అన్వేషించండి

Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్

బిగ్ బాస్‌లో సండే ఫన్‌డేకు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలయ్యింది. కానీ ఇందులో చివరిగా ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు.

బిగ్ బాస్‌లో ముందుగా సండే... ఫన్‌ డే లాగా స్టార్ట్ అయ్యి... మెల్లగా అది ఎలిమినేషన్ మోడ్‌లోకి మారుతుంది. నేడు (అక్టోబర్ 1న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో కూడా అదే జరగనుంది. ముందుగా ఈ సండే ఫన్‌ డే ఫిక్షనరీతో ఎంజాయ్ చేద్దామని నాగార్జున అన్నారు. అంటే ఒక సినిమా టైటిల్‌ను బొమ్మ గీసి ఇతర కంటెస్టెంట్స్‌ దానిని గెస్ చేసేలా చేయాలి. తాజాగా విడుదలయిన ప్రోమోలో ఫిక్షనరీ కోసం కంటెస్టెంట్స్ అంతా తెగ కష్టపడినట్టు తెలుస్తోంది. టైటిల్స్ సింపుల్‌గా ఉన్నా... దానిని వారి క్రియేటివిటీతో కష్టంగా మార్చి... కంటెస్టెంట్స్‌ను ఇబ్బంది పెట్టారు. ఇక ఈ ప్రోమో చివర్లో నాగార్జున ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. 

ఫిక్షనరీ అనేది ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఆనవాయితీగా వస్తున్న ఆటే. ప్రతీ సీజన్‌లో కంటెస్టెంట్స్ ఈ గేమ్ ఆడడం, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం సహజమే. అలాగే ఈసారి కూడా ఇదే గేమ్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలో కాస్త ఫన్ కూడా క్రియేట్ అయ్యింది. ముందుగా గౌతమ్ కృష్ణకు ‘గోకులంలో సీత’ అనే టైటిల్ వచ్చింది. దీంతో రామబాణాన్ని గీసి, ఆ పక్కనే సీతాదేవిని గీసి చూపించే ప్రయత్నం చేశాడు. గౌతమ్ గీసిన బొమ్మను చూసిన తేజ... ‘బాణం కొడితే ఇద్దరు ఒక దెబ్బకు చచ్చిపోయారు’ అని కామెడీ చేశాడు. దీంతో నాగార్జున నవ్వుకున్నారు. కానీ కరెక్ట్ టైటిల్ ఏంటి అని ఎవరూ గెస్ చేయలేకపోయారు.

ప్రియాంక రాక్స్.. అమర్‌దీప్ షాక్స్..
గౌతమ్ తర్వాత పిక్షనరీతో ఆకట్టుకోవడానికి ప్రియాంక రంగంలోకి దిగింది. తనకు ‘నువ్వు నాకు నచ్చావ్’ టైటిల్ వచ్చింది. దీంతో ఒక అమ్మాయి, అబ్బాయి బొమ్మ గీసి ఒకరికి ఒకరంటే ఇష్టమని చూపించే ప్రయత్నం చేసింది. శోభా శెట్టి, అమర్‌దీప్ కలిసి అసలు ఆ టైటిల్ ఏంటో గెస్ చేయాలని తెగ ప్రయత్నాలు చేశారు కానీ కరెక్ట్‌గా మాత్రం చెప్పలేకపోయారు. దీంతో తన టీమ్ ఓడిపోయింది. వేరే టీమ్ వాళ్లు అదేంటో గెస్ చేయగలరా అని నాగార్జున అడగగా.. గౌతమ్ కృష్ణ.. ‘నువ్వు నాకు నచ్చావ్’ అని కరెక్ట్‌గా సమాధానమిచ్చాడు. అది విన్న అమర్‌దీప్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభశ్రీకి ‘మన్మథుడు’ టైటిల్ వచ్చింది. 

ఉల్టా పుల్టా సీజన్..
‘మన్మథుడు’ను ఫిక్షనరీలో చూపించడానికి ముందుగా ఒక మనిషి బొమ్మను గీసింది శుభశ్రీ. అది చూసిన వెంటనే దిష్టి బొమ్మ అన్నాడు తేజ. ఆ తర్వాత నాగార్జునను చూపించి ఆయన మూవీ అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే టైమ్ అయిపోయింది. శుభ శ్రీ గీసింది ఎవరికీ అర్థం అవ్వకపోయినా.. ప్రియాంక మాత్రం ‘మన్మథుడు’ అని కరెక్ట్‌గా గెస్ చేసింది. దీంతో ఈ సండే ఫన్‌ డేలో ఎవరికి వారు వారి ఫిక్షనరీ టాలెంట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంతో పాటు నవ్వులు పూయించారని అర్థమవుతోంది. అయితే ఈ ఫన్ అంతా ముగిసిన తర్వాత ప్రోమో చివర్లో... ‘‘ఈ సీజన్‌లో ఎప్పుడూ, ఎక్కడా జరగనటువంటి విషయాలు జరగబోతున్నాయి. ఈ సీజన్ ఉల్టా పుల్టా అని గుర్తుపెట్టుకోండి’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు నాగార్జున. అంటే ఈరోజు ఎలిమినేషన్ ఉంటుందా, ఉండందా లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయంలో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అని ప్రేక్షకులు అప్పుడే గెస్ చేయడం మొదలుపెట్టారు.

Also Read: దయచేసి ఇకనైనా మారండి- తెలుగు సినిమాపై విమర్శకులు చేసేవాళ్లకు 'హైపర్' ఆది పంచ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
Nara Lokesh Gift: భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
China Manja For Kites: పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
Hari Hara Veera Mallu: వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbh Mela 2025 Day 1 Highlights | ప్రయాగలో కళ్లు చెదిరిపోయే విజువల్స్ | ABP DesamMahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
Nara Lokesh Gift: భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
భార్య బ్రహ్మణిని సర్ ప్రైజ్ చేసిన నారా లోకేష్, సంక్రాంతి గిఫ్ట్ మామూలుగా లేదు
China Manja For Kites: పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
Hari Hara Veera Mallu: వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
వినాలి... వీరమల్లు మాట వినాలి - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి సర్‌ప్రైజ్, ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
Jallikattu: చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్, ఎద్దులు రంకెలేసి దూసుకొస్తున్నా తగ్గేదేలే అంటున్న యువత
చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్, ఎద్దులు రంకెలేసి దూసుకొస్తున్నా తగ్గేదేలే అంటున్న యువత
Hyderabad Double Murder: సంక్రాంతి రోజు నార్సింగిలో జంట హత్యల కలకలం- యువతి, యువకుడిపై అంత పగ ఎవరికో?
సంక్రాంతి రోజు నార్సింగిలో జంట హత్యల కలకలం- యువతి, యువకుడిపై అంత పగ ఎవరికో?
Sankranti 2025: తెలంగాణకు పాకిన గోదావరి
తెలంగాణకు పాకిన గోదావరి "అతి" మర్యాదలు, శృతి మించుతున్న సంక్రాంతి అల్లుడి వెరైటీ విందులు
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు
Embed widget