అన్వేషించండి
Advertisement
Bigg Boss Telugu OTT Participants: బిగ్ బాస్ హౌస్ లో బోల్డ్ బ్యూటీస్, ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్
పన్నెండో కంటెస్టెంట్ గా తేజస్వి మదివాడ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది.
Bigg Boss Non Stop Telugu Contestants: తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడాదికి ఒకసారి ఈ షోని నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదలుపెట్టారు. ఈరోజు నుంచే షోని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. నాన్ స్టాప్ గా హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. ఈరోజు స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. షో ఎలా ఉండబోతుందో చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. ఇల్లు మొత్తాన్ని చూపించారు. ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున ఈసారి గేమ్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుందని చెప్పారు. వారియర్స్ అంటే పాత కంటెస్టెంట్స్ అని.. కొత్తవాళ్లను ఛాలెంజర్స్ అని చెప్పారు నాగ్.
పన్నెండో కంటెస్టెంట్ గా తేజస్వి మదివాడ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 2 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఎంటర్టైన్మెంట్ బాకీ ఉండిపోయానని.. ఈసారి ఓటీటీ వెర్షన్ తో అందరినీ అలరిస్తానని చెప్పుకొచ్చింది. స్టేజ్ పై తనతో స్టెప్పులేయించారు నాగార్జున. ఇక హౌస్ లోకి వెళ్లిన తేజస్వి అప్పుడే తన అల్లరి మొదలుపెట్టేసింది.
పదమూడో కంటెస్టెంట్ గా సరయు ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సరయు ఒక్క వారంలోనే హౌస్ నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు మరో అవకాశం రావడంతో ఈసారి తన సత్తా చూపిస్తానని చెబుతోంది. హౌస్ లోకి వెళ్తూ.. మంట పెట్టేస్తానని చెప్పింది. ఇక హౌస్ లోకి వెళ్లిన తేజస్వి, సరయులకు ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
Pataka💥 back again to entertain and bring extra toughness to the competition! Let's welcome warrior #TejaswiMadivada !! #BiggBoss #BiggBossNonStop #disneyplushotstar @DisneyPlusHS @iamnagarjuna @EndemolShineIND pic.twitter.com/iRQTfItiUR
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 26, 2022
Is warrior #SarayuRoy the powerhouse of the #BiggBoss house?! #BiggBossNonStop #disneyplushotstar @DisneyPlusHS @iamnagarjuna @EndemolShineIND pic.twitter.com/8Yetyin52M
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 26, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion