అన్వేషించండి

Vishal: ఆ డైరెక్టర్ అర్థరాత్రి ఫోన్ చేసి, నా పేరు రాసి సూసైడ్ చేసుకుంటున్నా అన్నాడు: విశాల్

దర్శకుడు అధిక్ రవిచంద్రన్ గురించి ఆసక్తికర విషయం బయటపెట్టాడు విశాల్. 9 సంవత్సరాల ముందు ఒక కథ రాసుకొని నిర్మాతల కోసం వెతికితే.. దాదాపు 40 మంది నిర్మాతలు గెంటేశారని అధిక్ గురించి చెప్పుకొచ్చాడు.

మిళ నటులు అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన నటులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు విశాల్. పేరుకే తమిళ హీరో.. కానీ విశాల్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా ఇష్టం. స్క్రీన్‌పై తన నటన మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ తన మంచితనాన్ని అభిమానించే వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి విశాల్.. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. ఈ మూవీ ఒక టైమ్ ట్రావెల్ కథతో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలయిన ‘మార్క్ ఆంటోనీ’ టీజర్, ఫస్ట్ లుక్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి మరికొన్ని విశేషాలు పంచుకున్నాడు విశాల్.

ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు..
విశాల్ హీరోగా మారి 19 ఏళ్లు అయ్యిందని ముందుగా ‘మార్క్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గుర్తుచేసుకున్నారు. 19 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 10న తన మొదటి చిత్రం ‘చెల్లం’.. తెలుగులో ‘ప్రేమ చదరంగం’ చిత్రం విడుదలయిందని తెలిపాడు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రేక్షకులు తనను ఆదరించినందుకు ధన్యవాదాలు చెప్పాడు. అందరూ తన గురించి చెప్తుంటే తృప్తిగా ఉందని అన్నాడు. కెప్టెన్ విజయ్‌కాంత్ అని ఒక వ్యక్తి ఉన్నారని, ఆయన ఆఫీసుకు వచ్చిన ఎవరినైనా ఆకలితో పంపించరని చెప్పిన విశాల్.. తమ ఆఫీసులో కూడా అలాగే చేస్తున్నామని చెప్పాడు. తన సినిమా టికెట్ కోసం పెట్టే డబ్బులు.. ఏదో ఒక విధంగా సమాజానికే ఉపయోగపడాలని అనుకుంటానని తెలిపాడు. ‘మార్క్ ఆంటోనీ’ అనేది తన కెరీర్‌లోని కాస్ట్‌లీ చిత్రమని బయపెట్టాడు.

అభినయ ఒక ఇన్‌స్పిరేషన్..
‘మార్క్ ఆంటోనీ’ సినిమాకు కారణమయిన వ్యక్తి వినోద్ అని తన నిర్మాతకు ధన్యవాదాలు తెలిపాడు. ఒక పాటకు రూ.1 కోటి ఖర్చు అవుతుందని చెప్తే వద్దు అని అనకుండా అసవరమైతే ఎక్కువ ఖర్చు చేయడానికి కూడా నిర్మాత ఆలోచించేవాడు కాదని బయటపెట్టాడు. ‘మార్క్ ఆంటోనీ’ చిత్రంలో మార్క్ పాత్రకు జోడీగా రీతూ వర్మ నటించిందని, ఆంటనీ పాత్రకు భార్యగా అభినయ నటించిందని కథ గురించి చెప్పాడు. అభినయ గురించి మాట్లాడుతూ.. తను చాలామందికి స్ఫూర్తినిస్తుందని అన్నాడు. మాటలు రాకపోవడం, వినికిడి లోపం ఉండడం కాదు.. నటించడం వచ్చు అంటే చాలు.. ఇండస్ట్రీకి రావచ్చు అని చెప్పాడు.

సూసైడ్ చేసుకుంటానన్నాడు..
దర్శకుడు అధిక్ రవిచంద్రన్ గురించి ఆసక్తికర విషయం బయటపెట్టాడు విశాల్. 9 సంవత్సరాల ముందు ఒక కథ రాసుకొని నిర్మాతల కోసం వెతికితే.. దాదాపు 40 మంది నిర్మాతలు గెంటేశారని అధిక్ గురించి చెప్పుకొచ్చాడు. ‘త్రిష లేదా నయనతార’ అనే సినిమాను తెరకెక్కించినందుకు యూత్ చప్పట్లు కొట్టినా కూడా అసలు నేనేనా సినిమా తీసింది అని తనకు తానే ఆశ్చర్యపోయాడని అన్నాడు. ‘‘ఒకరోజు అర్థరాత్రి రెండు గంటలకు ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకుంటున్నా, లెటర్‌లో మీ పేరే రాస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ఫోన్ చేసి ఏమైంది అని అడిగితే మీరు డేట్స్ ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగింది అన్నాడు. అయితే దేవుడు సహకరిస్తే కలిసి సినిమా చేస్తామేమో అన్నాను. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ‘మార్క్ ఆంటోనీ’ చేస్తున్నాం’ అని అధిక్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి బయటపెట్టాడు. ఎస్‌జే సూర్య.. ‘మార్క్ ఆంటోనీ’లో తన పాత్ర కోసం 22 గంటలు డబ్బింగ్ చెప్పాడని అభినందించాడు. విశాల్, ఎస్‌జే సూర్య లీడ్ రోల్స్ చేస్తున్న ‘మార్క్ ఆంటోనీ’.. సెప్టెంబర్ 15న అన్ని సౌత్ భాషల్లో విడుదల అవుతుండగా.. హిందీ వర్షన్ మాత్రం సెప్టెంబర్ 22న విడుదల అవుతుంది.

Also Read: పంచ్ ప్రసాద్‌‌కు సర్జరీ - డాడీ వెంటనే తిరిగి వచ్చేస్తారు, గుండె బరువెక్కిస్తోన్న కొడుకు మాటలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
Embed widget