Bigg Boss 9 Telugu Today Episode - Day 4 Review: బిగ్‌బాస్‌లో నాలుగో రోజు... చపాతీ ముక్కతో గొడవ, ఇమాన్యుయేల్‌ను తప్పించిన మనీష్ - కెప్టెన్సీ టాస్కులో రచ్చ
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు 9 డే 4 ఎపిసోడ్ 5లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా ఫస్ట్ వారానికి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్‌లో ఏం జరిగిందంటే..

Bigg Boss 9 Telugu - Day 4 Episode 5 Review: బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారానికి గానూ కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇక ఇంట్లో నాలుగో రోజు రకరకాల గొడవలు జరిగాయి. ఓనర్స్ మధ్యలోనే గొడవలు జరిగాయి. ఇంట్లో మంటలు పుట్టిస్తున్న సంజనాకి బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. కన్ఫెషన్ రూంలోకి పిలిచి ఆమెకు మంచి ఆఫర్ ఇచ్చాడు. అలా ఫస్ట్ వారంలో కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. ఈ కెప్టెన్సీ టాస్కు కంటెండర్లను సంజనా సెలెక్ట్ చేసింది. ఇక గురువారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.
గుడ్డు దొంగతనంతో ఇల్లు అంతా పెంట పెంట చేసిన సంజనకి రెండు రోజులు ఇంట్లోకి నో ఎంట్రీ అంటూ ఓనర్స్ కండీషన్స్ పెట్టారు. భరణి, తనూజల్ని తన ఫ్యామిలీ మెంబర్లుగా రాము ఫీల్ అయ్యాడు. సుమన్ శెట్టి సిగరెట్లను సంజనా దొంగతనం చేసి పెట్టుకుంది. కానీ సంజన మాత్రం సిగరెట్ ప్యాకెట్ దొంగతనం చేయలేదని బుకాయిస్తూ వచ్చింది. అయితే ఇమాన్యుయేల్ మాత్రం సంజనా మీదే అనుమాన పడ్డారు. ఆ తరువాత ఇమాన్యుయేల్ లేడీ గెటప్‌తో కాస్త కామెడీ చేశాడు.
Also Read: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?
ఇక చెత్త కుప్పలో చపాతీ ముక్కని చూసి రీతూ, తనూజ, భరణి కాస్త హర్ట్ అయ్యారు. ఆ ముక్కని మా వాళ్లకి ఇచ్చినా ఆనందంగా తినేవాళ్లు కదా? అని ఓనర్స్‌తో అంటారు. దీంతో ఓనర్స్ మధ్య గొడవ అయింది. మనీష్, శ్రీజ, ప్రియ మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. అసలు వాళ్లకు ఎందుకు అంత చనువు ఇస్తున్నారు? ఎందుకు ఫుడ్ పెడుతున్నారు? ఎందుకు ఇంట్లోకి రానిస్తున్నారు? ఇకపై నాకు నచ్చినట్టుగా గేమ్ ఆడతాను అని మనీష్ కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు.
సంజనాని కన్ఫెషన్ రూంలోకి బిగ్ బాస్ పిలిచాడు. మీ ధైర్యానికి మెచ్చి ఓ ఆఫర్ ఇస్తున్నాను అని చెప్పాడు. ఫస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్లను సెలెక్ట్ చేసే ఛాన్స్‌ని సంజనాకి ఇచ్చాడు. కనీసం ఇద్దరు ఓనర్లను అయితే సెలెక్ట్ చేయాలని చెప్పాడు. దీంతో హరీష్, పవన్, ఇమాన్యుయేల్, శ్రష్టిలను ఎంచుకుంది. తన పేరుని కూడా అందులో చేర్చుకుంది. ఇదే విషయాన్ని బయట కంటెస్టెంట్లకు కూడా వివరించింది. మా పేర్లను ఎందుకు చెప్పలేదు? మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని మనీష్, ప్రియ, శ్రీజ, కళ్యాణ్ ఇలా అందరూ ప్రశ్నించారు.
First captaincy task lo game nunchi #Emmanuel ni eliminate chesina #ManishMaryada 🧢💥
— Starmaa (@StarMaa) September 11, 2025
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/wKgQYM1g1i
కెప్టెన్ అయ్యే అర్హత ఉన్న వాళ్లను సెలెక్ట్ చేసుకోవాలి కదా? అని మనీష్, కళ్యాణ్ ఇలా అందరూ సంజనను నిలదీశారు. తనకు క్లోజ్ అయిన వాళ్లని నేను సెలెక్ట్ చేసుకున్నాను అని సంజనా చెప్పింది. కంటెండర్లు కాకుండా.. సపోర్టర్లు ఆట ఆడతారు అని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అలా చివరకు ఇమ్ము కోసం భరణి, శ్రష్టి కోసం రాము, సంజన కోసం శ్రీజ, పవన్ కోసం ప్రియ, హరీష్ కోసం కళ్యాణ్ ఆడారు. వదలకు బెదరకు అనే టాస్కులో మనీష్ సంచాలక్‌గా ఉన్నాడు. కర్రలపై నిలబడే ఈ టాస్కులో రెడ్ లైట్ వచ్చినప్పుడు.. ఓ కంటెండర్‌ను సంచాలక్ పిలుస్తాడు.. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు.. ఏ కర్రలు అయినా తీసేయొచ్చు. అలా చివరి వరకు ఎవరు నిలబడి ఉంటారు.. ఆ సపోర్టర్‌కు చెందిన కంటెండర్ కెప్టెన్ అవుతాడు.
Also Read: బిగ్ బాస్ సీజన్ 9లో సామాన్యలకు వేలల్లో... సెలెబ్రిటీలకు లక్షల్లో... ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?
అయితే మొదటి రెండు రౌండ్లలో పవన్, శ్రష్టిలను మనీష్ పిలుస్తాడు. ఇక మూడో రౌండ్‌లో ఇమాన్యుయేల్‌ను పిలుస్తాడు. రెడ్ లైట్ వచ్చినప్పుడు ఇమ్ముని మనీష్ పిలుస్తాడు. కానీ గ్రీన్ లైట్ వచ్చే ముందు ఆ కర్రల్ని ఇమ్ము తీశాడు. ఇది రూల్‌కు విరుద్దం అని మనీష్ అన్నాడు. అలా ఇమ్ము టీంని ఆట నుంచి తప్పిస్తాడు. మరి పవన్, శ్రష్టిలకు గ్రీన్ లైట్ రాలేదు అని ఎందుకు చెప్పారు? నాకు మాత్రం ఎందుకు చెప్పలేదు.. మీరు సంచాలక్‌గా ఫెయిల్ అంటూ పెద్ద గొడవ చేశాడు ఇమాన్యుయేల్. కానీ చివరకు సంచాలక్ మనీష్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ఇమ్ము టీంని పక్కన పెట్టేశాడు. మరి ఈ టాస్కులో గెలిచి మొదటి కెప్టెన్‌గా ఎవరు నిలుస్తారో చూడాలి.





















