అన్వేషించండి

Bigg Boss Agnipariksha First Episode: బిగ్ బాస్ అగ్నిపరీక్షలో మాస్క్ మ్యాన్ ఆటిట్యూడ్... కేతమ్మ ఇన్‌స్పిరేషన్ - ఫస్ట్ ఎపిసోడ్ హైలెట్స్ ఇవే!

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఓటీటీలోకి వచ్చేసింది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఇద్దరిని డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేశారు జడ్జెస్. కొందరు ఇన్‌స్పిరేషన్ స్టోరీస్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.

Bigg Boss 9 Telugu Agni Pariksha Episode 1 Review Two Contestants Eliminated: బిగ్ బాస్ 9వ సీజన్ స్టార్ట్ కాక ముందే హీట్ మొదలైంది. అగ్ని పరీక్ష అంటూ ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరిగిన హడావిడి అందరికీ తెలిసిందే. లక్షల అప్లికేషన్స్ వస్తే.. వందల్లో ఫిల్టర్ చేసి.. చివరకు 45 మందిని సెలెక్ట్ చేసింది బిగ్ బాస్ టీం. ఇక అందులో సెలెక్ట్ అయిన వారికి అగ్ని పరీక్ష పెట్టి.. హౌస్‌లోకి ఓ 5 మందిని పంపే ప్లాన్‌లో బిగ్ బాస్ టీం ఉంది. ఈ ప్రాసెస్ కోసం నవదీప్, అభిజిత్, బిందు మాధవిలు జడ్జ్‌లుగా వచ్చారు.

ఈ మేరకు ఫస్ట్ ఎపిసోడ్‌లో విజయవాడ నుంచి దివ్య నిఖిత, హరీష్, నల్గొండ నుంచి కేతమ్మ, కర్నూలు నుంచి ప్రియ వచ్చారు. మల్టీస్టార్ మన్మథరాజాకు ఈ ఎపిసోడ్‌లో ఎదురు దెబ్బ తగిలింది. మినిమం డిగ్రీ అనే డైలాగ్‌తో రివ్యూలు చెప్పి ఫేమస్ అయిన ఇతన్ని జడ్జ్‌లు ఎలిమినేట్ చేశారు. అబు బక్కర్, మాధురి, ప్రసన్న జర్నీలు కూడా ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లోనే వచ్చాయి. అసలు ఎవరికి ఎలాంటి రిజల్ట్ ఎదురైందంటే...

ఆ ఇద్దరూ ఎలిమినేట్...

ముగ్గురు జడ్జెస్‌లో ముగ్గురూ గ్రీన్ ఇస్తే... డైరెక్ట్‌గా టాప్ 15లోకి ఎంట్రీ లభిస్తుంది. ఆ తరువాత మహా అగ్ని పరీక్ష ఉంటుంది. ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లో కేవలం ఇద్దరికే టాప్ 15లోకి ఎంట్రీ లభించింది. ఇక ఒక్క రెడ్ వచ్చినా కూడా హోల్డ్‌లో ఉండాల్సి వస్తుంది. అలా ఈ ఎపిసోడ్‌లో చాలా మందిని హోల్డ్‌లో పెట్టారు. కానీ మన్మథరాజా, వైజాగ్ నుంచి వచ్చిన మాధురిని మాత్రం డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేశారు.

విజయవాడ నుంచి వచ్చిన దివ్యా నిఖితకు డైరెక్ట్ టాప్ 15 ఎంట్రీ దక్కింది. ఆమె చలాకీతనం, మాట తీరు, ఆట తీరు జడ్జ్‌లకు నచ్చింది. ఇక జిమ్‌ చేస్తుండగా.. వెన్నుమొకలో గాయం అవ్వడం, నడవలేని స్థితి నుంచి ఈ స్థాయికి రావడం వెనకాల ఉన్న కృషి, జర్నీని చెప్పి అందరినీ ఆకట్టుకుంది. ఇక నవదీప్ బెస్ట్ కంటెస్టెంట్ అని, అభిజిత్ వరెస్ట్ కంటెస్టెంట్ అని స్టేజ్ మీద దివ్యా నిఖిత నామినేట్ చేసింది. 

అభిజిత్ ఆట మీద కాకుండా వేరే కంటెస్టెంట్ల మీద ఫోకస్ పెట్టాడు.. ఎక్కడా ఫిజికల్ టాస్కులు ఆడలేదు.. కేవలం ఒక ఆటలోనే మైండ్ గేమ్ ఆడాడు.. అతను విన్నర్ అవ్వడానికి అర్హుడు కాదు అంటూ ఇలా చెప్పుకుంటూ పోయింది దివ్య. ఇక ఇలా తన మీద కామెంట్ చేసినా కూడా అభిజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ముగ్గురు జడ్జ్‌లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దివ్య నిఖిత డైరెక్ట్‌గా టాప్ 15లోకి వెళ్లిపోయింది.

మాస్క్ మ్యాన్ ఆటిట్యూడ్... హోల్డ్‌లోకి...

