అన్వేషించండి

Yashmi Gowda: యష్మీ గౌడ మీద నెగెటివిటీ షురూ... సోనియా బయటకొచ్చాక ఆమె రంగు బయట పడుతోందా?

Bigg Boss 8: బిగ్ బాస్ 8లో సోనియా ఆకుల ఎవిక్ట్ రావడానికి వీక్షకులలో ఆమెపై ఏర్పడిన నెగిటివిటీ మెయిన్ రీజన్. ఇప్పుడు ఆ నెగిటివిటీ అంతా యష్మీ గౌడ మూట కట్టుకుంటోందా?

'తన కోపమే తన శత్రువు తన శాంతమే తన మిత్రుడు' అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ, ఆ విషయం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss - Season 8) కంటెస్టెంట్ యష్మీ గౌడ అర్థం చేసుకున్నట్లు లేరు. తన కోపంతో షో చూసే వీక్షకులలో నెగెటివిటీ మూట కట్టుకుంటున్నారని ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే అర్థమవుతోంది. లేటెస్ట్ వీక్ నామినేషన్స్ ప్రక్రియలో యష్మీ గౌడ వ్యవహరించిన తీరు చాలా మందికి నచ్చలేదు అనేది వాస్తవమని చెప్పాలి.

నామినేట్ చేస్తే రివెంజ్ తీర్చుకుంటుందా?
బిగ్ బాస్ 8 ఆరో వారం నామినేషన్స్ చూస్తే... ఎక్కువ మంది యష్మీ గౌడ (Yashmi Gowda)ను నామినేట్ చేశారు. అంత మంది తనను ఎందుకు నామినేట్ చేశారు?అని ఆవిడ ఆలోచించడం లేదు. పైగా, తనను నామినేట్ చేసిన వారి పట్ల రివెంజ్ తీర్చుకుంటానని అన్నట్లు వ్యవహరిస్తోంది.

'ఓకే ఇది గుర్తుంచుకుంటా' - ఇదీ యష్మీ గౌడ తనను నామినేట్ చేసిన తర్వాత చెప్పిన మాట. అంటే దాని అర్థం ఏమిటి? రాబోయే రోజుల్లో నా చేతుల్లో నీకు ఉంటుంది అన్నట్టే కదా! ఎవరైనా తనను నామినేట్ చేస్తే ఆ విషయం అసలు జీర్ణించుకోలేకపోతోంది. ఎందుకు నా గురించి వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు? నా ఆట ఏమైనా తప్పుగా ఉందా? లేదంటే నేను మాట్లాడే తీరులో గానీ, నేను నా భావాలు వ్యక్తం చేసే విధానంలో గానీ ఏమైనా తప్పుగా ఉందా? అని ఆలోచించడం మానేసి 'గుర్తుంచుకుంటా' అనడం ఆడియన్స్ అందరూ అబ్జర్వ్ చేశారు. కోపంలో ఏదేదో మాట్లాడుతుందని అనుకుంటున్నారు. ఇదే విధంగా కొనసాగితే యష్మీ గౌడ వీక్షకులలో ఇంకా నెగెటివిటీ కట్టుకోవడం ఖాయం. కోపం ఎవరికీ మంచిది కాదనే చిన్న లాజిక్ ఆవిడ ఎలా మిస్ అవుతుందో అర్థం కావడం లేదు.

సోనియా బయటకు వెళ్లాక యష్మి రంగు బయట పడిందా?
తెలంగాణ బిడ్డ సోనియా ఆకుల బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం వీక్షకులలో ఆమె మీద ఉన్న నెగిటివిటీ. నిఖిల్, పృథ్వీలను తన చెప్పు చేతుల్లో ఉంచుకుని తనకు కావలసినట్టు ఆట ఆడించిందని ఆడియన్స్ అంతా ఫీల్ అయ్యారు. చిన్నోడు, పెద్దోడుతో సోనియా ఆడిన ఆట నచ్చలేదు. అందుకే, ఆమెపై నెగెటివిటీ ఎక్కువ అయ్యి, నామినేషన్స్ తర్వాత అది ఓట్లు  రూపంలో బయట పడి ఆవిడ బయటకు వచ్చేలా చేసింది.

Also Read: ఓల్డ్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్... హీటెక్కిన నామినేషన్స్‌, 6లో నలుగురు లేడీసే

సోనియా ఆకుల బయటకు వచ్చిన తర్వాత యష్మీ గౌడ అసలు రంగు బయట పడుతుందని ఆడియన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. సోనియా బయటకు వచ్చే వరకు ఆవిడ మీద ఉన్న నెగెటివిటీ కారణంగా యష్మీ గౌడ ఎక్కువ హైలైట్ కాలేదు. ఇప్పుడు యష్మీ గౌడ ఓవరాక్షన్ చేస్తుందని, తన గురించి ఎవరేం చెప్పినా యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో లేదని జనాలు గుర్తిస్తున్నారు. యష్మీ గౌడతో ఫ్రెండ్షిప్ చేసే కంటెస్టెంట్లు సైతం నెగెటివిటీ ఎదుర్కోక తప్పదు ఏమో!? పృథ్వీ, నిఖిల్​ని రీజన్​గా చూపించి సోనియాను నామినేట్ చేసిన యష్మీ.. ఇప్పుడు వారిద్దరితోనే క్లోజ్​గా ఉంటూ.. హగ్స్​లో సోనియాను మించిపోతుందనే టాక్ ప్రేక్షకుల్లో ఉంది

Also Readకృష్ణకు పోటీగా 'బిగ్ బాస్ 8'లోకి వచ్చిన ముకుంద... మిస్ మైసూర్ to షో... యష్మీ గౌడ లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget