అన్వేషించండి

Manikanta: సింపతీ స్టార్ మణికంఠ మీద 'ఓజీ' కుళ్లు... ఒక్కడిని టార్గెట్ చేస్తూ అసలు ఆట వదిలేశారేంట్రా?

Bigg Boss Manikanta: బిగ్ బాస్ 8లో నాగ మణికంఠకు సింపతీ స్టార్ అని ఆడియన్స్ కొందరు ట్యాగ్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆ స్టార్ మీద మిగతా ఓల్డ్ కంటెస్టెంట్లలో జలసీ అతనికి ప్లస్ అవుతోందా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss 8) ఇంటిలో ఓల్డ్ కంటెస్టెంట్లు వర్సెస్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు కంటే... నాగ మణికంఠ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్లు అన్నట్లు డిస్కషన్ జరుగుతోంది. సింపతీ స్టార్ మీద ఓజీ క్లాన్ సభ్యులు పెట్టిన డిస్కషన్ అతనికి ప్లస్ అవుతోందని చెప్పాలి. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ ఇంటిలో మణికంఠ ప్రతి అడుగు సంచలనమే!
బిగ్ బాస్ 8 ఇంటిలో నాగ మణికంఠ అడుగు పెట్టిన క్షణం నుంచి ఆ అబ్బాయి మాట్లాడిన ప్రతి మాట, చేసిన ప్రతి పని, ఆడిన ప్రతి ఆట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తల్లి చనిపోయిన మరుక్షణం సవతి తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చేశానని, తనను తన భార్య వదిలేసిందని మణికంఠ చెప్పిన మాటలతో చాలా మంది కనెక్ట్ అయ్యారు. అయితే... తర్వాత అతడు సింపతి గేమ్ ఆడుతున్నాడని కొందరు గ్రహించారు. స్నేహం పేరుతో అమ్మాయిలకు హగ్గులు ఇస్తున్న విషయం కూడా వైరల్ అయ్యింది.

నాగ మణికంఠకు 'సింపతీ స్టార్' అని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ బిరుదు ఇచ్చారు. బిగ్ బాస్ ఇంటిలో సభ్యులకు కూడా అతని గేమ్ గ్రహించారు. అయితే తమ గేమ్ మీద కాన్సంట్రేషన్ పక్కన పెట్టి... అతడి గురించి డిస్కషన్ పెడుతున్నారు. అది వాళ్లకు మైనస్, మణికంఠకు ప్లస్ అవుతోంది. 

ఇంటిలో కొత్తగా అడుగుపెట్టిన గంగవ్వ సైతం 'ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావు' అని మణికంఠ మీద సెటైర్ వేసింది. అంతే కాదు 'పెళ్ళాం పిల్లలు అంతగా గుర్తు వస్తే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో' అని కూడా చెప్పింది. కావాలని మణికంఠ తన మీద సింపతి వచ్చేలా చేస్తున్నాడు. అది వర్కౌట్ కావడంతో ప్రతిసారి నామినేషన్లలో ఉన్నప్పటికీ సింపతి ఓట్లతో సేవ్ అవుతున్నాడు. అతడి మీద ఆ సింపతీ రాకుండా చేయాలని మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నారు.

Also Read: సోనియా బయటకు వచ్చాక యష్మీ గౌడ రంగు బయట పడుతోందా... కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ మీద నెగెటివిటీ షురూ?


ఒక్క నబిల్ తప్ప మిగతా అందరూ అంతే!
బిగ్ బాస్ ఇంటిలో ఓల్డ్ కంటెస్టెంట్లకు 'ఓజీ' క్లాన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్లాన్ సభ్యుల్లో వరంగల్ యువకుడు నబీల్ తప్ప మిగతా అందరూ మణికంఠని చూసి కుళ్ళిపోతున్నారు. ఆరో వారం నామినేషన్ తర్వాత కూడా ఓల్డ్ కంటెస్టెంట్లు అంతా కలిసి మణికంఠ గురించి డిస్కషన్ పెట్టారు. తమ ఆట ఆడటం మానేసి అతడి మీద చర్చ పెట్టడాన్ని కొంత మంది ఆడియన్స్ తప్పుపడుతున్నారు. 

'వచ్చే వారం మనం మణికంఠని నామినేట్ చేయొద్దు. వాడికి ఇంకా సింపతి వచ్చేస్తుంది' - అని నిఖిల్ చెప్పడం చూస్తుంటే వాళ్ళందరూ మణికంఠ గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది. బహుశా... ముందుగా అందరూ అనుకునే ఈ వారం సింపతీ స్టార్‌ను నామినేట్ చేయలేదేమో!? మణికంఠకు సింపతి రాకుండా చేయడం ఎలా అని ఆలోచనలో పడి అసలు ఆటను పక్కన పెట్టేస్తున్నారు ఏమో అనే సందేహం కలుగుతుంది. తమ బృందంలో సభ్యుడు గురించి మిగతా వాళ్ళు అలా ఆలోచిస్తుంటే వాళ్ళ మీద ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళ్ళవూ! పాపం ఇంటిలో ఉన్న జనాలు ఆ సంగతి మరిచారు. కొత్తగా ఇంటిలోకి వెళ్లిన సభ్యులు ఆ విషయం అర్థం అయ్యేలా చెబుదామని ట్రై చేసినా వీళ్ళు వినే పరిస్థితిలో లేరు.

Also Readఓల్డ్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్... హీటెక్కిన నామినేషన్స్‌, 6లో నలుగురు లేడీసే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ratan Tata Death: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
Ratan Tata: అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
Nara Rohit : నారా కుటుంబంలో పెళ్లి సందడి -  హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
నారా కుటుంబంలో పెళ్లి సందడి - హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
Mahakali: ‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’... ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’... ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటాRatan Tata: జీవితాంతం మూగజీవాలకు సేవ చేసిన రతన్ టాటాRatan Tata News: చిన్న సంస్థల పాలిట దేవుడు, కొత్త ఐడియాలకు కొండంత అండఅపర కుబేరుడు రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ratan Tata Death: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
Ratan Tata: అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
Nara Rohit : నారా కుటుంబంలో పెళ్లి సందడి -  హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
నారా కుటుంబంలో పెళ్లి సందడి - హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
Mahakali: ‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’... ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’... ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
Next Successor of Ratan Tata: రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లియా- ఎవరు ఎందులో గొప్ప!
రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లియా- ఎవరు ఎందులో గొప్ప!
Ratan Tata Net Worth: రతన్ టాటాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా? నిజంగా మీరు నమ్మలేరు
రతన్ టాటాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా? నిజంగా మీరు నమ్మలేరు
Vettaiyan : ‘వేట్టయాన్‘ రిలీజ్ అని హాలీడేస్ ఇచ్చిన కంపెనీలు.. అదీ తలైవా రేంజ్ అంటే!
‘వేట్టయాన్‘ రిలీజ్ అని హాలీడేస్ ఇచ్చిన కంపెనీలు.. అదీ తలైవా రేంజ్ అంటే!
Share Market Opening: పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు - మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో టాటా స్టాక్స్
పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు - మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో టాటా స్టాక్స్
Embed widget