అన్వేషించండి
Advertisement
Bigg Boss Telugu OTT Participants: ఈసారి కప్పు గ్యారంటీ - అఖిల్ కాన్ఫిడెన్స్ చూశారా?
మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లగా.. చివరి కంటెస్టెంట్ గా అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చారు.
Bigg Boss Non Stop Telugu Contestants: తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడాదికి ఒకసారి ఈ షోని నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదలుపెట్టారు. ఈరోజు నుంచే షోని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. నాన్ స్టాప్ గా హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. ఈరోజు స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. షో ఎలా ఉండబోతుందో చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. ఇల్లు మొత్తాన్ని చూపించారు. ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున ఈసారి గేమ్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుందని చెప్పారు. వారియర్స్ అంటే పాత కంటెస్టెంట్స్ అని.. కొత్తవాళ్లను ఛాలెంజర్స్ అని చెప్పారు నాగ్.
మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లగా.. చివరి కంటెస్టెంట్ గా అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు అఖిల్. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. స్టేజ్ పైకి వచ్చిన అఖిల్ ని 'నీ గుజరాతీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని' నాగార్జున అడగ్గా.. చాలా బాగున్నారని చెప్పాడు అఖిల్.
తనకు సెకండ్ ఛాన్స్ వచ్చిందని.. ఈసారి ఛాన్స్ వదులుకోనని.. కప్పు కొట్టే వెళ్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. హౌస్ లోకి వెళ్లిన అఖిల్ ని చూసి చాలా ఎగ్జైట్ అయింది అరియానా. హౌస్ మేట్స్ అందరినీ పలకరించాడు అఖిల్.
Vachchadayo warrior #AkhilSarthak!!! The #MirchiKurradu! 🌶️🌶️#BiggBoss #BiggBossNonStop #disneyplushotstar @DisneyPlusHS @iamnagarjuna @EndemolShineIND pic.twitter.com/f2Wgu5Puub
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 26, 2022
ఇక 24 గంటలు చూడలేని వాళ్ల కోసం హాట్ స్టార్ లో ప్రతిరోజు ఓ గంట ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తారు. నిజానికి ఈ గంటలోనే మొత్తమన్నీ కవర్ అయిపోతాయన్నమాట. ప్రతివారం ఎలిమినేషన్స్, నామినేషన్స్ అన్నీ కామనే. 24 గంటల ఈ షోని 84 రోజులు కంటిన్యూస్ గా ప్రసారం చేయనున్నారు. ఈసారి కంటెస్టెంట్స్ అందరూ కాస్త పేరున్న వాళ్లు కావడంతో 84 రోజుల కంటే ఎక్కువ ఉన్నా.. ఆశ్చర్యపోనక్కర్లేదు.
షో మొత్తం సంగతేమో కానీ.. నాగార్జున హోస్ట్ చేసే రోజుల్లో మాత్రం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ముందురోజు షూటింగ్ చేయడం, దాన్ని ఎడిట్ చేసి స్ట్రీమింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. మరి ఈసారి ఎలా ప్లాన్ చేస్తున్నారో..? కంటెస్టెంట్స్ లో చాలా మంది ఇదివరకు హౌస్ కి వెళ్లొచ్చిన వాళ్లే. వారికి అనుభవం ఉంది కాబట్టి ఈసారి మరింత దృష్టి పెట్టి గేమ్ ఆడే అవకాశం ఉంటుంది. అయితే ప్రేక్షకుల ఫోకస్ మాత్రం కొత్త వాళ్లపై పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. పాత కంటెస్టెంట్స్ గేమ్ తీరు ఆల్రెడీ చూశారు కాబట్టి కొత్తవాళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
వరంగల్
ఆధ్యాత్మికం
లైఫ్స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement