Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష... హౌస్‌లో ఎంటరైన 15 మంది వీళ్ళే - ప్రోమోలో ఫేస్‌లతో సహా రివీల్
Bigg Boss Agnipariksha Contestants: 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' కొత్త ప్రోమో విడుదలైంది. బిగ్ బాస్ ఇంటిలో స్థానం కోసం పోటీ పడుతున్న 15 మంది కంటెస్టెంట్లను రివీల్ చేశారు. వాళ్లెవరో తెలుసుకోండి.

Bigg Boss 9 Telugu Updates: 'బిగ్ బాస్ 9' మొదలు అయ్యేది సెప్టెంబర్ తొలి వారంలో! అయితే ఆదివారం రాత్రి నుంచి సందడి మొదలు అయ్యింది. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9లో స్థానం పోటీ పడుతున్న 15 మంది సామాన్యులను ప్రేక్షకులకు చూపెడుతూ ఒక ప్రోమో విడుదల చేశారు.
సామాన్యుల ఫేసులు రివీల్ చేసిన బిగ్ బాస్!
'బిగ్ బాస్' రియాలిటీ షో థీమ్ అందరికీ తెలుసు. షో లాంఛింగ్ గ్రాండ్ ఎపిసోడ్‌లో వీక్షకులకు కంటెస్టెంట్స్ ఎవరో పరిచయం చేస్తారు. కంటెస్టెంట్లు ఎవరనే లీకులు బయటకు రావడం తప్ప అప్పటి వరకు వాళ్ళ ముఖాలు సైతం చూపించరు. అయితే ఈసారి 'డబుల్ హౌస్, డబుల్ డోస్' అంటూ వస్తున్న బిగ్ బాస్...
సామాన్య ప్రజలకు షోలో అవకాశం కల్పించడం కోసం 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' పేరుతో ఒక షో చేస్తున్నారు. కామన్ పీపుల్ నుంచి అప్లికేషన్స్ సెలెక్ట్ చేశారు. అందులో 45 మందిని ఫిల్టర్ చేశారు. ఆ 45 మంది నుంచి 15 మందిని 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'కు ఎంపిక చేశారు. ఇప్పుడు ఆ 15 మంది ఫేసులు రివీల్ చేశారు.
'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'కు ఎంపికైన 15 మంది వీళ్ళే అంటూ కొన్ని రోజుల క్రితం కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అయ్యాయి. ఇప్పుడు విడుదలైన ప్రోమోలోనూ వాళ్ళే కనిపించారు. యాంకర్ & సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అనూషా రత్నంతో పాటు సోషల్ మీడియాలో పాపులరైన మరొక అమ్మాయి దివ్య నిఖిత (వెజ్ ఫ్రైడ్ మోమో) ఉన్నారు. ప్రోమోలో అనూష డ్యాన్స్ చేసి అలరిస్తే... 'ఒక సాయి పల్లవి, ఒక శ్రీ లీల, ఒక దివ్య నిఖిత' అంటూ వెజ్ ఫ్రైడ్ మోమో పేర్కొంది.
ఆడ నవదీప్ నేను... నవదీప్ దేనికండి?
ప్రోమోలో నవదీప్ మీద వేసిన పంచ్ డైలాగ్స్ వైరల్ అయ్యాయి. 'నేను ఆడ నవదీప్' అంటూ శ్వేతా శెట్టి పంచ్ వేయడం... 'నీకు నవదీప్ ఒకేనా? అని యాంకర్ శ్రీముఖి అడిగితే 'దేనికండీ' అంటూ ప్రియా శెట్టి అడగటం వైరల్ కంటెంట్.
View this post on Instagram
'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లో ఎంటరైన 15 మంది కంటెస్టెంట్లు ఎవరు? అనేది చూస్తే... కామన్ మ్యాన్ నర్సయ్య, సిద్ధిపేట్ మోడల్, దమ్ము శ్రీజ, ఊర్మిళా చౌహన్, డెమోన్ పవన్, అనూషా రత్నం, శ్వేతా శెట్టి, దివ్య నిఖిత (వెజ్ ఫ్రైడ్ మోమో), ప్రియా శెట్టి, కేతమ్మా, మాస్క్ మ్యాన్ హృదయ్, యాంకర్ మల్లీశ్వరి, ఉత్తర ప్రశాంత్, రవి, ప్రశాంత్ కుమార్, కల్కి! వీళ్ళలో ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారట.
ఆగస్టు 22వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలో 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' స్టార్ట్ కానుంది. ఫినాలే వరకు చేరుకున్న ఆరుగురిని 'బిగ్ బాస్ 9'లోకి పంపించే అవకాశం ఉంది.





















