అన్వేషించండి

Bigg Boss Season 7 Updates: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో నామినేషన్స్‌లో ఉన్నది వీరే - డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్

మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 7లోని రెండోవారంలో అయిదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు.

‘బిగ్ బాస్’ సీజన్ 7లో రెండో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఇప్పటికే ఈ నామినేషన్స్‌కు సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. గత వారంతో పోలిస్తే ఈవారం నామినేషన్స్ మరీ వాడి వేడిగా జరిగాయి. ముందుగా ఒక కంటెస్టెంట్‌ను టబ్‌లోకి పిలిచి, వారిని నామినేట్ చేయాలనుకున్న ఇతర కంటెస్టెంట్స్‌ను పిలిచి వారిపై బురద నీళ్లు పడేలా చేయాలి. అంతే కాకుండా ఇమ్యూనిటీ సంపాదించినందుకు ఒక కంటెస్టెంట్‌ను నేరుగా నామినేట్ చేసే పవర్ కూడా ఆట సందీప్‌కు అందింది. మొత్తంగా ‘బిగ్ బాస్’ సీజన్ 7లోని రెండోవారంలో అయిదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు.

వాగ్వాదాలతో నిండిపోయిన నామినేషన్స్..
శోభా, రతిక, తేజ, షకీలా, ప్రిన్స్ యావర్, శివాజీ.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిలో ప్రిన్స్ యావర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం యావర్ కొద్దిలో తప్పించుకున్నాడు. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ఇప్పటివరకు విడుదలయిన ప్రోమోలను బట్టి చూస్తే.. ఈసారి నామినేషన్స్‌లో డామినేషన్ అంతా అమర్‌దీప్‌దే అనిపిస్తోంది. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేస్తున్న సమయంలో అమర్‌దీప్ చెప్పిన పాయింట్స్‌కు కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ఆడియన్స్ కూడా సపోర్ట్ చేశారు. రైతు బిడ్డ అని ఊరికే చెప్పడం కరెక్ట్ కాదని అమర్‌దీప్ మాత్రమే కాదు.. గౌతమ్ కృష్ణ కూడా ప్రశాంత్‌తో వాదించారు. వారు చెప్పిన ఒక పాయింట్‌కు కూడా పల్లవి ప్రశాంత్ ఒప్పుకోలేదు. అంతమంది కలిసి నామినేట్ చేసినా కూడా పల్లవి ప్రశాంత్.. నామినేషన్‌లో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

రతిక వర్సెస్ టేస్టీ తేజ..
టేస్టీ తేజను నామినేషన్స్‌లో టార్గెట్ చేసింది రతిక. ‘ఏం పీకుతున్నావు’ అన్న మాట తనకు నచ్చలేదంటూ రతిక.. తేజను నామినేట్ చేసింది. అంతే కాకుండా హౌజ్‌లో ఊరికే పడుకుంటున్నాడు అనే కారణంతో కూడా తేజను నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. రతిక చెప్పిన ఈ పాయింట్.. చాలామంది కంటెస్టెంట్స్‌కు నచ్చలేదు. దీంతో ఇతర కంటెస్టెంట్స్.. రతికకు నచ్చజెప్తూ.. తేజను సపోర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత రతిక ప్రవర్తన నచ్చక పలువురు కంటెస్టెంట్స్.. తనను కూడా నామినేట్ చేశారు. టేస్టీ తేజ.. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు అని ప్రశంసించిన కంటెస్టెంట్సే తనను నామినేట్ చేయడానికి ముందుకు వచ్చారు. అలా మొదటిసారి నామినేషన్స్‌లో నిలబడ్డాడు తేజ.

శివాజీ ప్రవర్తన నచ్చక..
శివాజీ.. కంటెస్టెంట్స్ అందరిలో తనే డామినేటింగ్ అన్నట్టుగా ప్రవర్తించడం చాలామందికి నచ్చలేదు. ఇదే కారణంతో తనను నామినేట్ చేయడానికి పలువురు కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారు. ముఖ్యంగా ప్రియాంక అయితే శివాజీని నామినేట్ చేస్తూ చాలా మాట్లాడింది. వేరేవాళ్లు మాట్లాడుతున్న మాటలు వినకుండా దబాయిస్తారు అంటూ కామెంట్స్ చేసింది. తన మాటలు కూడా శివాజీ వినకుండా పో అంటూ మర్యాద లేకుండా మట్లాడాడు. ప్రియాంక కూడా ఆ మాటలను భరించకుండా రివర్స్ మాట్లాడింది. మరికొందరు కంటెస్టెంట్స్ కూడా శివాజీ ప్రవర్తన కరెక్ట్ కాదంటూ నామినేట్ చేశారు. శోభా శెట్టి యాటిట్యూడ్ నచ్చక కొందరు కంటెస్టెంట్స్ తనను కూడా నామినేట్ చేశారు. ఇక సందీప్‌కు ‘బిగ్ బాస్’ ఇచ్చిన పవర్‌తో ప్రిన్స్ యావర్‌ను నేరుగా నామినేట్ చేశాడు. నేరుగా నామినేట్ అయినా కూడా యావర్.. తన ప్రవర్తనను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశాడు.

Also Read: ఆ డైరెక్టర్ అర్థరాత్రి ఫోన్ చేసి, నా పేరు రాసి సూసైడ్ చేసుకుంటున్నా అన్నాడు: విశాల్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget