అన్వేషించండి
Advertisement
Bigg Boss Telugu OTT Participants: అరియానా సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ - ఇరికించేసిన నాగార్జున
ఇప్పటివరకు ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లగా.. ఏడో కంటెస్టెంట్ గా అరియనా గ్లోరీ ఎంట్రీ ఇచ్చింది.
Bigg Boss Non Stop Telugu Contestants: తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడాదికి ఒకసారి ఈ షోని నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదలుపెట్టారు. ఈరోజు నుంచే షోని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. నాన్ స్టాప్ గా హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. ఈరోజు స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. షో ఎలా ఉండబోతుందో చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. ఇల్లు మొత్తాన్ని చూపించారు.
ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున ఈసారి గేమ్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుందని చెప్పారు. వారియర్స్ అంటే పాత కంటెస్టెంట్స్ అని.. కొత్తవాళ్లను ఛాలెంజర్స్ అని చెప్పారు నాగ్. ఇప్పటివరకు ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లగా.. ఏడో కంటెస్టెంట్ గా అరియనా గ్లోరీ ఎంట్రీ ఇచ్చింది. ఈమె బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది.
ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. స్టేజ్ పైకి వచ్చిన అరియానా.. తన గేమ్ మాములుగా ఉండదని నాగార్జున చెప్పింది. 'ఆట అంటే ఆటే.. ఈసారి అమ్మాయి గెలవాలి' అని చెప్పింది. నాగార్జున.. అవినాష్ గురించి అడగ్గా.. పెళ్లి చేసుకొని కష్టాలు పడుతున్నాడని, పెళ్లయిన తర్వాత మాట్లాడలేదని సరదాగా చెప్పుకొచ్చింది. 'సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని విన్నామని' నాగార్జున అడగ్గా.. చాలా మంది ఉన్నారని ఫన్నీగా చెప్పింది. ఆ తరువాత సీక్రెట్.. సీక్రెట్ గానే ఉండాలని చెప్పింది.
#Ariyana returns to the #BiggBoss house with an electrifying performance!! ⚡⚡⚡#BiggBossNonStop #disneyplushotstar @DisneyPlusHS @iamnagarjuna @EndemolShineIND pic.twitter.com/fEZUaSVY4Q
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 26, 2022
ఇక ఎనిమిదో కంటెస్టెంట్ గా నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారాయన. ఇప్పుడు మరోసారి ఛాన్స్ రావడంతో ఎగ్జైట్ అయ్యారు. లాస్ట్ టైం నాలుగు వారాల్లో హౌస్ నుంచి బయటకు వెళ్లానని.. ఈసారి గెలిచి తీరుతానని చాలా నమ్మకంగా చెప్పారు.
The king of the jungle🦁!!! #NatrajMaster is ready to rule the #BiggBoss house! #BiggBossNonStop #disneyplushotstar @DisneyPlusHS @iamnagarjuna @EndemolShineIND pic.twitter.com/ZRukjmQTfe
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 26, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion