Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 51 రివ్యూ... శ్రీజ దమ్ము ధాటికి దువ్వాడ మాధురి డీలా... సంజనాకు ఇచ్చిపడేసిన భరణి... ఈ వారం నామినేటెడ్ కంటెస్టెంట్లు వీళ్ళే
Bigg Boss 9 Telugu Today Episode - Day 51 Review : 8వ వారం నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. ముగ్గురు తప్ప మిగతా వారంతా నామినేషన్లలో ఉన్నారు. భరణి, శ్రీజ దమ్ము బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు

డే 51లో నామినేషన్ల రచ్చ ఇంకా కొనసాగింది. ఎపిసోడ్ మొదట్లోనే శ్రీజ దమ్ము ఇచ్చిన ఝలక్ కు దువ్వాడ మాధురి కన్నీళ్లు పెట్టుకోగా, తనూజా ఓదార్చింది. తరువాత మాజీ కంటెస్టెంట్ శ్రేష్టి వర్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. "నువ్వు ఫిజికల్ టాస్క్ లు బాగా ఆడతావ్. కానీ ఆడియన్స్ అంత పెద్ద హింట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు. కండబలం ఉంది, బుద్ధి బలం లేదు" అంటూ డెమోన్ ను నామినేట్ చేసింది. దీంతో డెమోన్ "ఎవరేం అనుకుంటున్నారో నాకు అనవసరం. అవతలి పర్సన్ జెన్యూన్ గా ఉన్నారో లేదో అదే చూస్తా" అని క్లారిటీ ఇచ్చాడు. నెక్స్ట్ కత్తిని రాముకి ఇచ్చింది శ్రేష్టి. అతను "కెప్టెన్ గా సరిగ్గా చేయలేదు" అంటూ గౌరవ్ ను నామినేట్ చేశాడు. ఆ గ్యాప్ లో సంజన - గౌరవ్ కు చిన్న గొడవ జరిగింది.
ఈవారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్లు
అనంతరం భరణి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దివ్య ఆనందానికి అంతులేకుండా పోయింది. "కట్టప్ప చంపేశావ్ కదా" అంటూ రాగానే ఇమ్మాన్యుయేల్ పై సెటైర్ వేశాడు. "రూల్స్ మాట్లాడతారు. మీరే బ్రేక్ చేస్తారు. ముందు ముందు టాస్క్ లలో ఇబ్బంది అవుతుందేమో అంటే బాడీ షేమింగ్ అంటూ అంత సీన్ చేశావ్. నువ్వేం చేశావ్?" అంటూ సంజనా తీరును ప్రశ్నించారు భరణి. "మీరేం గేమ్ ఆడారు. మీ బాండ్స్ వల్లనే మీరు బయటకెళ్లారు. గ్రూపిజం చేసి కార్నర్ చేశారు" అంటూ గట్టిగానే సమాధానం చెప్పింది సంజన. నెక్స్ట్ భరణి కత్తిని నిఖిల్ కు ఇవ్వగా... "నేను అమ్మాయిని. నాకొక ఛాన్స్ ఇవ్వు అని నువ్వు ఇమ్మాన్యుయేల్ ను అడగడం నాకు నచ్చలేదు" అంటూ తనూజాను నామినేట్ చేశాడు. "మీరు ఒకచోట కూర్చుండిపోయారు. ఒక్క గేమ్ లో కూడా కనిపించలేదు. నామినేట్ చేసే ముందు మీరేం ఆడారు? ఏం పాయింట్ పెడుతున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? చూసి మాట్లాడండి" అంటూ తనూజా స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంతో, "ఇప్పుడు నాకు బిగ్ బాస్ ట్రోఫీ ఇవ్వమంటే ఇచ్చేస్తావా?" అంటూ కౌంటర్ వేశాడు నిఖిల్. ఈ వారం దువ్వాడ మాధురి, సంజన, రామూ రాథోడ్, కళ్యాణ్ పడాల, తనూజా, రీతూ చౌదరి, డెమోన్ పవన్, గౌరవ్ నామినేట్ అయ్యారు.
దివ్య మళ్లీ మొదలెట్టింది
"ఆయనకు పెడదామని పన్నీర్ చేసి దాచి ఉంచాను. కానీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తనూజా వల్ల.తను బయటకు వెళ్లలేదని భరణి క్లారిటీ ఇచ్చారు. నావల్లే అది జరిగిందా.అని భయమేస్తోంది" అంటూ భరణి వెళ్ళిపోగానే కుళాయి తిప్పేసింది దివ్య. ఆమెను ఇమ్మూ ఓదార్చాడు. మరోవైపు "ఇమ్మాన్యుయేల్ కు అమ్మ ఎలాగో, అలాగే నాకు కూడా ఒక సపోర్ట్ కావాలి కదా. భరణి వెళ్ళిపోయాక కూడా నావల్లే ఆయన ఎలిమినేట్ అయ్యాడని మళ్ళీ మళ్ళీ మాటలతో గుచ్చుతున్నారు సంజన" అంటూ బోరున ఏడ్చింది తనూజా. ఈ నామినేషన్లతో హౌస్ మేట్ అందరూ గందరగోళంలో పడ్డారు. "డర్టీ గేమ్, ఫ్రెండ్ అని పిలవకు" అంటూ రాముకి ఇచ్చిపడేశాడు గౌరవ్. "ఇన్నాళ్ళూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చినోడిని, ఇప్పుడు నామినేట్ చేయగానే శత్రువును అయ్యాను. కానీ చెప్పి మరీ నామినేట్ చేసినోడు చుట్టమైపోయాడు. నన్ను కళ్యాణ్ లాస్ట్ వీక్ సేఫ్ గేమ్.ఆడిందా? అని అడుగుతున్నాడు. లేదంటే మరి ఎందుకు నామినేట్ చేశావని అడిగాడు. ఇప్పుడే కాదు ఆమె ట్రోఫీ పట్టుకున్నా నేను అదే చేస్తాను" అని రీతూ - డెమోన్ లతో గుసగుసలు పెట్టాడు ఇమ్మూ.
"పర్మనెంట్ హౌస్ మేట్ గా మారే అవకాశం" అంటూ శ్రీజ, భరణీలను ఇంట్లోకి పంపారు బిగ్ బాస్. రాగానే "మళ్ళీ బాండింగ్ పెట్టుకోకు. బాండింగ్ మీద కామెడీ చేసి కంటెంట్ సంపాదించారు కొందరు. అందరూ కలిసి నన్ను బయటకు తోద్దామని చూసారు" అని తనూజాకు సలహా ఇచ్చాడు. మరోవైపు దివ్యను సముదాయించారు. "మాధురి అన్ని మాటలు అన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు" అంటూ పవన్ తో గొడవ పడింది రీతూ. "మీరు గతంలో చేసిన తప్పులను సరిద్దుకోవాలి" అంటూ రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరికీ మిర్రర్ పై వాళ్ళు ఏం మార్చుకోవాలి అన్న సలహాలు ఇవ్వండని హౌస్ మేట్స్ ను ఆదేశించారు బిగ్ బాస్. ఇక్కడ కూడా సంజన వర్సెస్ భరణి, దువ్వాడ మాధురి వర్సెస్ శ్రీజ దమ్ము మధ్య మాటల యుద్ధం జరిగింది.
Also Read: బిగ్‌బాస్ డే 49 రివ్యూ... కళ్యాణ్ వేషాలు... రీతూపై పచ్చళ్ల పాప రివేంజ... దువ్వాడ మాధురికి తనూజ ఝలక్





