ఆ తరువాత హరీష్ అనే ఓ డిఫరెంట్ పర్సన్‌ వచ్చాడు. మాస్క్ వేసుకుని రావడం, చెప్పే దానికి పొంతన లేకపోవడం, కోపం ఎక్కువ అని చెప్పడం, భార్యను కొడతాను అని చెప్పడంతో జడ్జ్‌లు అసంతృప్తి చెందారు. తన ఆటిట్యూడ్‌తో కాస్త చిరాకు తెప్పించాడు. అతనికి బిందు మాధవి, అభిజిత్ రెడ్ ఇచ్చారు. ఇంకో ఛాన్స్ ఇస్తాను.. నువ్వు నెక్ట్స్ రౌండ్లో ఏం చేస్తావో చూస్తాను అంటూ నవదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా ఈ కంటెస్టెంట్‌ను హోల్డ్‌లో పెట్టేశారు.

ఇన్‌స్పైర్డ్ కేతమ్మ... హోల్డ్‌లోకి పంపిన జడ్జెస్

ఆపై నల్గొండ నుంచి కేతమ్మ వచ్చింది. ఆమె ఆటా పాటా, మాట అన్నీ చూశారు. చలాకీగానే ఉన్నావ్ కానీ.. నీకు ఆ బిగ్ బాస్ ఇల్లు సెట్ కాదు అంటూ నవదీప్, బిందు మాధవి రెడ్ సిగ్నల్ ఇవ్వగా... అబిజీత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆమె తనకున్న పుట్టెడు కష్టాల గురించి చెప్పుకున్నా.. ఆమెను తీసి పక్కన పెట్టేశారు. ఆ తరువాత కర్నూలు నుంచి ప్రియా అనే అమ్మాయి వచ్చింది. ఆమె కాస్త చలాకీగానే కనిపించింది. నవదీప్‌ పెళ్లి కొడుకు అంటూ స్కిట్ చేసింది. జడ్జ్‌లను నవ్వించింది. కానీ ఆమెలోని ఇంకో యాంగిల్ బయటకు రావాల్సి ఉందని అభిజిత్ మాత్రం రెడ్ ఇచ్చి ఆమెను హోల్డ్‌లో ఉంచారు.

మన్మథరాజా బాగా అతి చేశాడు

ఆపై మల్టీస్టార్ మన్మథరాజా అనే వ్యక్తి వచ్చాడు. మినిమం డిగ్రీ అనే డైలాగ్‌తో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఇతగాడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. అన్నపూర్ణ స్టూడియో ముందు కూడా ధర్నా చేశాడు. బిగ్ బాస్‌లో ఏం చేస్తావ్?. నీకు నటించడం వచ్చా? ఏ హీరోలా అయినా నటించు? అని టాస్క్ ఇస్తే.. దారుణంగా నటించాడు. ఆ నటన చూసి అతగాడిని వెంటనే ఎలిమినేట్ చేశారు. ఇలా ఎలిమినేట్ చేస్తే జనాలు ఏమైనా అనుకుంటారు కదా? అని శ్రీముఖి అంటే.. ఇలాంటి వారిని ఎలిమినేట్ చేయకపోతేనే జనాలు తిడతారు అని నవదీప్ కౌంటర్ వేశాడు.

రైల్వే కోడూర్ నుంచి అబు బక్కర్ అనే ఓ వ్యక్తి వచ్చాడు. మంచి ఫిజిక్‌తో, సిక్స్ ప్యాక్‌తో వచ్చిన ఈ వ్యక్తిని హోల్డ్‌లో పెట్టారు. మోడలింగ్ చేసే ఈ వ్యక్తికి నవదీప్ ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చేసింది సరిపోదని హోల్డ్‌లో పెట్టారు. ఇక విశాఖపట్నం నుంచి మాధురి అనే అమ్మాయి వచ్చింది. మా నాన్న సీఎంఆర్ షాపింగ్ ముందు సెక్యురిటీగా పని చేస్తాడు.. అదే షాపుకి మోడల్‌లా నేను వెళ్లాలన్నదే కల అని చెప్పింది. అయితే ఈమె బిగ్ బాస్ షోకి సరిపోదని, ఇంకా టైం ఉందని ఆమెను ఎలిమినేట్ చేసేశారు.

మల్టీ టాలెంటెడ్ ప్రసన్న కుమార్

ఆపై హైదరాబాద్ నుంచి ప్రసన్న అనే వ్యక్తి వచ్చాడు. ఓ యాక్సిడెంట్‌లో కాలు పోయినా కూడా ప్రోస్థటిక్ కాలుతో ఎన్నో వండర్లు క్రియేట్ చేశాడు. ట్రావెల్లర్, బైక్ రైడర్, మారథాన్, ఫోటోగ్రాఫర్.. ఇలా తనలోని టాలెంట్ అంతా బయటకు చెప్పేశాడు. ఇలాంటి ఓ ఇన్ స్పైరింగ్ జర్నీని ప్రపంచానికి చెప్పకపోతే వేస్ట్.. నువ్వు కచ్చితంగా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలి అంటూ అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా ఈ ఎపిసోడ్‌లో దివ్యా, ప్రసన్నలకు మాత్రం టాప్ 15లోకి వెళ్లే అవకాశం వచ్చింది. అలా ఈ మొదటి ఎపిసోడ్‌లో కొందరిది అతిగా అనిపిస్తే.. ప్రసన్న జర్నీ మాత్రం సూర్తిగా నిలిచింది. ఇక టాప్ 15 నుంచి టాప్ 5 వరకు ఎవరు ఉంటారు? బిగ్ బాస్ ఇంట్లోకి ఎవరు వెళ్తారో చూడాలి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget