Bigg Boss 9 Telugu : వైల్డ్ కార్డ్స్ వైల్డ్ ఎంట్రీస్... హౌజ్ మేట్స్‌కి దిమ్మతిరిగే ధమాకా - అగ్ని పరీక్ష నుంచి ఆ నలుగురూ, మరో కంటెస్టెంట్ కన్ఫర్మ్... డేంజర్లో తనూజ
Bigg Boss 9 Telugu : వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఆడియన్స్ కు గుడ్ న్యూస్. తాజా ఖబర్ ప్రకారం హౌజ్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు అడుగు పెట్టారు. ఆ ఎపిసోడ్ ఎప్పుడు ?

మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్ వైల్డ్ గా ఉండబోతున్నాయి. ఇప్పటికే హౌజ్ లోకి అడుగు పెట్టబోయే కంటెస్టెంట్స్ గురించి జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం అగ్ని పరీక్ష నుంచి నలుగురు కంటెస్టెంట్స్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి ఆ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ కాబోతోంది? వైల్డ్ కార్డు ఎంట్రీగా కన్ఫర్మ్ అయిన మరో కంటెస్టెంట్ ఎవరు? ఈ వైల్డ్ కార్డుల వల్ల డేంజర్ లో పడేది ఎవరు? అంటే...
అగ్ని పరీక్ష నుంచి నలుగురు వైల్డ్ కార్డు ఎంట్రీగా..
ఈ వారం మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో మిడ్ వీక్ సర్ప్రైజ్ ఉండబోతుందని వార్త వినిపిస్తోంది. ఆ సర్ప్రైజ్ మరేంటో కాదు వైల్డ్ కార్డు ఎంట్రీ అని అంటున్నారు. బుధవారం రోజు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోందని అన్నారు. కానీ తీరా చూస్తే బుధవారం ఎపిసోడ్ మొత్తాన్ని బిగ్ బాస్ మంగళవారం ఇచ్చిన యాపిల్ టాస్క్ తోనే సరిపెట్టేశారు. దీంతో వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి ఈగర్ గా వెయిట్ చేసిన ఆడియన్స్ నిరాశకు గురయ్యారు. కానీ తాజా సమాచారం ప్రకారం వైల్డ్ కార్డు ఎంట్రీ నిజంగానే ఉంటుంది. అయితే బుధవారం కాదు, గురువారం వాళ్ళు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అంటే గురువారం ఎపిసోడ్లో వైల్డ్ కార్డు ఎంట్రీ డబుల్ ధమాకాని ఆడియన్స్ వీక్షించే అవకాశం ఉంటుంది.
ఇక ఇప్పటికే వినిపిస్తున్న టాక్ ను నిజం చేస్తూ వైల్డ్ కార్డు ఎంట్రీగా బీబీ హౌజ్ లోకి అగ్ని పరీక్ష దాకా వచ్చిన నలుగురు కంటెస్టెంట్స్ లో దివ్య నిఖిత, అనూష రత్నం, నాగ ప్రశాంత్, షాకిబ్ ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో హౌజ్ మేట్స్ అందరూ ఈ ఊహించని సర్ప్రైజ్ కి షాక్ అయినట్టు తెలుస్తోంది. వీళ్లతో పాటు బిగ్ బాస్ హౌజ్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న సెలబ్రిటీలలో ప్రియాంక జైన్ ప్రియుడు, టీవీ సీరియల్ యాక్టర్ శివకుమార్ కన్ఫామ్ అయినట్టు సమాచారం. మరి ఈ సెలబ్రిటీల వైల్డ్ కార్డు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో డేంజర్ లో సెలబ్రిటీలు
ఈ వైల్డ్ కార్డుల వల్ల గేమ్ డైనమిక్స్ కంప్లీట్ గా మారబోతున్నాయి. ముందుగా కామనర్స్ వైల్డ్ కార్డు ఎంట్రీగా హౌజ్ లోకి అడుగు పెట్టడంతో కామనర్స్ కి బూస్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది. అలాగే ఆ తర్వాత సెలబ్రిటీల ఎంట్రీతో సెలబ్రిటీలే డేంజర్ లో పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో తనూజకి సీరియల్స్ పరంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న సెలబ్రిటీలలో మోస్ట్లీ సీరియల్ యాక్టర్సే ఉన్నారు. దీంతో ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. దీనివల్ల తనూజ ప్రస్తుతం నడుపుతున్న గ్రూప్ గేమ్ కి ఫుల్ స్టాప్ పడి, ఓటింగ్ పరంగా ఆమె డేంజర్ జోన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.





















