అన్వేషించండి
Advertisement
Bigg Boss Telugu OTT Participants: పదకొండో కంటెస్టెంట్ గా మిత్ర, ఎవరీ అమ్మాయి?
ఇప్పటివరకు మొత్తం పది మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అవ్వగా.. పదకొండో కంటెస్టెంట్ గా నటి మిత్రాశర్మ ఎంట్రీ ఇచ్చింది
Bigg Boss Non Stop Telugu Contestants: తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడాదికి ఒకసారి ఈ షోని నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదలుపెట్టారు. ఈరోజు నుంచే షోని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. నాన్ స్టాప్ గా హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. ఈరోజు స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. షో ఎలా ఉండబోతుందో చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. ఇల్లు మొత్తాన్ని చూపించారు. ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున ఈసారి గేమ్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుందని చెప్పారు. వారియర్స్ అంటే పాత కంటెస్టెంట్స్ అని.. కొత్తవాళ్లను ఛాలెంజర్స్ అని చెప్పారు నాగ్.
ఇప్పటివరకు మొత్తం పది మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అవ్వగా.. పదకొండో కంటెస్టెంట్ గా నటి మిత్రాశర్మ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'తొలి సంధ్యవేళలో' అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ. అలానే శ్రీపిక్చర్స్ అనే బ్యానర్ మొదలుపెట్టి సినిమాలు చేయడం మొదలుపెట్టింది. రీసెంట్ గా ఈ బ్యానర్ లో 'బాయ్స్' అనే సినిమాను ప్రొడ్యూస్ చేసింది.
హౌస్ లోకి వెళ్లిన ఆమె.. ఆర్జే చైతుని అన్నయ్యని పిలిచింది. దీంతో చైతు ఫీల్ అవుతూ.. తనను ఎందుకు అలా పిలిచావ్ అని అడిగితే.. 'నువ్ నాకు అన్నయ్యవే' అంటూ రెండు సార్లు చెప్పడంతో సైలెంట్ అయిపోయాడు చైతు. ఆ తరువాత అరియానా.. అనిల్ రాథోడ్, మిత్ర శర్మలను ఇమిటేట్ చేసింది. నటరాజ్ మాస్టర్.. శ్రీరాపాకని ఇమిటేట్ చేసి హౌస్ మేట్స్ ని నవ్వించారు.
Challenger #MithraawSharma! Ready to bring the drama!!! 🎭#BiggBoss #BiggBossNonStop #disneyplushotstar @DisneyPlusHS @EndemolShineIND @iamnagarjuna pic.twitter.com/fSsDYHprg4
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 26, 2022
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion