అన్వేషించండి

Bigg Boss: నువ్వు అందరికీ సోప్ వేస్తావ్ - సూర్యకు ఇనయా ఝలక్, నాకు దురద ఎక్కువ - సత్య

బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ హీట్ మొదలైపోయింది. గీతూ, రేవంత్ మధ్య పెద్ద గలాటేనే జరిగింది.

దీపావళి ఎపిసోడ్ అదిరిపోయేలా ప్లాన్ చేసిన ఫుల్ ఫన్‌తో ఎంటర్‌టైన్ చేసేశారు. ఇక సోమవారం వచ్చేసింది. ఇంట్లో వాళ్ళ మధ్య గొడవలు మొదలైపోయాయి. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే నామినేషన్స్ డే వచ్చేసింది. సోమవారం వచ్చిందంటే చాలు అందరి మనసుల్లో ఉన్న లుకలుకలు బయటపడిపోతాయి. ఈ నేపథ్యంలో గీతూ, రేవంత్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. మళ్ళీ లయర్ అనే టాపిక్ ని బాలాదిత్య లేవనెత్తగా గీతూ ఎప్పటిలాగానే తను అనలేదని సమర్ధించుకుంది.

తాజా ప్రోమో ప్రకారం.. నామినేషన్స్ పేరుతో ఇంట్లో మంట పెట్టేస్తాడు. ఫైర్ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఎవరి ఎవర్ని ఎందుకు నామినేట్ చేస్తున్నారనేది చెప్తూ వాళ్ళ ఫోటోని మంటలో వేయమన్నాడు. ఏ టైమ్ లో ఎవరితో బాగుంటే బాగుంటుందో అలా బిహేవ్ చేస్తున్నావ్ అని ఆదిరెడ్డి ఇనయాని ఉద్దేశించి అన్నాడు. ఇక గీతూ కూడా ఇనయానే టార్గెట్ చేసింది. ఇక సూర్యకి ఇనయా పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సూర్య సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, అందరికీ సోప్ వేస్తున్నాడని  చెప్పింది. ఏడు వారాల తర్వాత నీకు ఎందుకు అలా అనిపించింది, మంచిగా ఉండటం కూడా మహా పాపం అయ్యిందని సూర్య ఫీల్ అవుతాడు.

ఇక గీతూ మేరీనా గురించి లీస్ట్ డిజర్వింగ్ కంటెస్టెంట్ అని చెప్పింది. ఆది రెడ్డి కూడా మేరీనా గురించి మీరు గేమ్ ఏం ఆడుతున్నారని ఎప్పటిలాగే అరుస్తూ చెప్పాడు. ఫిజికల్ గా ఈ ఇంట్లో అందరికన్నా ఎక్కువ టాస్కులు ఆడింది తనే అని డబ్బా కొట్టుకుంది గీతూ. బాలాదిత్య, శ్రీ సత్య తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టాడు. నాకు కాస్త దురద ఉంది అయిపోయిన దాన్ని తీసుకొచ్చి రాసుకుంటూ ఉంటాను అని సత్య అనేసింది. ఇక గీతూ గురించి మాట్లాడుతూ లయర్ టాపిక్ మళ్ళీ తీసుకొస్తే ఆ మాట నేను అనలేదని అనేసింది. నువ్వు ఆ మాట అన్నావనే విషయం ఇక్కడ ఉన్న అందరికీ నిన్న మరోసారి తెలిసిందని బాలాదిత్య అంటాడు. ప్రపంచం మొత్తం అనిపించినా నేను అనలేదని కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పేసింది గీతూ.

ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్లో దీపావళి సందర్భంగా ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. అంజలి, కార్తీ, హైపర్ ఆది, సింగర్ శ్రీరామచంద్ర వచ్చి అందరినీ ఎంటర్‌టైన్ చేశారు. ఆటలు, పాటలతో ఫుల్ ఎంజాయ్ చేశారు. చివరిగా ఎలిమినేషన్ లో మిగిలిన వాళ్ళకి ఆటలు పెట్టి ఒక్కొక్కరు సేఫ్ అయ్యారని ప్రకటిస్తూ వచ్చారు హోస్ట్ నాగార్జున. చివరికి ఎలిమినేషన్ అర్జున్, వాసంతి మిగిలారు. వాళ్ళలో అర్జున్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించారు. అర్జున్ ఎలిమినేషన్ ని ఊహించని హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. శ్రీసత్య కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘ఎవరికోసం ఏడవనని అన్నావ్, ఎందుకు ఏడుస్తున్నావ్’’ అని సత్యని అడిగింది గీతూ. 

ఎవరు ఆటం బాంబ్ - ఎవరు తుస్: 

అర్జున్ ని స్టేజ్ పైకి పిలిచిన నాగార్జున.. హౌస్ లో ఎవరు ఆటం బాంబ్, ఎవరు తుస్ అని అడిగారు. దానికి అర్జున్.. శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, గీతూ, ఫైమాలను ఆటం బాంబ్స్ అని.. రోహిత్, మెరీనా, కీర్తి, ఇనయా, బాలాదిత్యలకు తుస్ అని ఇచ్చాడు.

శ్రీసత్య కోసమే హౌస్ లోకి వచ్చానని.. స్టేజ్ పై చెప్పారు అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ కి రావడానికి ముందు శ్రీసత్యని ఓ సినిమా కోసం రిఫర్ చేశానని.. దానికి ఆమె కుదరదు బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పిందని.. వెంటనే నేను కూడా అప్లై చేశానని అర్జున్ చెప్పుకొచ్చారు. తనకు బిగ్ బాస్ లో ఛాన్స్ రాగానే ఫస్ట్ శ్రీసత్యకే ఫోన్ చేసి చెప్పానని తెలిపారు అర్జున్. 

Also Read: పూర్ణకు పెళ్లయిపోయిందట, అందుకే ఎవరినీ పిలవలేకపోయానని చెప్పిన ముద్దుగుమ్మ!

 

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget