Bigg Boss Season 7: శుభశ్రీపై టిష్యూ విసిరేసిన అమర్‌దీప్ - ఆమె స్థానంలో ప్రియాంక ఉంటే?
కోపంలో బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ చేసే కొన్ని పనులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా అమర్‌దీప్ కూడా కిచెన్‌లో తన చేతిలో ఉన్న గరిటెను విసిరేశాడు.
మామూలుగా బిగ్ బాస్‌లో నామినేషన్స్ జరిగిన తర్వాత దాని ఇంపాక్ట్ అనేది చాలాసేపటి వరకు ఉంటుంది. నామినేషన్స్‌లో ఒకరిపై ఒకరు చెప్పిన కారణాలను గుర్తుపెట్టుకొని మనస్పర్థలు పెంచుకుంటారు కంటెస్టెంట్స్. దాని వల్లే మనస్పర్థలు పెరిగి.. పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తాయి. తాజాగా అమర్‌దీప్, శుభశ్రీ విషయంలో కూడా అదే జరిగింది. ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం మాత్రమే కాదు.. కోపంతో అమర్‌దీప్ శుభశ్రీపై టిష్యూ కూడా విసిరేశాడు. మామూలుగా నామినేషన్స్ సమయంలో అమర్‌దీప్ కోపం పీక్స్‌లో ఉంటుంది. తాజాగా మరోసారి అదే జరిగింది. నామినేషన్స్ తర్వాత అమర్‌దీప్ రియాక్షన్‌పై స్పెషల్‌గా ఒక ప్రోమో కూడా విడుదలయ్యింది.
మూడో పవర్ అస్త్రాకు నేరుగా కంటెండర్‌గా అమర్‌దీప్‌ను ఎంపిక చేశాడు బిగ్ బాస్. కానీ అమర్‌దీప్‌ను ఎవరు అనర్హుడు అని అడిగి.. అనర్హుడు అని చెప్పిన వారితో అమర్‌దీప్ పోటీపడాల్సి ఉంటుంది. అయితే హౌజ్ మొత్తంలో ప్రియాంక మాత్రమే అమర్‌దీప్ అనర్హుడు అని చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య బిగ్ బాస్ ఒక పోటీ పెట్టారు. ఇద్దరిలో ఎవరైతే.. వారి జుట్టును కట్ చేసుకోవడానికి ముందుకు వస్తారో.. వారికే పవర్ అస్త్రా కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ చెప్తాడు. ప్రియాంక జుట్టు కట్ చేసుకోవడానికి ముందుకు వస్తుంది. కానీ అమర్‌దీప్ మాత్రం స్వచ్ఛందంగా టాస్క్ నుండి తప్పుకున్నాడు. దీంతో పవర్ అస్త్రాలాంటి పెద్ద టాస్క్ విషయంలో అమర్‌దీప్ ఆడకపోవడం కరెక్ట్ కాదనే కారణంతో శుభశ్రీ.. తనను నామినేట్ చేసింది. తనను ఇలాంటి కారణంతో నామినేట్ చేసిందని శుభశ్రీని అమర్‌దీప్ కూడా నామినేట్ చేశాడు.
నామినేట్ చేసుకోండి..
తాజాగా విడుదలయిన ప్రోమోలో నామినేషన్స్ విషయంలో జరిగిన గొడవను కిచెన్ వరకు తీసుకొచ్చారు అమర్‌దీప్, శుభశ్రీ. ఇద్దరూ వంట చేస్తున్న సమయంలో ‘‘మీకొక కారణం దొరికింది కదా వేసుకోండి’’ అంటూ నామినేషన్ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు అమర్‌దీప్. దానికి శుభశ్రీ ఇచ్చిన సమాధానం అమర్‌కు నచ్చక.. ‘‘నేను ఆడలేదని మళ్లీ మళ్లీ అనొద్దు. ఈసారి నేను ఆడలేకపోతే నేను వెళ్లిపోతా. నువ్వే కూర్చొని హ్యాపీగా ఆడుకో’’ అని అన్నాడు. ‘‘సారీ మీరు హర్ట్ అయిపోయారు కదా’’ అంటూ వెటకారంగా సమాధానమిచ్చింది శుభ. దానికి కోపమొచ్చిన అమర్.. చేతిలో ఉన్న టిష్యూను శుభశ్రీ మీదకు విసిరేసి అక్కడ నుండి తినకుండా వెళ్లిపోయాడు. దీంతో యావర్, శోభా, రతిక.. తనకు నచ్చజెప్పారు. వదిలేయ్ అని యావర్ శుభశ్రీకి చెప్పగా.. నేను ఎందుకు వదిలేయాలి, నాకెందుకు చెప్తున్నారు అంటూ శుభ సీరియస్ అయ్యింది. అయితే, ఈ ప్రోమో చూసిన నెటిజనులు.. నోరులేనివారు, అమాయకులపైనే అమర్ దీప్ ప్రతాపం చూపిస్తున్నాడని అంటున్నారు. శుభశ్రీ స్థానంలో ప్రియాంక జైన్ ఉంటే అలా చేసేవాడా అని కామెంట్లు చేస్తున్నారు.
శివాజీదే తప్పు..
ఆ తర్వాత ప్రిన్స్ యావర్‌కు, తనకు మధ్య జరిగిన నామినేషన్ ప్రక్రియలో శివాజీ రియాక్షన్ గురించి పల్లవి ప్రశాంత్‌తో డిస్కషన్ పెట్టాడు గౌతమ్. ‘‘వెకిలిగా చేయడం చాలా తప్పు కదా. వాడు అలా చేస్తుంటే శివన్న నవ్వుతున్నాడు. అందుకే అక్కడ నన్ను వాడుకున్నారు అని నాకు వచ్చిన పదం కూడా కేవలం శివన్నను ఉద్దేశించి అన్నదే.’’ అంటూ తన బాధను బయటపెట్టాడు గౌతమ్. అసలు నామినేషన్స్ ప్రక్రియ సమయంలో జడ్జిగా శివాజీ వ్యవహరించిన పద్ధతి గురించి సందీప్, అమర్‌దీప్ కూడా మాట్లాడుకున్నారు. స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌ను బయటికి పంపించేయాలి అన్న ఉద్దేశంతో శివాజీ ఉన్నాడని అమర్‌దీప్ అన్నాడు. ప్రిన్స్ యావర్‌కు శివాజీ సపోర్ట్ అన్నట్టుగా మాట్లాడాడు. ‘‘వాడేమైనా పోటుగాడా’’ అని ఇన్‌డైరెక్ట్‌గా అన్నాడు. ఆ తర్వాత యావర్‌తో శివాజీకి కూడా డిస్కషన్ జరిగింది. ‘‘నేను నిన్ను నామినేట్ చేయకపోతే అప్పుడు పక్షపాతిని అవుతాను. ఆడియన్స్‌కు తెలుసు ఏంటో’’ అని శివాజీ కాన్ఫిడెంట్‌గా తాను చేసింది తప్పు కాదని అన్నాడు.
Also Read: ఆ వెబ్ సీరిస్ కోసం సీరియల్ తల్లి జ్యోతి రాయ్ గ్లామర్ షో - ఇక ఫ్యాన్స్‌కు పండగే!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial