రగతి, పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం కొట్టేసింది!
Actress Pragathi: సినీ నటి ప్రగతి నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో సత్తా చాటింది. మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
![Actress Pragathi: ఉడుంపట్టు పట్టిన ప్రగతి, పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం కొట్టేసింది! tollywood actress pragathi won bronze medal in national bench press power lifting championship Actress Pragathi: ఉడుంపట్టు పట్టిన ప్రగతి, పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం కొట్టేసింది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/90639cbdeed9a0c6803cb7fd1c7c7f7c1701148036233544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Actress Pragathi: సినీనటి ప్రగతి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో డీసెంట్ క్యారెక్టర్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఆమె సోషల్ మీడియాలో భలే యాక్టీవ్‌గా ఉంటారు. నిత్యం జిమ్ చేస్తూ.. ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. చెమటలు కక్కేలా వర్కౌట్స్ చేస్తుంది. తాజాగా తన కష్టం వెనుకున్న అసలు కథ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఏకంగా నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి సత్తా చాటింది. అందరూ ఔరా అనేలా చేసింది.
ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో ప్రగతి పోటీ
రీసెంట్ గా బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ జరిగింది. ఈ పోటీల్లో సినీ నటి ప్రగతి పాల్గొన్నది. పలువురు యోధులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నా, ప్రగతి మంచి ప్రతిభ కనబర్చింది. ఏకంగా మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాంస్య పతకం సాధించి తన ఫిట్ నెస్ రేంజి ఏంటో అందరికీ చాటి చెప్పింది. బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా ఈ పోటీలు జరిగాయి. ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో పోటీ పడి ప్రగతి ఈ పతకం సాధించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
View this post on Instagram
సినిమాలు, సీరియల్స్ తో ఫుల్ బిజీ
ప్రగతి నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సీరియల్ త్వరలోనే ప్రసారానికి రెడీ అవుతోంది. నిజానికి ప్రగతి రీల్ క్యారెక్టర్స్ కు పూర్తి విరుద్ధంగా రియల్ లైఫ్ ఉంటుంది. సినిమాలో చాలా కూల్ గా, సంప్రదాయ బద్దంగా కనిపించినా, బయట మాత్రం ఈమె డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ప్రవర్తిస్తుంది. జిమ్ నుంచి మొదలు కొని ఇంట్లో చేసే డ్యాన్స్ వరకు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది.
తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ
తమిళ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై అడుగు పెట్టిన ప్రగతి, సుమారు 10 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు కొంతకాలం దూరంగా ఉంది. ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగు పెట్టింది. పలు సీరియల్స్ లో నటించి మెప్పించారు. ‘బాబీ’ మూవీతో మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రగతి తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చింది. అంతకు ముందెన్నడూ చూడని వీడియోలను ప్రగతి అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియాలో ఓ రేంజిలో హల్ చల్ చేసింది. ప్రగతి జిమ్ చేసే వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ, నెటిజన్లను ఆకట్టుకుంది. ఐదు పదుల వయసుకు దగ్గర అవుతున్నా, ఆమె చేసే వర్కౌట్స్ చూసి జనాలు వారెవ్వా అన్నారు. సినిమాల్లో చీరలో కనిపించి ఆకట్టుకునే ప్రగతి, బయట మాత్రం లేటెస్ట్ డ్రెస్సుల్లో కనిపించి ఫిదా చేసింది. ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెరపైనా కనిపించి సందడి చేస్తోంది.
Read Also: ఆ డ్యాన్స్ చూసి నా డ్యాన్స్ మానేశా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మనోజ్ బాజ్‌పాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)